
సాక్షి, అమరావతి: శాశ్వత డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన జాబితానే మళ్లీ కేంద్రానికి పంపింది. గత నెలలో పంపిన ఏడుగురు పేర్లతో ఉన్న జాబితా సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని ఈ నెల 2న కేంద్రం తిప్పిపంపింది. అయితే ఆ అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ మళ్లీ అదే జాబితాను ఈ నెల 7న కేంద్రానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ, సామాజిక కోణంలో ఇన్‌చార్జి డీజీపీ సాంబశివరావువైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపడంతో పాత జాబితానే మళ్లీ కేంద్రానికి పంపారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment