కోట్లు కొల్లగొడుతున్న ఇసుకాసురులు | Capturing the Capturing the isukasurulu | Sakshi
Sakshi News home page

కోట్లు కొల్లగొడుతున్న ఇసుకాసురులు

Published Thu, Jun 5 2014 3:02 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

కోట్లు కొల్లగొడుతున్న ఇసుకాసురులు - Sakshi

కోట్లు కొల్లగొడుతున్న ఇసుకాసురులు

  •       అధికారుల అండదండలతో అరుణానదిలో ఇసుకను తరలిస్తున్న మాఫియా
  •      ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు
  •      మామూళ్ల మత్తులో జోగుతూ డీకేటీ భూముల్లో సైతం అనుమతి
  •  అధికారుల అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాచమార్గంలో ఇసుకను అరుణానది నుంచి తరలించేస్తున్నారు. భూగర్భగనుల, వ్యవసాయ, రెవెన్యూ, గ్రౌండ్‌లెవల్ వాటర్ అధికారుల అండదండలతో ఇసుక మాఫియా కోట్లు కొల్లగొడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డీకేటీ భూముల్లో సైతం అధికారులు అనుమతులు ఇచ్చేస్తుండడంతో అరుణానది పరీవాహక ప్రాంతం దోపిడీకి గురవుతోంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
     
    నాగలాపురం, న్యూస్‌లైన్: అరుణానది పరీవాహక ప్రాంతంలోని పట్టా భూముల్లో ఇసుకమేటలను తొలగించుకోవచ్చని గతంలో అధికారులు అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారులు మరో అడుగు ముందుకేశారు. డీకేటీ భూముల్లో సైతం అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ భూములను అమ్మినా కొన్నా చెల్లదని చట్టం చెబుతోంది. అయితే ఈ విషయాన్ని తెలిసిన అధికారులు ఇసుక తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
     
    బయటకొడియంబేడు గ్రామ రెవెన్యూ డీకేటీ భూమి సర్వే నంబర్ 282/3 లోని 4.35 ఎకరాలు, 282/4 లోని 2.30 ఎకరాల భూమిలోని ఇసుక మేటలను తొలగించుకోవచ్చని అన్నామలై, సుమన అనే వారి పేరున ఇసుక అక్రమార్కులు అనుమతులు పొందారు. ఈ భూమిని వ్యవసాయూనికి అనుకూలంగా మలచుకోవడానికి ఐదు అడుగుల లోతు వరకు ఇసుక మేటలను తరలించుకోవచ్చన్న ఉత్తర్వులు పొందిన వీరు 40 నుంచి 50 అడుగుల మేర లోతుకు హిటాచీ వాహనాలతో తవ్వి ఇసుకను పోగు చేసుకుంటున్నారు.

    యూభై అడుగుల మేర తవ్వినా వ్యవసాయూనికి ఆమోదయోగ్యం కాని భూములకు అధికారులు అనుమతులు ఇచ్చి ప్రోత్సహించడంలో అర్థమేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫియా ఇస్తున్న మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు జోగుతున్నారని ఆరోపిస్తున్నారు. అడ్డదారిలో అనుమతులు పొందిన భూమిని అడ్డం పెట్టుకుని ఏటిలోని ఇసుకను ఇష్టారాజ్యంగా హిటాచీ, జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను చేయడమేకాకుండా భారీవాహనాల్లో తరలిస్తున్నారు.

    ఇక్కడ తవ్విన ఇసుకను మన రాష్ట్రంలోనే అమ్ముకోవాలన్న నిబంధనలు ఉన్నా ఇసుకాసురులు తమిళనాడు, కర్ణాటకకు దర్జాగా తరలించుకుపోతున్నారు. చెన్నైలో యూనిట్ ఇసుక రూ.పదివేలు పలుకుతుండడంతో అక్రమార్కుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది.  ప్రస్తుతం కారణి రెవెన్యూలో సైతం ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందినట్టు తెలి సింది. అక్రమార్కులతో లాలూచీ పడుతున్న అధికారులు అక్రమంగా అనుమతుల మీద అనుమతులు ఇస్తూ పోతే తమ గతి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    ఇప్పటికే ఈ ప్రాంతంలోని వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గి పోరుుందని, వ్యవసాయం కుంటుపడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ అక్రమ రవాణాను ఆపాలని గ్రామస్తులు పలుమార్లు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. అక్రమ రవాణా కొనసాగుతూ నే ఉంది. అక్రమ రవాణాను ప్రశ్నించిన వారి పై స్మగ్లర్లు దాడులకు దిగుతున్నారు. ఆందోళన చేయడం తప్ప వేరు మార్గం లేదన్న ఆలోచనలో రైతులు ఉన్నారు.
     
    గతం పునరావృతమవుతుందా..
     
    మండలంలోని కారణి గ్రామ రెవెన్యూలోని పది ఎకరాల పట్టా భూమిలో ఇసుకమేటలను తొలగించుకునేందుకు అధికారులు ఎనిమిదేళ్ల కిందట అనుమతులు ఇచ్చారు. వీరు అప్పటి లెక్క ప్రకారం భూగర్భగనుల శాఖకు సుమారు నాలుగు లక్షల రూపాయల సీనరేజ్ చెల్లించి ఇసుక తరలింపునకు అనుమతులు పొందారు. వీటిని అడ్డంగా పెట్టుకున్న అక్రమార్కులు సుమారు సంవత్సరం పాటు నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాల్లో ఇసుకను తరలిం చారు.

    ఇది సరికాదని రైతులు మొర పెట్టుకు న్నా అధికారులు పట్టించుకోలేదు. సంయమనం కోల్పోరుున రైతులు ఆందోళనకు దిగా రు. అక్రమార్కులకు చెందిన హిటాచీ, కారు, ద్విచక్రవాహనంతో సహా అరుణానదిలో వేసుకున్న గుడిసెలను కాల్చి వేశారు. దీంతో ఇసుక అక్రమ తరలింపునకు బ్రేక్ పడింది. ఈ సంఘటనతో 72 మంది రైతులపై కేసు నమోదు చేశారు.

    సుమారు నాలుగు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. తాజాగా అధికారులు అటువంటి అనుమతులను ఇచ్చి ఇసుక అక్రమ తరలింపును ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం లో జరిగిన సంఘటనలు పునావృతం కాకుం డా చూడాలంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement