సాక్షి, నల్లగొండ/తుర్కపల్లి, న్యూస్‌లైన్: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. విద్యార్థుల హాజరుశాతం ఎక్కువగా చూపిస్తూ అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలు ఇకపై సాగవు. చాలామంది వార్డెన్లు చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళ్తున్నారు. ఇకనుంచి నిత్యం స్థానికంగా ఉంటూ హాస్టళ్లను పర్యవేక్షించక తప్పదు. హాస్టళ్లు, విద్యార్థుల వివరాలు పూర్తిగా ఆన్‌లైన్ చేస్తున్నారు. అంతేగాక వార్డెన్లు, సిబ్బంది వివరాలు పొందుపర్చుతున్నారు. వసతి గృహాలకు అవసరమైన వస్తువులు, సరుకులకు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు పూర్తయ్యింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో కూడా మొదలు పెట్టారు. త్వరలో అమలులోకి రానుంది.
పారదర్శకతకు పెద్దపీట..
జిల్లాలోని 69 బీసీ హాస్టళ్లలో 6138 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 54 మంది రెగ్యులర్ వార్డెన్లు ఉండగా, మరో 15 మంది మొదటి పేజీ తరువాయి
ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నా రు. హాస్టళ్ల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తేవడానికి అందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు. విద్యార్థి పేరు మొదలుకొని సదరు హాస్టల్‌లో ఉన్న మౌలిక వసతుల వరకు సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ చేస్తున్నారు. తద్వారా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, వార్డెన్ల పర్యవేక్షణ తదితర వాటిలో స్పష్టత రానుంది. చాలా హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతాన్ని అధికంగా చూపెడుతూ నిధులు దండుకుం టున్నారు. ఇకపై ఈ సమస్య ఉండదు. విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా తీసుకుంటారు. తద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిధుల ఖర్చు ఉంటుంది.
చెల్లింపులూ ఆన్‌లైన్ ద్వారానే....
వెబ్‌సైట్ వల్ల వసతి గృహాల నిర్వహణ తీరు ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు మాన్యువల్‌గా (చేతిరాత బిల్లులు) జరుగుతున్నా యి. త్వరలో ఈ చెల్లింపులన్నీ ఆన్‌లైన్ ద్వారా సాగుతాయి. హాస్టళ్లకు అవసరమైన సరుకులు, వస్తువులకు సంబంధించి చెల్లిం పులు కాంట్రాక్టర్ ఖాతాలో నేరు గా జమచేస్తారు. సరఫరా సక్రమంగా లేకుంటే బిల్లులు తక్షణమే నిలిపివేసే వెసులుబాటు ఉంది. తద్వా రా అక్రమాలకు చెక్ పడనుంది.
బయోమెట్రిక్ విధానం...
విద్యార్థులకు అందుబాటులో ఉం టున్న వార్డెన్ల సంఖ్య తక్కువ. నాలుగు రోజులకో, వారానికోసారి చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళుతున్నారు. అంతేగాక సిబ్బం ది కూడా సమయానికి వెళ్లడం లేదు. ఫలితంగా హాస్టళ్లలో విద్యార్థులు తింటున్నారా? లేదా? తిం టే ఎన్ని పూటలు? వీటిపై అధికారులకే స్పష్టత లేదు. వీటిని అడ్డుకట్ట వేయడానికి మొదటగా సిబ్బంది కోసం బయోమెట్రిక్ మిషన్లను హాస్టళ్లలో ఏర్పాటు చే యనున్నారు. అంతేగాక మూడు పూటలా వేలిముద్రలు సేకరిం చేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా పర్యవేక్షణ గాడిలో పడనుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మౌలిక వసతుల కల్పన మెరుగుపడనుంది.
పారదర్శకత కోసమే
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలకు మేరకు ఆన్‌లైన్ విధానాన్ని చేపట్టాం. ఈ పద్ధతి ద్వారా ప్రతి హాస్టల్ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలెంటో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. అంతేగాక వార్డెన్లు, సిబ్బంది పనితీరు అంచనా వేయవచ్చు. ఫలితంగా విద్యార్థులకు 100 శాతం న్యాయం చేకూరుతుం ది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లవుతుంది. ఇప్పటివరకు అన్ని హాస్టళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. విద్యార్థుల వివరాలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. నాలుగైదు రోజుల్లో ఇది పూర్తవుతుంది.
- రాజశేఖర్, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్
అంతా ఆన్‌లైన్
Published Tue, Aug 27 2013 6:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement