
9న జిల్లాకు వైఎస్ జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు రానున్నారు. రెండు రోజులపాటు ఆయన జిల్లాలోని రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలతో పాటు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, జెడ్పీ చైర్మన్ ఎన్నికపై అధినేత సమీక్షిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఈ నెల 9వ తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైనా, 10వ తేదీన నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిన తీరును విశ్లేషించుకుంటావున్నారు. అంతేకాకుండా వివిధ ప్రజా సవుస్యలపై ఏ విధంగా వుుందుకు వెళ్లాలనే అంశాన్నీ చర్చించుకుంటావున్నారు. అదేవిధంగా పార్టీ అన్ని విభాగాల బలోపేతంపైనా సమీక్ష ఉంటుందని ఆయున వివరించారు.
నేడు ఎస్వీ హోటల్‌లో ముఖ్యులతో సన్నాహాక సమావేశం
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాకను పురస్కరించుకుని బుధవారం (7వ తేదీన) ఉదయుం 11 గంటలకు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు వుుఖ్యనేతలందరూ కర్నూలులోని ఎస్వీ హోటల్‌లో సవూవేశం అవుతున్నావుని బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.