ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత | option forms given to employees | Sakshi

ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత

Published Sat, Aug 2 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత

ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత

రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ఆయా శాఖలు, విభాగాలు ఆప్షన్ ఫారాలను అందజేశాయి.

5వ తేదీలోగా సమర్పణకు అవకాశం

హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ఆయా శాఖలు, విభాగాలు ఆప్షన్ ఫారాలను అందజేశాయి. ఈ నెల 5వ తేదీలోగా ఆప్షన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటు సచివాలయంతో పాటు జంటనగరాల్లోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులు ఏ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకోవాలనే దానిపై చర్చల్లోనే మునిగిపోయారు. భార్య కూడా ఉద్యోగి అయితే ఏ రాష్ట్రంలో ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే సమాచారాన్ని సహచర ఉద్యోగులతో చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద 5వ తేదీ వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులు ఆప్షన్ ఫారాలను నింపడం, సమర్పించడంపైనే దృష్టిసారించనున్నారు. ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement