గుడిసె దగ్ధం: వృద్ధురాలి సజీవ దహనం | old age woman dies in fire accident in machilipatnam | Sakshi
Sakshi News home page

గుడిసె దగ్ధం: వృద్ధురాలి సజీవ దహనం

Published Thu, May 12 2016 9:16 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

old age woman dies in fire accident in machilipatnam

మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా కోర్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున పూరిగుడిసె దగ్ధమై ఒక వృద్దురాలు సజీవ దహనమైంది. తటవర్తుల వెంకటరత్నం(65), ఆమె భర్త సత్యం (70) కోర్టు సెంటర్లోని సాయిబాబా ఆలయం వద్ద భిక్షాటన చేసి జీవనం సాగించేవారు. ఆ పక్కనే చిన్న పూరిగుడిసె వేసుకుని అందులో నివసిస్తున్నారు. వెంకటరత్నం పక్షవాతంతో బాధపతుంది.

ఆ క్రమంలో ఆమె వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. గుడిసెలో వెలిగించిన కిరోసిన్ దీపం కిందపడి మంటలు చెలరేగాయి. పూరి గుడుసె పూర్తిగా కాలిపోయింది. భర్త సత్యం ఎలాగో బయటకు రాగలిగాడు. నడవలేక వీల్‌ఛైర్‌కే పరిమితమైన వెంకటరత్నం గుడిసెలో నుంచి బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అగ్నిప్రమాదంపై వెంకటరత్నం భర్త సత్యంను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement