తుది విడత ప్రశాంతం | parishad elections | Sakshi
Sakshi News home page

తుది విడత ప్రశాంతం

Published Sat, Apr 12 2014 2:45 AM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM

parishad elections

 సాక్షి, ఏలూరు: జిల్లాలో తుది విడత ‘పరిషత్’ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగి సింది. చెదురుమదురు ఘటనలు మిన హా కొవ్వూరు, నరసాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.  
 
 ఓటేసిన అనంతరం ఇద్దరు మృతి
 పెరవలి మండలం అన్నవరప్పాడులో డేగ సత్యవతి (70) అనే మహిళ ఓటేసి ఇంటికి వెళ్లగానే మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ఇంటికెళ్లిన ఆమె వాకిట్లో కుప్పకూలిపోయింది. యలమంచిలి మండలం ఊటాడలో దొంగ సుబ్బారావు (55) అనే వ్యక్తి ఓటేసిన అనంత రం వడదెబ్బకు గురై పోలింగ్ కేంద్రం సమీపంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు విడిచాడు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన భీమవరం మండలం గూట్లపాడులో భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు.
 
 కాంగ్రెస్ నాయకుడిపై రౌడీషీట్!కొవ్వూరు మండలం కాపవరంలో కాం గ్రెస్ నాయకుడు ఎండీ రఫీయుల్లాబేగ్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బేగ్ ఇంటి వద్ద జనం గుమిగూడి ఉండటంతో వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతోపాటు
 బేగ్ ఇంటిని సోదా చేయగా ఏ వార్డులో ఓటర్లకు ఎంత పంచారనే వివరాలతో కూడిన పుస్తకం పోలీసుల కంటపడింది. దీనిపై ప్రశ్నించగా బేగ్ దురుసుగా ప్రవర్తించాడని అతనిపై రౌడీషీట్ తెరిచేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు తెలిపారు.
 
భట్లమగుటూరులో గంట ఆలస్యం
పెనుమంట్ర మండలం భట్లమగుటూరులో పోలింగ్‌ను గ్రామస్తులు బహిష్కరించారు. సుమారు గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తాము పదవిలోకి రాగానే గ్రామ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఉదయం 8 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభమైంది. పాలకొల్లు మండలం కాపవరంలో ఓ వ్యక్తి నకిలీ బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేసి ఒరిజినల్ పేపర్‌ను బయటకు తీసుకురావడం కల కలం సృష్టించింది.
 
 చాగల్లులో యథేచ్ఛగా ప్రలోభాల పరంపర
 కొవ్వూరు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ కోతలకు ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వెలుగు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. చాగల్లు మండలం ఊనగట్ల పోలింగ్ కేంద్రం వద్ద లైనులో ఉన్న ఓ టర్లను టీడీపీ నాయకులు ఓట్లు అ భ్యర్థించడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.

దేశం నాయకుల తీరుపై ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. మండలంలో చివరి క్షణం వరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించారు. పోలింగ్ ప్రారంభమయ్యే వరకు చీరలు, నగదు యథేచ్ఛగా పంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement