
అవమానభారంతోనే ఎన్టీఆర్ చనిపోయారు: నాయని
మెదక్: టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు అవమానభారంతోనే చనిపోయారని టిఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహా రెడ్డి చెప్పారు. సీఎం పదవి కోసం వైశ్రాయి హోటల్లో భేరసారాలు చేసుకున్నారని ఆయన తెలిపారు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర అవమానానికి గురయ్యారన్నారు.
తెలంగాణ కోసం ఒక్క రోజు కూడా పోలీసు దెబ్బలు తీనని, అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామా చేయకుండా పారిపోయిన వారే ఈరోజు తెలంగాణ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. 1969 ఉద్యమం తర్వాత ఉద్యమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాలేదనే బెంగతోనే నక్సలైట్లగా మారారని చెప్పారు. పోట్టీ శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోలేదని నాయని అన్నారు.