టెన్త్ పరీక్షా హాలులోకి ‘గుర్రాలు’
టెన్త్ పరీక్షా హాలులోకి ‘గుర్రాలు’
Published Wed, Mar 22 2017 12:51 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
ఎమ్మిగనూరురూరల్: పరీక్షా హాలులోకి గుర్రాలు రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా... నిజమే. మీరు విన్నది, చదువుతున్నది అక్షరాలా నిజం. స్థానిక మాచాని సోమప్ప ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం ఓ గుర్రం వీరంగం సృష్టించింది. గుర్రం దాడిలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పాఠశాల ఆవరణలో భవన నిర్మాణ పనులు చేస్తున్న మౌలాలి, జాకీర్ ఉõసేని, వీరేష్‌లు గాయపడ్డారు. అలాగే పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన నారాయణ స్కూల్ విద్యార్థి ప్రణీత్, గుర్రాన్ని అదుపుచేసేందుకు కర్రతో ఎదురు వెళ్లిన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి కూడా గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల కిత్రం పట్ణణంలో మరో నలుగురిపై ఈ గుర్రం దాడి చేసింది. మున్సిపల్ అధికారులు స్పందించి గుర్రాన్ని అదుపు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Advertisement
Advertisement