త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | NTR Sujala Sravanthi from Oct 2 says CH. Ayyanna patrudu | Sakshi
Sakshi News home page

త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Published Wed, Jul 23 2014 1:22 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పేరిట చేపట్టనున్న 'ఎన్టీఆర్ సుజల పథకం' అమలుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ పథకం కింద రూ.2 లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు.

తొలి విడతగా 450 గ్రామాల్లో అమలు చేస్తామన్నారు. వాటర్ ప్లాంట్ల నిర్వహాణను జిల్లాలోని పరిశ్రమకు అప్పగిస్తామని చెప్పారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖలో 2600 పోస్టుల భర్తీ చేసేందుకు ఇప్పటికే ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement