ప్రజలకు ఆధార్ కష్టాలు | people have to so many problems for aadhar card | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఆధార్ కష్టాలు

Published Tue, Feb 18 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

ప్రజలకు ఆధార్ కష్టాలు

ప్రజలకు ఆధార్ కష్టాలు


 మంగళగిరి రూరల్,
 రేషన్ సరుకులు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లిన ప్రజలు డీలరు చెప్పే సమాధానాలతో  వెనక్కు తిరిగి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఆధార్ కార్డు, బ్యాంకు కౌంట్ పుస్తకం, గ్యాస్ పాసు పుస్తకం నకలు కాపీళ్లను ఇవ్వాలని డీలర్లు పేద ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు.
 
 ఇక రేషన్ కార్డులు తీసుకువచ్చిన కొందరిని రచ్చబండంలో ఇచ్చిన రేషన్ కార్డు దారుల ఐరిస్ వివరాలు కంప్యూటర్‌లో నమోదు కాలేదని... ఫొటో దిగి రెవెన్యూ అధికారుల చేత సంతకం చేయించుకుని తిరిగి తమకు ఆ పత్రాలు అందినప్పుడు రేషన్ ఇస్తామని చెప్పి పంపించి వేస్తున్నారు. పేదలు రేషన్ అందక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్న వేలాది మంది ప్రజలకు డీలర్లు అడిగే ధ్రువీకరణ పత్రాల్లో  కొన్ని మాత్రం లేవు. రెండేళ్ల కిందట ఆధార్ కార్డు దిగినప్పటికీ కొందరు పేద ప్రజలకు అవి నేటి వరకు అందకుండా పోవడంతో సతమతమవుతూనే వున్నారు.
 
  మరికొందరు మాత్రం ఇప్పటికే రెండు, మూడుమార్లు తమ తమ ఆధార్ కార్డుల నకళ్ల కాపీలను డీలర్లకు అందజేశారు. మళ్లీ తాజాగా ఆధార్ కార్డుల నకళ్లు తీసుకురావాలని డీలర్లు ఇచ్చిన వారిని  సైతం వంకలతో సరుకులు ఇవ్వకుండానే పంపించి వేస్తున్నారు. చేసేది లేక వారు మరలా నకళ్ల కాపీలను ఇచ్చి రేషన్ సరుకులను పొందుతుండగా మరికొందరు మాత్రం డీలర్లతో వాదనలకు దిగుతున్నారు. ఎన్నిమార్లు ఆధార్ కార్డులు ఇవ్వాలని నిలదీస్తున్నారు. డీలర్లు గట్టిగా వాదించిన వారికి రేషన్ సరుకులు అందించి వెంటనే అక్కడి నుండి పంపించి వేస్తున్నారు.
 
  ఇక ఇప్పటి వరకు ఆధార్ కార్డులు రాని వారు తమ కార్డుల  ఆరా తీసేందుకు  సంబంధిత  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా  కనీసం సమాధానం కూడా చెప్పేవారు లేరని కొందరు పేదలు వాపోతున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు ఆధార్ కార్డుల కోసం గతంలో ఫొటోలు దిగితే వారిలో  ఇద్దరికి ఆధార్ కార్డులు వస్తుండగా మరో ఇద్దరికి రాకుండా పోయాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మండలంలోని అన్నీ గ్రామాల్లోనూ నెలకొందంటే  పేదలు పడుతున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు.
 
 
  రేషన్ డీలర్లకు మాత్రం  లబ్ధిదారులకు సరిపడా ప్రతి నెలా రేషన్ సరుకులను ప్రభుత్వం సరఫరా  చేస్తూనే  వుందని, లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదనే సాకుతో రేషన్ ఇవ్వకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని కొందరు ప్రజలు విమర్శిస్తున్నారు. కొత్త ఆధార్‌కార్డుల కోసం కొందరు, తీయిం చుకున్న ఆధార్‌కార్డులు చేతికి రాక మరి కొందరు రేషన్ డీలర్లు,  మీ సేవా కేంద్రాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
  రచ్చబండలో రేషన్ కార్డులు పొంది  అప్పటి నుండి  రేషన్ సరుకులు తీసుకున్న లబ్ధిదారులు ఐరిస్ కంప్యూటర్‌లో నమోదు కాలేదనే సాకుతో  తాజాగా ఈనెలలో కొందరి లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులను ఇవ్వకుండా నిలిపి వేశారు రేషన్ డీలర్లు.
 రేషన్ సరుకులు ఇవ్వలేదు
 
 
 రెండేళ్ల కిందట రచ్చబండ కార్యక్రమంలో రేషన్ కార్డు వచ్చింది. అప్పటి నుంచీ క్రమం తప్పకుండా రేషన్ సరుకులు తీసుకుంటూనే వున్నా. తన రేషన్ కార్డు వివరాలు  కంప్యూటర్‌లో అప్‌లోడ్ కాలేదని చెప్పి డీలర్  రేషన్ సరుకులు నిలిపివేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఫొటో దిగి ఇస్తే రేషన్ సరుకులు ఇస్తానని చెప్పారు.
 దరిశి శ్రీనివాసరావు, లబ్దిదారుడ
 
 ఒరిజినల్ రేషన్ కార్డు తెస్తేనే సరుకులు
 అంతక ముందు సరుకులకు వచ్చినప్పుడు రేషన్ కార్డు డిపో వద్దనే పడిపోయింది. చేసేది లేక  కార్డు కోసం కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కార్డు లేదనే వంకతో  డీలర్ కొంతకాలం రేషన్ నిలిపి వేశారు. జిరాక్సు కాపీ తీసుకువచ్చి కొన్నాళ్ల నుంచి సరుకులు తీసుకుంటున్నా.  గతంలో ఎనిమిది కిలోల బియ్యం ఇవ్వగా ఇప్పడు మాత్రం నాలుగు కిలోలు మాత్రమే ఇస్తున్నారు. అదీ  వచ్చే నెల నుంచి ఒరిజినల్ రేషన్ కార్డు తీసుకువస్తేనే బియ్యం ఇస్తామని చెప్పారు.  ఏమి చేయాలో పాలు పోవడం లేదు.
  కుమ్మరి మేరిమ్మ, లబ్దిదారుల
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement