త్వరలో పాదయాత్ర చేస్తా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత నెలలో అనంతపురం జిల్లాలో పనిచేయడానికి స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులుకోసం జనసేన పార్టీ నియామకాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నియామాకాల్లో ఎన్నికైన సుమారు 150 మంది అభ్యర్థులను జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. వచ్చిన వారంతా తమ ప్రాంతల్లోని సమస్యలను ఆయనకు వివరించారు.
త్వరలో పాదయాత్ర చేస్తా
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఒక్కో నాయకుడు రూ.వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.