కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఒకవైపు దసరా పండగ.. మరోవైపు పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించినా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, విద్యార్థి సంఘాలు శనివారం సమైక్య నినాదాన్ని మారుమ్రోగించాయి. కర్నూలులో న్యాయవాదులు,వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు.
జిల్లా పరిషత్, సంక్షేమభవన్ కార్యాలయాల్లో ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. ఆలూరులో సమైక్యంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుల చిత్రపటాలను దహనం చేశారు. ఆదోని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాష్ర్ట విభజన ద్రోహుల చిత్రపటాలకు మసిపూసి నిరసన తెలిపారు.
రాష్ట్రాన్ని విభజిస్తే వారి రాజకీయ భవిష్యత్తు మసిబారుతుందని హెచ్చరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ హైస్కూల్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. మిల్టన్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా 60వ రోజున 15 మంది వైద్య, ఆర్యోగశాఖ ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు.
అదే హోరు
Published Sun, Oct 13 2013 3:10 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement
Advertisement