నీలకంఠరాజపురం(వేపాడ): ప్రాణాలైన అర్పిస్తాం- రైవాడ పైపులైన్‌ను అడ్డుకుంటామని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ చెప్పారు. పైపు లైన్ నిర్మాణం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలో నీలకంఠరాజపురం గ్రామసమీపంలో రైవాడ కాలువ వద్ద సీపీఎం,వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నేటికి 40 ఏళ్లుగా సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతుల ఆశలను పైపులైన్ నిర్మాణం ప్రతిపాదనలతో టీడీపీ ప్రభుత్వం ఆవిరి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు మూకల సత్యంనాయుడు, మల్లికార్జున రైతుసంఘం సభ్యులు బీలసతీష్, వేపాడ మండలరైతుసంఘం అధ్యక్షులు పి.త్రినాథ్, గిరిజన సంఘనాయకుడు కపాటి వెంకటరావు తదితరు రైతులు,మహిళలు పాల్గొన్నారు.