Minister yanamala
-
బీజేపీ మిత్రపక్షం.. అవిశ్వాసానికి మద్దతివ్వం
సాక్షి, అమరావతి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, టీడీపీ కీలక నాయకుల సమా వేశం జరిగింది. అనంతరం కళా వెంకట్రావు, యనమల విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాసానికి తామెందుకు మద్దతిస్తామని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరమైతే టీడీపీనే అవిశ్వాసం పెట్టవచ్చుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తాము ఇప్పటికీ ఎన్డీయేలోనే కొనసాగుతున్నామని, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ తామెలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రశ్నించారు. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే హోదాతో సహా విభజన హామీల కోసం పోరాడతామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి అసలు నిధులు ఇవ్వలేదని తాము అనడం లేదని.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకొచ్చామని.. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద ఇంకా కేవలం రూ.135 కోట్లు మాత్రమే వస్తాయని జైట్లీ చెప్పడం సమంజసం కాదని యనమల అన్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రశ్నకు యనమల బదులిచ్చారు. -
ప్రభుత్వ కొలువులో 30 ఏళ్లే!
-
కొలువులో 30 ఏళ్లే!
25వ ఏట ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే ఐదేళ్లు ముందుగానే ఇంటికి అందుకు అనుగుణంగా పెన్షన్ అర్హత 33 ఏళ్ల నుంచి 30కి తగ్గింపు - ఈ–ఆఫీస్ ద్వారా చకచకా కదిలిన ‘50 ఏళ్లకే ఇంటికి’ ఫైలు సాక్షి, అమరావతి: పనితీరు సరిగాలేదనే సాకుతో ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించేందుకు బాబు సర్కారు రూపొందించిన ఐదు ముసాయిదా జీవోలను లోతుగా అధ్యయనం చేసేకొద్దీ అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 30 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగ విరమణ చేయించడం ఇందులో ఒకటి. ఉదాహరణకు రామారావు అనే యువకుడు 25వ ఏట ప్రభుత్వ కొలువులో చేరితే 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసే నాటికి అతని వయసు 55 ఏళ్లు. ఈ లెక్కన 55 ఏళ్లు నిండగానే అతన్ని ఉద్యోగ విరమణ చేయించేందుకు వీలుగా ఉద్యోగుల ఫండమెంటల్ రూల్స్, పెన్షన్ నిబంధనల్లో సవరణలు తీసుకువస్తున్నారు. ఇదే జరిగితే రామారావు నిర్దిష్ట పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు నిండకుండానే ఐదేళ్లు ముందుగానే 55 ఏళ్లకే ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సంబంధిత అథారిటీ ప్రజా ప్రయోజనాల పేరుతో ఏ ఉద్యోగినైనా 30 సంవత్సరాల సర్వీసు పూర్తయ్యాక ఉద్యోగ విరమణ చేయించవచ్చని ఫండమెంటల్ రూల్స్ సవరణల్లో పేర్కొన్నారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగికి మూడు నెలలు ముందు రాత పూర్వకంగా నోటీసు ఇవ్వడం లేదా మూడు నెలల వేతనం ఇచ్చేసి ఇంటికి పంపించ వచ్చని సవరణల్లో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులే పూర్తి పెన్షన్‌కు అర్హులన్న నిబంధనను 30 ఏళ్లకు తగ్గిస్తూ పెన్షన్ రూల్స్‌లో కూడా సవరణలు చేశారు. పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఫండమెంటల్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్‌లో సవరణల పేరుతో రూపొందించిన ముసాయిదా జీవోలకు ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖలు ఆమోదం తెలిపాయి. ఈ–ఆఫీస్ ద్వారా ఫైళ్లు చకచకా పనితీరు ప్రాతిపదికన 50 ఏళ్లకే ఇంటికి పంపించే ఉద్యోగులకు సంబంధించిన ముసాయిదా జీవోల ఫైలు ఈ–ఆఫీస్ ద్వారా చకచకా ముందుకు కదిలింది. ప్రధాన ఫైలు (నెంబర్ జీఎడీ–56023/3/2017–ఏఎస్– పీయుఐ–జీఎడీ)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 14న ఆమోదం తెలిపారు. అనంతరం 18న ఈ ఫైలు (ముసాయిదా జీవోలు)ను మూడు భాగాలుగా ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖల ఆమోదం కోసం పంపించారు. ఆర్థిక శాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 20న, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి 21న, న్యాయ శాఖ కార్యదర్శి 24న ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు కూడా జోడించి తుది ఆమోదం కోసం 26న తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ముసాయిదా సిద్ధమైంది వాస్తవమే : యనమల ‘50 ఏళ్లకే ఇంటికి’ శీర్షికతో ఈనెల 29న ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరోక్షంగా అంగీకరించారు. ‘సాక్షి’ కథనంపై శనివారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ముసాయిదా జీవోలే లేవంటూ కొట్టిపా రేసిన ఆయన, ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం వెల్లువెత్తడంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆదివారం మాట మార్చారు.‘ముసాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక మంత్రిగా నేను సంతకం చేయలేదు. సీఎం సంతకం చేయలేదు. జీవో ఇవ్వాలంటే కేబినెట్ అమోదించాలి. జీవో ఇవ్వకుండానే ఇచ్చినట్లు సాక్షి పేర్కొంది. అధికార రహస్యాల చట్టం కింద సాక్షి పత్రిక, చానల్‌పై చర్యలు తీసుకుంటాం’అని తూర్పుగోదా వరి జిల్లా తునిలో మీడియాతో పేర్కొన్నారు. అయితే జీవోలు జారీ అయినట్లుగానీ, ఆర్థిక మంత్రి యనమల, సీఎం సంతకం చేశారనిగానీ, కేబినెట్ ఆమోదించారని గానీ ‘సాక్షి’ ఎక్కడా పేర్కొనలేదు. ముసాయిదా తయారైందని, వీటిని ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలు ఆమోదించాయని మాత్రమే ‘సాక్షి’ ప్రచురించింది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం: సీఎం తమది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘50 ఏళ్లకే ఇంటికి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల వయోపరిమితిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని స్పష్టం చేశారు. -
50 ఏళ్లకే ఇంటికి పంపించం: యనమల
భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ నిర్వాకాలను సాక్ష్యాలతో సహా ప్రజలముందు ఉంచుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘50 ఏళ్లకే ఇంటికి’ కథనంపై ఆయన స్పందించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ చేయించే జీవోలను అమలు చేసే యోచన ప్రభుత్వానికి లేదని యనమల చెప్పారు. శనివారం సాయంత్రం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జీవో ముసాయిదా కాపీలతో సహా ‘సాక్షి’ ప్రచురించినా అదంతా అవాస్తవమని యనమల చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -
రిటైర్ అయిన వెంటనే వారికి పదవి సరికాదు
జడ్జిలు, బ్యూరోక్రాట్లకు గవర్నర్ పదవిపై మంత్రి యనమల సాక్షి, న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు గవర్నర్ పదవులు కట్టబెట్టడం సరికాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమావేశంలో సీఎం చంద్రబాబు తరఫున యనమల పాల్గొన్నారు. గవర్నర్ల ఎంపికకు అర్హత విధానం ఖరారు చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ.. పదవీ విరమణ చేసిన కొంత కాలం తర్వాతే జడ్జిలు, బ్యూరోక్రాట్లను గవర్నర్ పదవికి ఎంపికకు పరిగణించాలని సూచించారు. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్లు చేసే సిఫార్సులను ఆమోదించొద్దని మంత్రి యనమల కేంద్రాన్ని కోరారు. ఏదైనా బిల్లును ఆమోదించడానికి లేదా రాష్ట్రపతికి పంపడానికి గవర్నర్‌కు నెల రోజుల గడువు ఇవ్వాలన్నారు. -
స్పీకర్ స్థానాన్నే శాసిస్తారా?
-
సీఎం డైరెక్షన్... చీఫ్ విప్ యాక్షన్
-
స్పీకర్ స్థానాన్నే శాసిస్తారా?
- అసెంబ్లీలో సీఎం డైరెక్షన్... చీఫ్ విప్ యాక్షన్ - విపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా వాయిదా సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: శాసనసభలో పార్టీలకు అతీతంగా తటస్థంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థానాన్ని అధికార టీడీపీ శాసిస్తోంది. సభను ఎలా నడిపించాలో, ఎప్పుడు వాయిదా వేయాలో, సభలో మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వొద్దో అన్నీ నిర్దేశిస్తోంది. బుధవారం అసెంబ్లీలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించడం ప్రజాస్వామ్యవాదులను నివ్వెరపరిచింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు యాక్షన్‌లోకి దిగారు. సీఎం కోరుకున్నట్లే సభ వాయిదా పడింది. అసెంబ్లీ నిబంధనలను సవరిం చాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు లేచి ప్రతిపక్ష నేత జగన్‌కి మైక్ ఇవ్వొద్దని, సభా సంప్రదాయాలపై రూలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు లేచి విపక్ష నేతకు మైక్ ఇవ్వొద్దని మంత్రి చెప్పడం సరికాదన్నారు. జల సంరక్షణపై విపక్ష నేత ప్రతిజ్ఞ చేసేందుకే వచ్చారేమో అనగానే సీఎం ఆదరాబాదరాగా లేచి విపక్షం చేద్దామంటే (వారి అభిప్రాయం అడగకుండానే) రెండోసారి ప్రతిజ్ఞ చేద్దాం, లేవండి.. అని అధికార పక్ష సభ్యులను కోరా రు. వారు లేవగానే బాబు తన వెనుక నిల్చు ని ఉన్న చీఫ్ విప్ శ్రీనివాసులుతో ‘ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించు’ అని సూచించారు. దీంతో కాలువ తల ఊపుతూ, చేయి తిప్పుతూ స్పీకర్‌కు సైగ్ చేశారు. సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేయడం గమనార్హం. ఈ దృశ్యాలు వీడియోలో కనిపించాయి. -
అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా
⇒ 13న ఉభయ సభలు జరగవు... బడ్జెట్‌పై బీఏసీలో నిర్ణయం ⇒ భూమా మృతికి 14న శాసనసభ, మండలిలో సంతాప తీర్మానం సాక్షి, అమరావతి: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మృతితో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. భూమా మృతి కారణంగా 13వ తేదీన ఉభయ సభలు జరగవని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశమవుతాయని, భూమా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుందని, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయిస్తారని వెల్లడించారు. 13వ తేదీన ఉదయం జరగాల్సిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం కూడా రద్దయింది. -
సమాధానం చెప్పకుండా ఉలికిపాటెందుకు?
⇒ ఆర్థిక మంత్రి యనమలపై వైఎస్సార్సీఎల్పీ ధ్వజం ⇒ జగన్ ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేరా? సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వృద్ధి రేటు గొప్పగా పెరిగితే ఆ మేర రాష్ట్రానికొచ్చే పన్నుల ఆదాయం పెరగాలి కదా అని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సూటిగా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘కేంద్ర స్థూల ఉత్పత్తి 7.3 శాతం పెరిగితేనే కేంద్రానికి 24 శాతం పన్నుల రాబడి పెరిగిందని, రాష్ట్రంలో వృద్ధి రేటు 11 శాతం పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయంలో పెరుగుదల 8 శాతానికే పరిమితం కావడానికి కారణం ఏమిటని అసెంబ్లీలో గవర్నర్ సందేశం తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జగన్మోహన్రెడ్డి స్పష్టంగా అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అనవసరమైనవన్నీ మాట్లాడారు’ అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సభలో మాట్లాడిన అంశాలపై చర్చ ఇంకా పూర్తి కాకపోయినా, హడావుడిగా ఆర్థిక మంత్రి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని బుగ్గన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభలో సరిగా జవాబు చెప్పలేరని ఉలిక్కిపడ్డారా? అని నిలదీశారు. జగన్ చదువు గురించి మాట్లాడేవారు చదివిందేందో.. ప్రతి దానికి హేళన చేయడం యనమల వయసుకు సరికాదని బుగ్గన హితవు పలికారు. ‘జగన్మోహన్రెడ్డి చదువు గురించి యనమల ఏదో మాట్లాడతారు. ఇంతకూ యనమల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివారా? ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదవారా? ఆయన ఉండే ప్రాంతం పక్కనే ఆం«ధ్రా యూనివర్సిటీ ఉన్నా చదివింది మధ్యప్రదేశ్‌లోని సాగర్ యూనివర్సిటీలో. మేం చదువుకున్న స్కూళ్లు, మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. హేళన చేయడం మాకు నేర్పలేదు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్పారు. మీ పద్ధతి ఏంది? ఆర్థిక మంత్రిగా రోశయ్య మంచి పేరు సంపాదించుకున్నారు, రోశయ్య ఏం చదివారో మీకు తెలియదా?’ అని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. -
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
-
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాక్షి, అమరావతి: వృద్ధి రేటును ఎక్కువగా చూపించలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కావాలని ఎక్కువ చూపించామంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. యనమల మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఒక మెథడాలజీ ప్రకారం దీని లెక్కింపు జరుగుతుందన్నారు. 2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం 12.61 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పర్ క్యాపిటా ఇన్‌కం 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,08,163, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం రూ.1,22,376 ఉందని వెల్లడించారు. జీఎస్డీపీ 2014–15లో రూ.5,26,470 కోట్లు, 2015–16లో రూ.6,09,934 కోట్లు, 2016–17లో 6,99,307 కోట్లు ఉందన్నారు. -
ప్రాదేశిక జలాల పరిధిలో రాష్ట్రాలకే హక్కు
సీజీఎస్టీలో నిబంధన: యనమల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల ప్రాదేశిక జలాల పరిధిలో జరిగే వస్తు సేవల లావాదేవీలపై పన్ను పరిధిని రాష్ట్రాలకు కట్టబెడుతూ సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) చట్టంలో తగిన నిబంధన పొందుపరిచినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శనివారం ఇక్కడ జరిగిన 11వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్న అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాల ప్రాదేశిక జలాల పరిధిలో జరిగే వస్తు సేవల లావాదేవీలకు సంబంధించి పన్ను పరిధిని రాష్ట్రాలకే కట్టబెట్టాలని యనమల ఇదివరకే జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్‌కు లేఖ రాశారు. ఈ విన్నపాన్ని అంగీకరిస్తూ ముసాయిదాలో తగిన నిబంధన రూపొందించిందని యనమల తెలిపారు. -
సముద్రజలాలపై రాష్ట్రానికే హక్కు: యనమల
సాక్షి, అమరావతి: తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్ర జలాలపై జరిగే లావాదేవీలపై పన్ను హక్కులను రాష్ట్రాలకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగిన 10వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేసినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎగుమతులు, దిగుమతులపై ఐజీఎస్టీ యాక్ట్‌లో రాష్ట్ర అధికారులను మినహాయించడంపై తమ వాదనను వినిపించినట్లు పేర్కొన్నారు. -
బాబువన్నీ ‘బాటా’ లెక్కలు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవి పెట్టుబడి లెక్కలా? లేక ‘బాటా’ కంపెనీ లెక్కలా? అని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పరిపాలనలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించినవన్నీ అసత్యాలేనని బుగ్గన చెప్పారు. ఇక గణతంత్ర దినోత్సవం రోజు రాత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. 2015–16లో భాగస్వామ్య సదస్సు ద్వారా 328 సంస్థలతో 4.62 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నామని, తద్వారా 8.72 లక్షల మందికి ఉపాధి వస్తున్నట్లుగా తెలిపారన్నారు. వాటిల్లో రూ 1.93 లక్షల కోట్ల పెట్టుబడి ఏపీకి వచ్చేసినట్లు 2.27 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చంద్రబాబు ప్రకటించారని బుగ్గన గుర్తు చేశారు. ఇక భాగస్వామ్య సదస్సుకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ.. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకూ రూ. 5.3 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు వచ్చేసినట్లు 10 లక్షల మందికి ఉపాధి వస్తున్నట్లు, 629 సంస్థలు యూనిట్ల స్థాపనకు సిద్ధమైపోయినట్లు, 2.6 లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించినట్లు 3.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని బుగ్గన అన్నారు. 13 సార్లు దావోస్ వెళ్లానని చెప్పుకున్న చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తేగలిగారని ప్రశ్నించారు. తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి దావోస్‌కు వెళ్లకుండానే పరిశ్రమలు భారీగా తేగలిగారన్నారు. పరిశ్రమలకు స్వర్ణయుగం అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనేనని.. ఆయన హయాంలో 2004–09 మధ్య పరిశ్రమల అభివృద్ధి 11 శాతంగా ఉందన్నారు. ఆయన ఏనాడూ దావోస్‌కు వెళ్లలేదన్నారు. -
మార్చి 6న బడ్జెట్!
మార్చి 1వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తేదీలకు సీఎస్ ఆమోదం.. ఆర్థిక మంత్రికి ఫైలు సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించని చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 18 పనిదినాల్లో ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన గవర్నర్ ఉభయసభలనుద్దేశించి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 6వ తేదీన వార్షిక (2017–18) బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. మార్చి 27వ తేదీతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. అంటే సెలవు రోజులు పోను బడ్జెట్ సమావేశాలు 18 రోజులు జరగనున్నాయి. సమావేశాల తేదీల ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ శుక్రవారం ఆమో దం తెలిపి ఆ ఫైలును ఆర్థిక మంత్రి ఆమో దానికి పంపించారు. ఆర్థిక మంత్రి ఆమోదం అనంతరం ముఖ్యమంత్రి, గవర్నర్ల ఆమో దానికి ఫైలు వెళ్లాల్సి ఉంది. -
మోసం చేస్తున్నారు
బాబు, యనమలపై ధ్వజమెత్తిన బొత్స సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 12.33 శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసుకుంటున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని, వారు కాకి లెక్కలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గత ఏడాది 10.99, ఇటీవలి ఆరు నెలల్లో 12.33 శాతం అభివృద్ధి నమోదైందని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. నిజంగా వృద్ధి నమోదైతే దాని ప్రభావం రాబడి (రెవెన్యూ) మీద కనిపిస్తుందన్నారు. గత ఏడాది రెవెన్యూలో వృద్ధి 25.9 శాతమైతే, జీడీపీగా 7.3 శాతం నమోదైందని వెల్లడించారు. ఈ ఏడాది 12.33 శాతం వృద్ధి రేటు చూపించారని... ఆ ప్రకారం చూస్తే రెవెన్యూలో 40 శాతం పెరిగి ఉండాలని వివరించారు. కానీ రెవెన్యూలో 10 కంటే ఒక్క శాతం కూడా వృద్ధి కాలేదని తెలిపారు. తాను చెప్పేది సరి కాదంటే... ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఆదాయాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదని.. సీఎం, మంత్రులు, టీడీపీ నేతల ఆదాయమే పెరిగిందన్నారు. -
సహకార ఉద్యమ బలోపేతానికి ప్రోత్సాహం
సహకార ఉద్యమం, బలోపేతం, మంత్రి యనమల ఆర్థిక మంత్రి యనమల బోట్‌క్లబ్ (కాకినాడ): రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం, సహాయం అందిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్థానిక రామారావుపేటలో కొత్తగా నిర్మించిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ గొడౌన్, కార్యాలయ భవనం, 50 కేవీ రూఫ్ టాప్ సోలార్ ఫ్లాంట్లను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల మంగళవారం ప్రారంభించారు. యనమల మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థ అన్నారు. సహకార వ్యవస్థ బలోపేతమైతే ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. డీసీఎంఎస్‌లు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు« దోహదం చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను తిరిగి లాభాల బాటలోకి తెచ్చిన సంస్థ చైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్లను అభినందించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ డీసీఎంఎస్ ఎరువుల వ్యాపారంతో పాటు లాభసాటైన అన్ని వ్యాపారాలను చేపట్టి ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. డీసీఎంఎస్‌లకు సామర్లకోట, తుని, అమలాపురం పట్టణాల్లో విలువైన స్థలాలు ఉన్నాయని, వాటిని షాపింగ్ కాంప్లెక్సులుగా నిర్మించి ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినాడు సంస్థ రూ.కోటి 25 లక్షల నష్టాల్లో ఉండేదని, ప్రస్తుతం రూ.రెండు లక్షల లాభంలో ఉందన్నారు. నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనంపై 50 కేవీ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా సొంత అవసరాలు తీరతాయని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, చిర్ల జగ్గిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS ఎ¯ŒS.వీర్?రడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఆర్నెల్లకే రూ. 6,600 కోట్ల రెవెన్యూ లోటు
తొలి అర్ధసంవత్సర ఫలితాలపై మంత్రి యనమల సమీక్ష సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి గడచిన ఆరు నెలల్లో రూ. 58,912 కోట్ల ఆదాయం రాగా ఖర్చుమాత్రం రూ. 65,315 కోట్లు అయిందని ఆర్థిక మంత్రి యనమల అన్నారు. వార్షిక రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు ఉంటుందని అంచనా వేశామని, అయితే అది ఆర్నెల్లకే రూ.6,641 కోట్లకు చేరుకుందన్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో తొలి అర్ధ సంవత్సర ఫలితాలను మంత్రి యనమల సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం రూ.20,097 కోట్లు అప్పు చేయాలనుకుంటే, అర్ధ సంవత్సరంలోనే అప్పు రూ.13,673 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళా గ్రూపులకు ఈ నెలాఖరుకు రెండో విడత పెట్టుబడి నిధి కింద రూ.3 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. అప్పులు చేసి బండి లాగుతున్నామని మంత్రి యనమల అన్నారు. -
సభలో విపక్ష సభ్యుల తీరు అమానుషం
అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదన సందర్భంగా యనమల సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గత మూడు రోజుల్లో విపక్ష సభ్యులు అనుసరించిన తీరు అమానుషమని, దౌర్జన్యానికి దిగారని, స్పీకర్‌పైనే పేపర్ బాల్స్ విసిరారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు రోజులుగా సభలో జరిగిన సంఘటనలను పరిశీలించి బాధ్యులపై చర్యల కోసం సభా హక్కుల కమిటీ సిఫార్సు చేయాలంటూ శనివారం అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభాపతి సభామోదం నిమిత్తం ప్రతిపాదించారు. దీనిపై మాట్లాడిన అధికార పక్ష సభ్యులు అనిత, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు తీర్మానాన్ని బలపరిచే మిషతో విపక్షనేతను టార్గెట్ చేసుకుని కించపరిచేలా మాట్లాడారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కూడా మాట్లాడారు. అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్ష నేతను మాట్లాడవద్దన్న స్పీకర్ తమను, తమ నేతను అవహేళన చేసేలా అధికార పక్ష నేతలు మాట్లాడటం పట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ తమ నేతకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మీరు మీ స్థానాల్లోకి వెళితే అందరూ మాట్లాడవచ్చు’ అని స్పీకర్ అన్నారు. విపక్ష సభ్యులు వెనక్కు వెళ్లగా ప్రతిపక్షనేతకు స్పీకర్ మైక్ ఇచ్చారు. జగన్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు సిద్ధపడే లోపే ‘జగన్మోహన్రెడ్డీ మీరు మాట్లాడటానికి ఏమీ లేదు’ అంటూ స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. మరి మైక్ ఎందుకు ఇచ్చారని విపక్ష నేత ప్రశ్నించగా ‘నేను మైక్ ఇచ్చి మాట్లాడాలని చెప్పలేదు’ అని స్పీకర్ అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల మొత్తం ఫుటేజీని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కె.నారాయణస్వామితో కలిసి మాట్లాడారు. ఉదయం జరిగిన అసెంబ్లీ వీడియో క్లిప్పింగులను మధ్యాహ్నానికి ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. -
యనమల అధికార దుర్విని‘యోగం’
తమ్ముడి కోసం అడ్డగోలు జీవో ఏకంగా నాలుగు రెట్లు పెంచేసిన అద్దె మరీ అంత ‘పచ్చ’ పాతమా సాక్షిప్రతినిధి, తుని : ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటీ’అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు. వరుసకు సోదరుడైన కృష్ణుడు కోసం ఏకంగా జీవోనే జారీ చేసి లాభాన్ని సమకూర్చారు మంత్రి వర్యులు. తమ్ముడి కోసం తుని నియోజకవర్గంతో ఉన్న 30 ఏళ్ల రాజకీయ అనుబంధాన్నే వదులుకున్నారాయన. చివరకు కుటుంబ సభ్యులను కూడా కాదని రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు చేతుల్లో పెట్టారు. అదంతా వ్యక్తిగతం అనుకున్న నియోజకవర్గ ప్రజలకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆగ్రహం రప్పిస్తోంది. ఇంకా పూర్తికాకుండా నిర్మాణంలో ఉన్న తమ్ముడి భవనంలో తన శాఖకు చెందిన కార్యాలయాన్ని అద్దెకు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక మంత్రి యనమల చేతిలో ఉండటంతో ఈ ఆయాచిత లబ్థి చేకూర్చేందుకు తలపడడం అధికార దుర్వినియోగానికి పరాకాకష్టగా నిలుస్తోందరని పలువురు మండిపడుతున్నారు. తెరదీసింది ఇలా... వాణిజ్య పన్నులశాఖకు తునిలో సర్కిల్ కార్యాలయం రాణి సుభద్రయ్యమ్మపేటలో ఉంది. గత 30 ఏళ్లుగా కంకిపాటి రాములకు చెందిన భవనంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం నడుస్తోంది. వాణిజ్య పన్నులుశాఖ నెలకు రూ.12,000లు అద్దె చెల్లిస్తోంది. ఆరేళ్ల క్రితమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖలు రాశారు. అధికారులు ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని ఖాళీచేసి మరో భవనంలోకి మార్పు చేయాలని అధికారులు భావించారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా మంత్రి సోదరుడు కృష్ణుడు దృష్టికి వెళ్లడంతో అన్నగారితో మంతనాలు జరిపి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అద్దెలోనూ హస్తలాఘవాలే... నిర్మాణం కూడా పూర్తికాని భవనంలో రెండు ఫ్లోర్లకు సంబంధించి 7వేల చదరపు గజాలను కార్యాలయం కోసం అద్దెకు తీసుకోవడానికి జీఓ విడుదల చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అందుకు నిర్థారించిన అద్దె కూడా ఆషామీషీగా లేదు. తన తమ్ముడే కదా అని యనమల ఉదారంగా ఇప్పుడున్న అద్దెకు నాలుగు రెట్లు ఎక్కువగా నిర్థారించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. రూ.12000లు ఉన్న అద్దెను రూ.50 వేలు పైచిలుకు చెల్లించేలా జీఓ విడుదలవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కార్యాలయం నడుస్తోన్న భవనంలో 8 వేల చదరపు అడుగులకు నెలకు రూ.12 వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా భవనంలో 7వేల చదరపు అడుగులకు నెలకు అద్దె రూ.50వేలు పైచిలుకుకు ఖాయం చేశారు. ఇప్పుడున్న స్థలం కంటే ఎక్కువగా విస్తీర్ణం ఉందా అంటే అదీ లేదు. ఈ బహుళ అంతస్తుల భవనం తుని పట్టణం శివారున ఉంది. భవనం నిర్మిస్తున్న ప్రాంతం సగం మున్సిపాలిటీ, సగం ఎస్. అన్నవరం పంచాయితీలో ఉంది. ప్రస్తుత కార్యాలయం నిర్వహిస్తున్న భవనం తుని పట్టణం మ«ధ్యలో అందరికీ అందుబాటులో ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రధాన కూడలిలో ఉన్న భవనాలకు ఎస్ఎఫ్టీ రూ.6 నుంచి రూ.7లు అద్దె ఉంది. పట్టణానికి శివారులో 1000 ఎస్ఎఫ్టి ఉన్న ప్లాటుకు రూ.5000 అద్దె పలుకుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసినా ఏడు వేల చదరపు అడుగులకు రూ.35 వేలు సరిపోతుంది. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట వాణిజ్యపన్నులశాఖ చేతిలో ఉందికదా అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. రూ.12వేలు అద్దె ఉన్న కార్యాలయానికి పెద్దమొత్తంలో పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? పట్టణ నడిబొడ్డున ఇప్పుడున్న అద్దెకు అనేక బిల్డింగ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ పట్టణానికి శివారున నిర్మాణం కూడా పూర్తికాకుండానే తమ్ముడు భవనాన్ని అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం. దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
‘గూడు’పుఠాణి
ఇళ్లు ఎగరేసుకుపోయిన మంత్రి సగానికి పైగా యనమల సొంత నియోజకవర్గానికే.. జిల్లాకు ప్రభుత్వం కేటాయించినవి 9,995 అమాత్యుని ఖాతాలో వేసుకున్నవి 5,904 మిగిలిన ఎమ్మెల్యేలకు నామమాత్రపు కేటాయింపులు తునిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వని వైనం అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇళ్లు ఇచ్చేస్తాం, రుణాలు ఇచ్చేస్తాం, రేషన్‌కార్డులు ఇస్తామంటూ ఇప్పటివరకూ టీడీపీ ఎమ్మెల్యేలు నమ్మబలికారు. తీరా ఆచరణకు వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంది. మిగిలినవాటి మాటేమో కానీ ఇళ్ల మంజూరు విషయంలో వారి మాటకు గడ్డిపోచపాటి విలువ కూడా లేకుండా పోయింది. జిల్లాకు మంజూరైన ఇళ్లల్లో సగానికి పైగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎగరేసుకుపోయారు. దీనిపై ‘దేశం’ ఎమ్మెల్యేలే కారాలూ మిరియాలు నూరుతున్నారు. సింహభాగం యనమలకే. జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ పక్కకు నెట్టేసి, మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు మంజూరైన ఇళ్లలో సగానికి పైగా ఇళ్లను తన సొంత నియోజకవర్గం తునికి ఎగరేసుకుపోయారు. జిల్లా అంతటికీ కలిపి 9,995 ఇళ్లు మంజూరైతే యనమల ఒక్కరే 5,904 ఇళ్లు తన ఖాతాలో వేసేసుకున్నారు. డిప్యూటీ సీఎంకూ మొండిచెయ్యే.. ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు కూడా ఇళ్ల కేటాయింపులో మొండిచెయ్యే చూపారు. అటు సొంత నియోజకవర్గం అమలాపురానికి కానీ, ఇటు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురానికి కానీ యనమల స్థాయిలో ఇళ్ల కేటాయింపులు చేసుకోలేక రాజప్ప చేతులెత్తేశారు. అమలాపురానికి 127, పెద్దాపురానికి 213 ఇళ్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉండి కూడా రాజప్ప తన రెండు నియోజకవర్గాలకూ తన హోదాకు తగిన స్థాయిలో ఇళ్లు కేటాయించుకోలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు. కారణమేమిటో తెలీదు కానీ.. ఒక్క రామచంద్రపురం నియోజకవర్గానికి మాత్రం 1,133 ఇళ్లు కేటాయించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, కాకినాడ : చంద్రబాబు ప్రభుత్వంలో నంబర్–2గా ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహార శైలి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మింగుడుపడటం లేదు. జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయాలు జరిగేటప్పుడు అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఆయనపై ఉన్నాయి. తాజాగా నిరుపేదలకు ఇళ్ల మంజూరులో కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికీ 1250 ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు. అయితే దీనికింద సిటీ నియోజకవర్గాలకు ఇళ్లు కేటాయింపు లేదు. జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో రెండు సిటీ నియోజకవర్గాలు. మిగిలిన 17 నియోజకవర్గాలకు కలిపి 21,250 ఇళ్లు రావాలి. కానీ చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. గత ఏప్రిల్ నెలలో జిల్లాకు మొక్కుబడిగా 9,995 ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపేసుకున్నారు. అంటే 11,255 ఇళ్లకు కత్తెర వేశారు. పోనీ మంజూరైన ఇళ్లనైనా అన్ని నియోజకవర్గాలకూ సమానంగా కేటాయించలేదు. అలా జరిగి ఉంటే ప్రతి నియోజకవర్గానికి 587 ఇళ్లు వచ్చేవి. ఇవేవీ పట్టించుకోకుండా.. ఎమ్మెల్యేలనందరినీ కాదని సగానికి పైగా ఇళ్లు పట్టుకుపోయిన యనమల.. పోనీ అక్కడ ప్రజల మద్దతుతో ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఏమైనా ప్రాధాన్యం ఇచ్చారా అంటే అదీ లేదు. తన అనుచరగణానికి, తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే మంత్రి ఈవిధంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పలు హోదాల్లో పని చేసిన యనమల కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేనే కదా! ఎమ్మెల్యేగా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారో ఆయనకు ప్రత్యేకించి చెప్పాలా?’ అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎలా తిరగాలి? చంద్రబాబు ప్రకటనతో నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నారు. సీఎం చెప్పిన ప్రకారం నియోజకవర్గానికి 1,250 ఇళ్లు వస్తాయని భావిస్తున్న ప్రజలు.. ఇళ్ల కేటాయింపుల కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదు. వారికి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని కోనసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారు. అసలే అరకొర కేటాయింపులు.. అందులోనూ యనమలకు ప్రత్యేక కోటా అంటే ఇక నియోజకవర్గాల్లో తాము ఎలా తిరగాలని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు మంజూరైన ఇళ్లను నియోజకవర్గాలకు సమానంగా కేటాయిస్తారని ఎదురుచూస్తే.. సగానికి పైగా ఇళ్లను యనమల లాగేసుకోవడంపై మిగిలిన ఎమ్మెల్యేలు కస్సుబుస్సుమంటున్నారు. ‘పలుకుబడి ఉంది కదా అని ఇలా ఇళ్లన్నీ ఎగరేసుకుపోతే మాలాంటివాళ్లం ఏం చేయగలుగుతాం?’ అని కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గద్దెనెక్కాక పేదలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయామనే బాధ కంటే అందరికంటే యనమల ఎక్కువ ఇళ్లు పట్టుకుపోవడాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. తునిలో ప్రజా వ్యతిరేకతతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన యనమల.. ఇలా ఇళ్లు ఎగరేసుకుపోవడం పార్టీ జిల్లా నేతల్లో చర్చనీయాంశంగా మారింది. మొక్కుబడి కేటాయింపులు జిల్లాకు ప్రభుత్వం మొక్కుబడిగా 9,995 ఇళ్లు మంజూరు చేసింది. నియోజకవర్గాల వారీగా.. తుని 5,904, రామచంద్రపురం 1,133, ప్రత్తిపాడు 526, మండపేట 404, అనపర్తి 329, పెద్దాపురం 213, జగ్గంపేట 203, రాజోలు 162, కాకినాడ రూరల్ 157, పి.గన్నవరం 156, పిఠాపురం 141, రాజమహేంద్రవరం రూరల్ 134, అమలాపురం 127, కొత్తపేట 125, రంపచోడవరం 123, ముమ్మిడివరం 118, రాజానగరం 40 చొప్పున ఇళ్లు కేటాయించారు. -
విచారణ ఎప్పుడు?
సెలవులోనే కొనసాగుతున్న సీటీవో జేఏసీగా ఏర్పడ్డ నాలుగు జిల్లాల ఉద్యోగులు మంత్రి యనమలను కలిసిన తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్విసభ్య కమిటీ నివేదిక వచ్చాకనే సర్కారు తుది నిర్ణయం తిరుపతి: తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ (టీసీసీ) ప్రతినిధులు వారం రోజుల కిందట సీటీవో శ్రీనివాసులునాయుడుపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వ పరంగా జరగాల్సిన విచారణలో జాప్యం జరుగుతోంది. అధికారపార్టీకి చెందిన కొందరు పెద్దలు, మరికొంత మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కలిసి విచారణ జాప్యానికి తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారని వ్యాపార వర్గా లు అనుమానిస్తున్నాయి. వారం కిందటే విచారణ కోసం ఇద్దరు అధికారులతో ద్విసభ్య కమిటీని వేసిన ప్రభుత్వం రోజులు గడుస్తున్నా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లోని 27 వ్యాపార సంఘాలు మే 25 నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బం ద్‌కు పిలుపునిచ్చాయి. సీటీవో-2 గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులునాయుడు వేధింపులకు నిరసనగా 25న చాంబర్ ఆఫ్ కామర్స్ తిరుపతి, చంద్రగిరి, తిరుచానూ రు, రేణిగుంటలో ట్రేడ్ బంద్ నిర్వహించింది. అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వివాదంపై విచారణ నిర్వహించి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించారు. విచారణ కోసం అదనపు కమిషనర్ రమేష్‌బాబు, జాయింట్ కమిషనర్ ఏడుకొండలును సర్కారు ఏర్పాటు చేసింది. సెలవు పై వెళ్లిన శ్రీనివాసులునాయుడు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. దీంతో 25వ తేదీ సాయంత్రమే బం ద్‌ను విరమిస్తున్నట్లు టీసీసీ ప్రకటించింది. ఆ తరువాత వాణిజ్య పన్నుల శాఖలో ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మంత్రిని కలిసిన టీసీసీ.... మహానాడుకు హాజరైన మంత్రి యనమల రామకృష్ణుడును 29న టీసీసీ ప్రతిని ధులు కలిసి శ్రీనివాసులునాయుడు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పె ట్టారు. మంత్రి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సమాచారం అందుకున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు 29వ తేదీన చిత్తూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. వ్యాపారులంతా కలిసి ఒక అధికారిపై ఆరోపణలు చేయడం సబబు కాదనే నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్తులో ఈ తరహా సమస్య లు ఎదురైనపుడు సమష్టిగా పోరాడేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యంను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. తిరుపతి, చిత్తూరు సీటీవోలు రావణ్, వరలక్ష్మి కూడా జేఏసీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల సమావేశం గురించి తెల్సుకున్న టీసీసీ ప్రతినిధుల్లో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన పెద్దలే మరోవైపు నుంచి ఉద్యోగులను సమర్థిస్తున్నారని భావిస్తున్నారు. దీనివల్లనే వారం రోజులు గడిచినా విచారణకమిటీ తిరుపతి రాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమిటీ విచారణ పూర్తి చేసి ఆపైన అందజేసే నివేదిక ఆధారంగానే శ్రీనివాసులునాయుడు ఎక్కడ పనిచేయాలన్న నిర్ణయం జరుగుతుందని ఆ శాఖలోని ఉద్యోగు వర్గాలు అంచనా. -
భూ కేటాయింపునకు మంత్రుల కమిటీ
ఉప ముఖ్యమంత్రి కేఈకి చోటు కరువు సాక్షి, హైదరాబాద్: కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పలు సంస్థలకు భూముల కేటాయింపునకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి ఈ కమిటీలో స్థానం కల్పించక పోవడం గమనార్హం. తొలి నుంచి కూడా రాజధాని భూముల విషయంలో ఉప ముఖ్యమంత్రిని సీఎం దూరంగా ఉంచుతున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావులకు స్థానం కల్పించారు. ఈ కమిటీకి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక, వైద్య.. ఆరోగ్య, ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తారు. -
అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి అబద్ధాలు
యనమలపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరపు ఏపీ బడ్జెట్ శాసనసభా సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అవాస్తవాలు చెప్పారని, అసలు రాష్ట్ర బడ్జెట్ లెక్కలను పూర్తిగా రీవాలిడేషన్ (పునఃవిలువ) చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జీఎస్డీపీని టీడీపీ ప్రభుత్వం రూ.6,96,000 కోట్లుగా చూపగా, రూ. 6,26,000 కోట్లు మాత్రమే అని కేంద్రం విలువ కట్టినట్లు ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిందని వివరించారు. రాష్ట్రంలో జీఎస్డీపీ వృద్ధిరేటు వంటి అంశాలకు సంబంధించి తమ నేత జగన్మోహన్రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సహేతుకంగా లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా తామంతా సరిగ్గానే చేస్తున్నట్లు అసెంబ్లీలో బుకాయించారని సంబంధిత వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. జీఎస్డీపీ మొత్తంపై మూడు శాతం మేరకు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రుణం తెచ్చుకోవాల్సి ఉందని, కానీ జీఎస్డీపీని ఎక్కువగా ఫోకస్ చేసి పరిమితులు దాటి రుణాలను తెచ్చుకున్నారన్నారు. -
గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి
టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1,2,3,4 సర్వీసులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నాగ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. విభజన జరిగి ఏపీలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అయితే నిరుద్యోగులు మాత్రం లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. -
ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపు సీఎం ఇష్టం
ఏసీడీపీ తిరిగి పెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేసిన మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం (ఏసీడీపీ) పెట్టే ప్రసక్తే లేదని, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కేటాయింపులు ముఖ్యమంత్రి ఇష్టమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కాదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యేల పేరుతో ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రతిపక్ష నేత, సభ్యులు బుధవారం అసెంబ్లీలో చేసిన విమర్శలకు మంత్రి యనమల ఈమేరకు వివరణ ఇచ్చారు. ఎస్డీఎఫ్ విడుదలకు మార్గదర్శకాలేవీ లేవని ఎవరైనా సీఎంను కలసి పనుల కోసం ప్రతిపాదనలు ఇస్తే రూ. 2 కోట్లు వరకూ ఇస్తున్నారని తెలిపారు. ఎస్డీఎఫ్ కింద 74 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సుమారు రూ. 2 కోట్లు చొప్పున రూ. 146.48 కోట్లు, ఇతరులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాని వారికి) 24 మందికి 54 కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఎస్డీఎఫ్ కింద నిధులు పొందిన వారి పేర్లు సభకు సమర్పించినందున వాటిని చదవడానికి వీలు లేదంటూ ప్రతిపక్ష నాయకుడి ప్రసంగానికి కూడా ఆయన స్పీకరు ద్వారా అడ్డుకట్ట వేయించారు. ‘ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో ఏసీడీపీకి నిధులు పెట్టలేదు. వచ్చే సంవత్సరం కూడా పెట్టేది లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. ఇది ప్రభుత్వ పాలసీ’ అని యనమల స్పష్టం చేశారు. ‘ఏసీడీపీ ఎందుకు అడుగుతున్నారో తెలుసు. ఈ అస్త్రాన్ని వినియోగించుకుని వాళ్ల మనుషులు (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు) ఇటు (టీడీపీ)వైపు రాకుండా చేసుకోవడానికి జగన్మోహన్రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అస్త్రం పనిచేయదు. అందుచేత వారు వీరయ్యే అవకాశం చాలా దగ్గరలో ఉంది’ అని యనమల వ్యాఖ్యానించారు. -
వీటికి ఏ ఆధారాలున్నాయి?
♦ విపక్షనేతపై ఎడాపెడా ఆరోపణలు.. అనుచిత వ్యాఖ్యలు ♦ కోర్టు పరిధిలోని అంశాలూ ప్రస్తావన.. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అధికారపక్ష సభ్యులు, మంత్రులు ఎడాపెడా ఆరోపణల వర్షం కురిపించారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ తిట్ల దండకాన్ని వల్లించారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాలపై కూడా ఎడాపెడా వ్యాఖ్యలు చేసి కోర్టు ధిక్కారనేరానికి కూడా పాల్పడ్డారు. విచారణలో ఉన్న అంశాలపై విక్షణారహిత వ్యాఖలు చేయడమేకాక వ్యక్తిత్వ హననానికి కూడా ప్రయత్నించడం గమనార్హం. అధికారపక్ష సభ్యులు చేసిన ఏ ఆరోపణకూ ఎలాంటి ఆధారాలూ లేవు. ఏవీ విచారణకు నిలిచేవి కావు. అయినా అసెంబ్లీ సాక్షిగా ఎడాపెడా ఆరోపణల వర్షం కురిపించారు. వాటిలో కొన్నిటిని చూద్దాం.. ► అలిపిరి బాంబుదాడిలో పాల్గొన్న నక్సలైట్లకు ఆశ్రయమిచ్చిన గంగిరెడ్డి వైఎస్ జగన్ ఇంట్లో మనిషి. రాజశేఖరరెడ్డి పెంచిన మొక్క. ఒక క్రిమినల్‌ను ప్రతిపక్షనేత కాబట్టి మేం కూడా గౌరవించాల్సి వచ్చింది. - బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే ► మైనర్‌గా ఉండగానే ఎర్రగడ్డ జంక్షన్లో సూట్‌కేసు బాంబుతో వచ్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వైఎస్ఆర్ పదేళ్ల హయాంలో జరిగిన హత్యలన్నిటింటికీ కారణం ఆయన. ఆ మనస్తత్వం ఇంకొకరికి ఆపాదిస్తున్నారు. - కిమిడి కళా వెంకట్రావు, ఎమ్మెల్యే ► అరాచకాలు సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం ఆయన తండ్రి వైఎస్ఆర్కు, వైఎస్ జగన్‌కు అలవాటు. హైదరాబాద్‌లో నరమేధం సృష్టించి అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి. తునిలో ఇలాంటి అరాచకశక్తులు (జగన్‌వైపు చేయి చూపుతూ) చేరి హింసాత్మక ఘటనలు ప్రేరేపించారు. - తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే ఇడుపుల పాయలోని బంకర్లలో అవినీతి డబ్బు దాచినందుకు గాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారం వారం కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు. - యనమల రామకృష్ణుడు,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కాపు ఉద్యమం సందర్భంగా ట్రెయిన్ తగులబెట్టిన ఘటనలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గొడవలు రెచ్చగొట్టడానికి వాళ్ల పార్టీ వాళ్లను జగన్ బ్రతిమలాడాడు. వాళ్లు కుదరదంటే సిగ్గుతో ఫోన్ పెట్టేశాడు. - దేవినేని ఉమామహేశ్వరరావు,జలవనరుల శాఖ మంత్రి ఇంత నీచమైన నాయకుడి దగ్గర పనిచేయడానికి కష్టంగా ఉందని మీ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు. నిన్ను అసహ్యించుకుని నీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం మా దౌర్భాగ్యం. 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీతులు చెబుతుండడం, మనం ఆలకించాల్సి రావడం మన ఖర్మ. - కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి దోపిడీ చేసి దుర్మార్గం చేసి దలితులను నిరుద్యోగంలో పేదరికంలో ముంచిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది.. వైఎస్ జగన్మోహన్రెడ్డిది. - రావెల కిశోర్ బాబు,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
సీబీఐతో విచారణ ఎందుకు: యనమల
సాక్షి, హైదరాబాద్: భూముల ఆరోపణలకు సంబంధించిన రికార్డులు స్పీకరుకు ఇస్తే ఇక్కడే తేల్చొచ్చని, సీబీఐతో విచారణ ఎందుకని ఆర్థిక మంత్రి యనమల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కేసులను వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ఉపసంహరించుకున్నారని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇల్లు తాకట్టులో ఉండేదని, ఇప్పుడు జగన్‌కు అంత ఆస్తి ఎలా వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ను సైకో అంటూ మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కాగా, ఐనవోలులో తన కుమార్తె పేరిట 3.57 ఎకరాల భూమి కొన్నానని, ఆ తర్వాత దానిని అమ్మేసి వేరే చోట కొన్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అంగీకరించారు. -
అసాధారణంగా ముగింపు తీర్మానం
రూల్ 329ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాజధాని భూదందాపై విపక్ష నేత వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు శాసనసభలో సమాధానం చెప్పలేక, సీబీఐ విచారణకు అంగీకరించలేక అయోమయంలో పడ్డ అధికారపక్షం చర్చను ముగించేందుకు రూల్ 329ను హఠాత్తుగా తెరపైకి తెచ్చింది. ‘చర్చ వక్రమార్గం పట్టడంతో రూల్ 329 కింద చర్చను ముగించాలి. తీర్మానం పెడుతున్నాం’ అని మంత్రి యనమల పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ చర్చ ముగిసిందన్నారు. భూముల లావాదేవీలపై విచారణతో ఇబ్బందేనన్న స్పీకర్: రాజధాని ప్రాంతంలో భూముల లావాదేవీలపై విచారణకు ఆదేశిస్తే రాజధాని నిర్మాణం ఆలస్యమవుతుందనే అభిప్రాయం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాజధాని భూదందాపై సీబీఐ విచారణ జరిపించాలని బుధవారం అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిన సందర్బంగా స్పీకర్ కలుగజేసుకొని వివరణ ఇచ్చారు. ‘‘రాజధాని భూములపై వస్తున్న కథనాలపై ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తే పెట్టుబడులు రావని ప్రభుత్వం కూడా చెబుతోంది’’ అని స్పీకర్ వివరించారు. -
నిరుద్యోగులకు ‘పచ్చ’ని కుచ్చుటోపీ
♦ నిరుద్యోగ భృతికి మంగళం.. ♦ దానికి బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామంటూ కొత్త పల్లవి ♦ యువజన విధానం తేనున్నామన్న ఆర్థిక మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాం.. ఒకవేళ ఉద్యోగాలివ్వలేకపోతే.. ఉద్యోగం ఇచ్చేవరకూ నెలకు రూ.రెండు వేల చొప్పున నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాం... గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఇదే విషయాన్ని ప్రధానంగా చెప్పింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఒక్కరికీ ఉద్యోగమివ్వలేదు.. అలాగని నిరుద్యోగ భృతి ఇస్తున్నదా? అంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏకంగా నిరుద్యోగ భృతి హామీకే పూర్తిగా మంగళం పలికేస్తోంది. దానిస్థానంలో ఆర్థిక మద్దతు అంటూ కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఇదే విషయం సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నోటినుంచే వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి పలు శాఖల మంత్రులు, అధికారులతో ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీకి బదులు ఆర్థిక మద్దతు అందచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన హామీలన్నింటినీ చాలావరకూ అమలు చేశామని, నిరుద్యోగ భృతి, యువత ఆర్థికాభివృద్ధి హామీల్నే నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి హామీని ఆర్థిక మద్దతుగా మార్చుతామని చెబుతూ.. ఇందుకోసం త్వరలోనే యువజన విధానం తీసుకువస్తామన్నారు. యువజన విధానం అమలుకోసం గతం కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఖాళీగా పోస్టులన్నీ భర్తీ చేయం.. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపైనా ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయబోమని కుండబద్దలు కొట్టారు. జనాభాలో 35 శాతం మంది యువత ఉన్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు కొంతవరకు మాత్రమే ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆ ప్రకారం.. అవసరమైన మేరకే గ్రూప్-1, 2తోపాటు డాక్టర్, టీచర్, పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరణపై 29న కేబినెట్ సబ్‌కమిటీలో చర్చిస్తాం.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బడ్జెట్లో ఎక్కువ నిధుల్ని కేటాయిస్తామని యనమల చెప్పారు. అలాగే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలను చేసుకున్నామని, అవన్నీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని, తద్వారా ప్రైవేట్ రంగంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 29వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ పుస్తకాలకోసం బ్యాగ్‌ల పరిశీలన.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ పుస్తకాలను సభ్యులకు పంపిణీ చేసేందుకు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి యనమల పరిశీలించారు. ఈ సందర్భంగా పది రకాల బ్యాగ్‌లను అధికారులు తీసుకొచ్చారు. అయితే ఒక్కో బ్యాగ్ ధర రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు ఉండటంతో యనమల ఇంత ఖరీదైన బ్యాగులవసరమా? గతేడాది గన్నీ బ్యాగుల్లో పుస్తకాలిచ్చాం.. ఈసారీ అవేఇస్తే సరిపోదా అని వ్యాఖ్యానించారు. ఆర్థిక మద్దతు అంటే.. : గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని యువత నుంచి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హామీకి పూర్తిగా మంగళం పలుకుతున్న ప్రభుత్వం ఇందుకు బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామని పేర్కొనడం ద్వారా నిరుద్యోగ యువతను సంతృప్తి పరచాలని చూస్తోంది. అయితే ఆర్థిక మద్దతు అంటే.. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీపై రుణాల్ని ఇప్పించాలనేది ప్రభుత్వ అభిప్రాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు ఒనగూరే ప్రయోజనం అంతంతేననే భావన వ్యక్తమవుతోంది. -
ఒక డీఏ మాత్రమే ఇస్తాం
అయితే ఎప్పుడనేది చెప్పలేం ఏపీ ఆర్థిక మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు 2015 సంవత్సరంలో కరువు భత్యం (డీఏ) మంజూరు చేయలేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అయితే ఒక కరువు భత్యం ఇవ్వాలని నిర్ణయించామని, అయితే అది ఎప్పుడు అనేది చెప్పలేమని ఆయన అన్నారు. అదేవిధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అయితే ఎప్పుడనేది చెప్పలేమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు, ఆదాయ లక్ష్యాల సాధన, నాల్గో త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై యనమల శనివారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక నిర్వహణ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచాలని హైకోర్టు సూచించిన విషయం తమకు తెలియదని ఆయన చెప్పారు. -
గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షలే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తోందని సాక్షి చెప్పినట్లే దీపావళి తరువాత శుక్రవారం ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిపై ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ.పది లక్షలకు పరిమితం చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ శుక్రవారం జీవో-139 జారీ చేశారు. పదవ వేతన సరవణ కమిషన్ (పీఆర్సీ) మాత్రం ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.ఈ సిఫార్సు మేరకో లేదా అంత కన్నా ఎక్కువగానో గ్రాట్యుటీని గత ప్రభుత్వాలు నిర్ణయిస్తూ వచ్చాయి. చంద్రబాబు సర్కారు మాత్రం పీఆర్సీ చేసిన సిఫార్సుల్లో రూ.రెండు లక్షల కోత విధిస్తూ గ్రాట్యుటీని ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల నుంచి రూ. పది లక్షలకే పెంచుతూ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ సిఫార్సులు 2013 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాగా ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీ పెంపు మాత్రం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే జూలై 2013వ తేదీ నుంచి జూలై 2014 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి గతంలో ఉన్న రూ.8 లక్షలే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుక్రవారం తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ రూ. పది లక్షల వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ. పది లక్షలకే పరిమితం చేస్తూ ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే తెలియజేసిన విషయం తెలిసిందే. ‘ఇక గ్రాట్యుటీ వంతు’ శీర్షికన గ్రాట్యుటీ గరిష్ట పరిమితికి కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని గత వారం ‘సాక్షి’ వార్త ప్రచురించింది. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ.ఆరు లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రూ.రెండు లక్షలు పెంచుతూ గ్రాట్యుటీ రూ. 8 లక్షలు చేసింది. ఇప్పుడు పీఆర్సీ సిఫార్సు చేసినంత కూడా ఇవ్వకుండా తగ్గించడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. లక్షల మొత్తంలో కోల్పోతామంటున్నారు. కోతను అంగీకరించం ఉద్యోగుల గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రశ్నేలేదు. పీఆర్సీసిఫార్సుల ప్రకారం గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాల్సిందే. త్వరలోనే మేము సీఎంను, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాలని డిమాండు చేస్తాం. పీఆర్సీ సిఫార్సులకు విరుద్ధంగా గ్రాట్యుటీని రూ. 10 లక్షలకు పరిమితం చేయడం ఉద్యోగులకు అన్యాయం చేయడమే. దీన్ని అంగీకరించం. - చంద్రశేఖర్‌రెడ్డి,జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ -
ఉద్యోగులకు షాక్!
బాబు చేసిన దీపావళి గాయం ♦ పండుగ రోజు పిడుగు.. గ్రాట్యుటీ రూ.10 లక్షలకే పరిమితం ♦ పీఆర్సీ రూ.12 లక్షలకు సిఫార్సు చేసినా పట్టించుకోని ప్రభుత్వం ♦ గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం ♦ ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన రాష్ర్టప్రభుత్వం ♦ త్వరలో ఉత్తర్వులు వస్తాయని వెల్లడించిన యనమల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త. దీపావళి పర్వదినం ముందు వారికి ఊహించని షాక్. పీఆర్సీ సిఫార్సు మేరకైనా గ్రాట్యుటీ దక్కుతుందనుకుంటే రాష్ర్ట ప్రభుత్వం అందులో కోతపెట్టి దొంగదెబ్బ తీసింది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఇచ్చే గ్రాట్యుటీని రు.10 లక్షలకు పరిమితం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దీనిపై ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం బైటపెట్టారు. ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. పది లక్షలుగా నిర్ణయించామని, దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిలో కోతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ‘ఇక గ్రాట్యుటీ వంతు’ శీర్షికన గత వారం ‘సాక్షి’ వార్త ప్రచురించిన విషయం విదితమే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీగా రూ. 12 లక్షలు ఇవ్వాలని పదో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రాట్యుటీ రూ. 8 లక్షలుగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోకుండా రూ. 10 లక్షలకు పరిమితం చేసింది. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ. 6 లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రెండు లక్షలు పెంచుతూ గ్రాట్యుటీ రు. 8 లక్షలుగా ఖరారు చేసింది. వాస్తవానికి గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే కనీసం పీఆర్సీ సిఫార్సు చేసినట్లుగా రూ.12 లక్షలైనా ఇవ్వకుండా రూ.10 లక్షలకు కుదించడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రాట్యుటీని పరిమితం చేయడంపై సచివాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి స్పందిస్తూ నిజాయతీగా పనిచేసే వారి కడపు కొట్టడం అంటే ఇదేనన్నారు. ఈ నిర్ణయం చూస్తుంటే ఇతర సంపాదనలపై దృష్టిపెట్టాలని పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యోగులకు సూచిస్తున్నట్లుగా ఉందని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించారు. నిజాయతీగా పనిచేసే ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంత జీవితం సాగించడానికి గ్రాట్యుటీ ఎంతో దోహదపడుతుందని, అలాంటి గ్రాట్యుటీని తగ్గించడం అన్యాయమని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని పీఆర్సీ సిఫార్సుల మేరకు రూ. 12 లక్షలుగా ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోలేదు. మరోవైపు గ్రాట్యుటీపై గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచడం విశేషం. గ్రాట్యుటీని పరిమితం చేయడం వల్ల 30 ఏళ్ల సర్వీసు గల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులందరూ లక్షల్లో నష్టపోనున్నారు. ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ: యనమల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ త్వరలోనే ఇస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒక డీఏ ఇవ్వాల్సి ఉంది. అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మరో డీఏ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక డీఏ మాత్రం ఇస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. అయితే రెండో డీఏ ఇస్తారా లేక ఎగనామం పెడతారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. మరో పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో ఉందని యనమల తెలిపారు. ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా పది వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఆయన వివరించారు. బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా ఒక్క పైసా అడగవద్దని, ఖర్చులను తగ్గించుకోవాల్సిందిగా అన్ని శాఖలకు లేఖలు రాయనున్నామని ఆయన చెప్పారు. అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని ఆర్థికమంత్రి చెప్పారు. ఎక్సైజ్, వ్యాట్‌లో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం లెవీ విధానం ఎత్తివేయడంతో కూడా వ్యాట్ ఆదాయానికి గండిపడిందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా కేంద్రం రు. 2,300 కోట్లు ఇచ్చిందని, ఇంకా రు. 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. అటవీ, గనుల రంగాల ద్వారా ఆదాయం బాగా వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌పై ఈ నెల 22వ తేదీన మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుందన్నారు. నాడే జేఏసీ స్పందించి ఉంటే.. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిపై ఉద్యోగులను ప్రభుత్వం దొంగదెబ్బ తీయబోతున్న విషయాన్ని గతవారమే సాక్షి బైటపెట్టింది. ఆ వెంటనే ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం స్పందించి ఉంటే.. ప్రభుత్వం వెనకడుగు వేసేదేమో! కానీ జేఏసీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రే ఈ విషయాన్ని స్పష్టం చేసినా కూడా జేఏసీ నాయకులు మౌనం వహించారు. జేఏసీ ప్రతినిధిబృందం మంగళవారం ఆర్థికమంత్రిని కల సిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం మీద అసంతృప్తిని కూడా ప్రకటించకుండా, మీడియా తో మాటమాత్రం కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి నిష్ర్కమించడం గమనార్హం. ఉద్యోగుల వ్యతిరేక వైఖరి స్పష్టం అనుమానాలు నిజమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని స్పష్టమయింది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ. 12 లక్షలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం రూ. 10 లక్షలకే పరిమితం చేయడం, అలవెన్స్లకూ కోత వేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటినీ ఆర్థిక ఇబ్బం దులు ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే పొదుపు చర్యలను ఉద్యోగులకే పరిమితం చేయడం ఎందుకు? ప్రభుత్వం దుబారా తగ్గించుకోకుండా.. ఉద్యోగుల విషయంలో కోతలు విధించడం ఆమోదనీయం కాదు. - ఐ.వెంకటేశ్వరరావు, జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ అధ్యక్షుడు -
నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం
నవనిర్మాణ దీక్షలో ఆర్థిక మంత్రి యనమల సాక్షి, విశాఖపట్నం : నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాకుండా తీరని రెవెన్యూలోటుతో పాటు భారీ అప్పులను అంటగట్టారన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఐజీ రవిచంద్ర, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావు నాయుడు, జేసీలు జె.నివాస్, డీవీ రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.