టెన్త్ ఇంగ్లీష్-2లోనూ తప్పులు | out of syllabus questions in 10th exams | Sakshi
Sakshi News home page

టెన్త్ ఇంగ్లీష్-2లోనూ తప్పులు

Published Mon, Mar 28 2016 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇస్తుండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు.

తెనాలి అర్బన్ (గుంటూరు జిల్లా) : పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇస్తుండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్-2 పేపర్లోనూ మూడు ప్రశ్నలు ఇదే విధంగా వచ్చాయి. దీని వల్ల విద్యార్థులు మూడు మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. పదో తరగతి ఇంగ్లీష్-2 ప్రశ్నాపత్రంలో 2, 4, 5 ప్రశ్నలు ఇంగ్లీష్ పేపర్-1 సిలబస్‌లోవి ఇచ్చారు.

గమనించిన విద్యార్థులు ఆ మేరకు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు పేర్కొన్నారు. శనివారం జరిగిన ఇంగ్లిష్ పేపర్-1 ప్రశ్నాపత్రంలోనూ ఇదేవిధంగా తప్పులు దొర్లాయి. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి తప్పులు దొర్లకుండా చూడడంతోపాటు విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement