
సాక్షి, పశ్చిమ గోదావరి : భీమవరం మండలం జొన్నలగడ్డలో మరోమారు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు, గ్రామస్థులను మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ పరిస్థితికి దారితీసింది. ఆక్వా పార్క్‌కి వ్యతిరేకంగా స్థానికులు మూడు రోజుల నుంచి జొన్నలగరువులోని వాటర్ ట్యాంక్‌పై ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. పోరాట కమిటి నేతలు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులులను మూడోరోజు కూడా వాటర్ ట్యాంక్‌పై నిరసనను కొనసాగించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకుతామని వారు బెదిరించడంతో పోలీసులు ట్యాంక్ చూట్టు వలలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డిమాండ్లపై చర్చిస్తామని, ఆదివారం పోరాట కమిటీ నాయకులను చర్చకు పిలిశారు.
ముందుగానే అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు.. డీఎస్పీ ఆదేశంతో వారిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉత్రిక్తంగా మారింది. మహిళలను కూడా ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్‌లో పడేశారు. అక్కడి చేరుకున్న గ్రామస్థులను, మహిళలను, సీపీఎం నేతలు పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లపై పోరాట కమిటీ నేతలు మండిపడుతున్నారు. ఆక్వా పార్క్‌ను తరలించే వరకు తమ దీక్ష చేస్తామంటూ పోరాట కమిటీ నేతలు ప్రకటించారు. పోలీసులు వాటర్ ట్యాంక్ మీదుకు వస్తే పైనుంచి దూకేస్తామని నేతలు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment