తెనాలి రూరల్(గుంటూరు): ఇటుకల లోడుతో వెళ్తొన్న లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలైన సంఘటన గుంటూరు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలివీ.. దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు(38) క్యాటరింగ్ పనులకు వెళుతుంటాడు. శుక్రవారం కొల్లూరులో పనికి వెళ్లి ఇటుకల లోడుతో తెనాలి వస్తున్న లారీ ఎక్కాడు. అతనితో పాటు లారీలో కొల్లూరుకు చెందిన చొప్పర రవీంద్ర, బున్నంగి సురేష్, నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన బుడిపాటి సుధీర్ ఉన్నారు.
సాయంత్రం 4 గంటల సమయంలో పెదరావూరు వద్ద లారీని డ్రైవరు రోడ్డు మారిన్‌లో నడిపేందుకు యత్నించగా అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టులో పడింది. ఈఘటనలో నాగబాబు అక్కడికక్కడే మృతి చెందగా, రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు.
ఇటుకల లారీ బోల్తా: ఒకరి మృతి
Published Fri, Sep 18 2015 4:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement
Advertisement