పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | Palistic Counseling begins | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

May 31 2017 6:32 AM | Updated on Sep 17 2018 7:38 PM

పాలిటెక్నిక్‌ డిప్లొమాలో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్‌ – 2017 కౌన్సెలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమాలో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్‌ – 2017 కౌన్సెలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రంలో ఉదయం 9.30 గం టల నుంచి ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ కౌన్సెలింగ్‌ను ప్రారంభించిన సహాయ కేంద్రం ఇన్‌చార్జ్, పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టీవీ రాజశేఖర్‌ టాఫ్‌ ర్యాంకర్‌ ప్రవీణ్‌కుమార్‌ (95)కు కౌన్సెలింగ్‌ పత్రం అందజేశారు.

 ఈ సందర్భంగా తొలిరోజు 1 నుంచి 10 వేలలోపు ర్యాంకులకు సంబంధించి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 195, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. బుధవారం 10,001 నుంచి 20,000 మధ్య ర్యాంకులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జూన్‌ 2న 1 నుంచి 30,000 ర్యాంకు మధ్య విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. జూన్‌ 6వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కొనసాగనుంది. వెబ్‌ ఆప్షన్లు ఎంపిక ఏడో తేదీ వరకు ఉంటుంది. 8న ఆప్షన్ల మార్పుకు అవకాశం ఇవ్వనున్నారు. 10న సీట్లు ఎలాట్‌మెంట్‌ ప్రకటిస్తారు. 19 నుంచి తరగతలు ప్రారంభమవుతాయి.

 విద్యార్థులు రాష్ట్రం యూనిట్‌గా కళాశాలకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఏడాది జిల్లా నుంచి పాలిసెట్‌కు 7,146 మంది దరఖాస్తు చేసుకోగా, 6,951 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంతమంది కౌన్సెలింగ్‌కు హాజరవుతారో వేచి చూడాల్సిందే. 2015లో 1,928, 2016లో 2052 మంది హా జరయ్యారు. ఈ ఏడాది సైతం 2 వేల మంది వరకు హాజరయ్యే అవకాశముంది. ఈ కౌన్సెలింగ్‌కు హాజరైన వారందరూ ప్రవేశాలు పొందే అవకాశముండదు. మరోవైపు కౌన్సెలింగ్‌ హాల్‌ వెలుపల ప్రైవేట్‌ కళాశాలు ప్రవేశాల కోసం ప్రమోషన్‌వర్కు ముమ్మరంగా చేస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను విభాగాధుపతులు మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement