ఓఎన్జీసీ పైపులైన్ నుంచి ఆయిల్ లీకేజి | oil leakege from ongc pipeline in east godavari | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ పైపులైన్ నుంచి ఆయిల్ లీకేజి

Published Sat, Feb 8 2014 3:06 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

oil leakege from ongc pipeline in east godavari

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద ఓఎన్జీసీ పైపులైను నుంచి ఆయిల్ లీకయ్యింది. దాదాపు 15 ఏళ్ల క్రితం వేసిన ఈ పైపులైనును మార్చాలని స్థలం యజమాని ఎప్పటినుంచో చెబుతున్నారు.

అయితే ఓఎన్జీసీ వర్గాలు మాత్రం పాత కాలం నాటి ఈ పైపులైనును మార్చకుండా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టేస్తున్నారని తెలిసింది. దానివల్లే గ్యాస్ కలెక్షన్ సెంటర్ (జీసీఎస్)కు సమీపంలో ఉన్న ఈ పైపులైను తరచు లీకవుతూ ఉంటుంది. అలాగే శనివారం కూడా పైపులైను నుంచి ఆయిల్ లీకవ్వడంతో ఓఎన్జీసీ సిబ్బంది వచ్చి లీకేజీని అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement