మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడంలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను కూడా సంబంధిత అధికారులు లెక్కచేయకుండా ఇసుక అక్రమరవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల నుంచి డబ్బులు దండుకుని కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నట్లు సమాచారం. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాలేరు, మూసీ వాగుల నుంచి జోరుగా ఇసుక అక్రమ రావాణా సాగుతోంది.
కాగా శుక్రవారం రాత్రి మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు సమీపంలో రెండు ఇసుక లారీలను పట్టుకున్న ఓ మండల స్థాయి అధికారి కేసు నమోదు చేయకుండా 30 వేల రూపాయలు, జేసీబీ ఓనర్ నుంచి 5 వేల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మామూళ్లు ఇచ్చిన వ్యక్తితో ఆ అధికారి డబ్బుల విషయమై ఫోన్‌లో మాట్లాడి వేధించినట్లు తెలిసింది. మామూళ్లు ఇచ్చిన వ్యక్తి.. ఫోన్‌లో రికార్డు చేసిన వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తడమళ్ల క్రాస్ రోడ్డు వద్ద ఇసుక డంప్‌లు ఉన్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు.
పల్లెల్లో తగాదాలు
పచ్చని పల్లెల్లో ఇసుక రవాణా వల్ల తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతున్న ఇసుక మాఫియా నాయకులు గ్రామాలలో అడ్డగోలుగా రాత్రి వేళలో సైతం ట్రాక్టర్లను నడిపించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు అడ్డుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ఇస్తున్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని గ్రామస్తులనే ఇసుక వ్యాపారులు బెదిరిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామస్తులకు ఇసుక వ్యాపారులకు తగాదాలు జరిగినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేదు.
చేతిలో కాసులు..నమోదు కాని కేసులు
Published Mon, Dec 23 2013 3:49 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement