అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది మండలాల్లోని 95 సెంటర్లలో జంబ్లింగ్ విధానంలో
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రశాంతం
Published Mon, Feb 24 2014 1:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది మండలాల్లోని 95 సెంటర్లలో జంబ్లింగ్ విధానంలో పరీక్ష సజావుగా జరిగింది. 61.9 శాతం హాజరుతో సుమారు 19, 927 మంది పరీక్ష రాసినట్లు కలెక్టర్ ప్రకటించారు. 32,176 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. జెడ్పీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు 95 మంది పర్యవేక్షకుల్ని, 85 మంది లెజైన్ అధికారుల్ని నియమించడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. 23 మంది అంధ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు సహాయకుల్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 26 పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఆయా పరీక్షా సెంటర్లలో మొత్తం వీడియోతో చిత్రీకరించారు. ఆదివారం సాయంత్రానికి పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలు పటిష్ట బందోబస్తు నడుమ జిల్లా పరిషత్‌కు చేరాయి. ఆదివారం రాత్రికి జవాబు పత్రాలను ఏపీపీఎస్సీకి పంపేందుకు జెడ్పీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు సిటీ: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శి పోస్టులకు జరిగిన రాత పరీక్షలను ఆదివారం కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ సందర్శించారు. గుంటూరులోని సెయింట్ ఇగ్నేషియస్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, ఎల్‌ఈఎం ఉన్నత పాఠశాలను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు ఓఎంఆర్ పత్రాలు పూర్తిచేసిన విధానాన్ని గమనించారు. అభ్యర్థుల కోసం కేంద్రాల్లో ఉన్న ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2వ పేపరు పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు కావలసిన ఆహార సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. సెయింట్ ఇగ్నేషియస్ బాలుర ఉన్నత పాఠశాలలో పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన అంధుడు ఎల్.వెంకట్రావు ఒకరిసాయంతో పరీక్ష రాస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, పరీక్ష కోఆర్డినేటర్, జెడ్పీ సీఈవో సుబ్బారావు, చీఫ్ సూపరింటెండెంట్‌లు జూలియమ్మ, హరిప్రసాద్, ఎన్.ప్రభుదాసు ఉన్నారు.
Advertisement
Advertisement