మొదటి నుంచి చివరివరకూ కాంగ్రెస్‌వాదే...
హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన పాలడుగు వెంకట్రావు మొదటి నుంచి కాంగ్రెస్‌వాది. చివరిదాకా ఆయన అలాగే కొనసాగారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన వెంకట్రావుకు నెహ్రూ-గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. పీసీసీ చీఫ్ రేసులో ఆయన పేరు చాలాసార్లు వినిపించినప్పటికీ సమీకరణాల కారణంగా పాలడుగుకు ఆ పదవి దక్కకుండా పోయింది.
తుదివరకు కాంగ్రెస్‌వాదిగా కొనసాగిన వెంకట్రావు మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరోవైపు పాలడుగు మృత దేహాన్ని సోమవారం మధ్యాహ్నం ఇందిరాభవన్‌కు తరలించనున్నారు. అక్కడ ఆయన మృతదేహానికి వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పించనున్నారు. అనంతరం పాలడుగు భౌతికకాయాన్ని విజయవాడలోని ఆంధ్రరత్న భవన్కు తరలిస్తారు. పాలడుగు అంత్యక్రియలు బుధవారం నూజివీడులో జరుగుతాయి.