
రూ.లక్ష విలువైన గుట్కా, పాన్‌పరాగ్ స్వాధీనం
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : ఒడిషా రాష్ట్రం నుంచి గుట్కా, పాన్‌పరాగ్‌లను అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముందుగా అందిన సమాచారం మేరకు పార్వతీపురం సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ అశోక్‌కుమార్లు స్థానిక బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద మాటువేసి.. ఒడిషా నుంచి సరుకుతో వచ్చిన యువకుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన గుట్కా, పాన్‌పరాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.