సముద్రజలాలపై రాష్ట్రానికే హక్కు: యనమల
సాక్షి, అమరావతి: తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్ర జలాలపై జరిగే లావాదేవీలపై పన్ను హక్కులను రాష్ట్రాలకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగిన 10వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేసినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఎగుమతులు, దిగుమతులపై ఐజీఎస్‌టీ యాక్ట్‌లో రాష్ట్ర అధికారులను మినహాయించడంపై తమ వాదనను వినిపించినట్లు పేర్కొన్నారు.