bhemavaram
-
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది
-
ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం
సాక్షి, భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా అక్టోబర్ 2న నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నట్టు ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. శనివారం భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదేరోజు హరితభారత్ కార్యక్రమంలో భాగంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తాను నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో 150 మొక్కలు చొప్పున నాటించనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో కూడా మొక్కలు నాటించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు చేతుల మీదుగా ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో మొక్కలు పెంపకం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రస్తుతం నిధులు దుర్వినియోగానికి అవకాశం లేకుండా మొక్కలను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుందని వాటి సంరక్షణను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిలో భాగంగానే మొక్కల పెంపకంలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారుచేయడానికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఎంపీ కోరారు. అనంతరం వివిధ మండలాల అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి సమీక్షించారు. విలేకరుల సమావేశంలో పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ ఇన్చార్జ్ కవురు శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు. -
అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై
భీమవరం(ప్రకాశం చౌక్): 2009లో మెగాస్టార్ చిరంజీవిపై, ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై పందేలు కాసి జిల్లాలోని యువత రూ.కోట్లలో నష్టపోయారు. అప్పట్లో చిరంజీవి పాలకొల్లు నుంచి గెలుస్తారని, రాష్ట్ర సీఎం అవుతారంటూ అభిమానులు.. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన యువత భారీగా పందేలు కాశారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అలాగే ఆ పార్టీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో పందేలు కాసినవారంతా పెద్ద ఎత్తున నష్టపోయారు. చిరంజీవి సభలకు లక్షల్లో జనం రావడం చూసి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అభిమానులు, ఓ సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. దీంతో చాలామంది వ్యాపారులు, సంపన్నులే కాకుండా మధ్యతరగతికి చెందిన అనేకమంది అప్పులు చేసి మరీ పందేలు కాశారు. కొంతమంది ఆస్తులు తాకట్టుపెట్టి చిరంజీవిపై లక్షల్లో పందేలు కట్టారు. ఆ అప్పులు తీర్చడానికి వారికి సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆ పందేల్లో డబ్బులు పోగొట్టుకున్నామనే బాధ కంటే.. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పదేళ్ల అనంతరం తమ్ముడు మళ్లీ పదేళ్ల అనంతరం చిరంజీవి తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ భీమవరం నుంచి గెలుస్తారని పెద్ద ఎత్తున పందేలు కాశారు. పవన్ కల్యాణ్ సభలకు జనం భారీగా రావడంతో భీమవరంలో ఆయన ఎలాగైనా గెలుస్తారని అభిమానులు, ఆయన సామాజికవర్గానికి చెందిన యువ ఓటర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ లేకపోయినా.. కనీసం భీమవరంలో కొద్ది తేడాతో గెలుస్తారని చివరివరకూ ధీమాగా ఉన్నారు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో విజయం సాధిస్తారని, పార్టీకి 30 సీట్లు వస్తాయని జనసైనికులు లెక్కలేసుకుని లక్షల రూపాయలు పందేలు కట్టారు. ఈసారి ఆ సామాజివర్గంలోని పెద్దలు పందేల జోలికి వెళ్లలేదు. కానీ యువత మాత్రం పెద్ద ఎత్తున బరిలోకి దిగింది. భీమవరం, గాజువాకలో గెలుస్తారంటూ సీట్లు, ఓట్ల శాతంపై గుడ్డిగా డబ్బులు పెట్టేశారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు గెలుస్తాడని కూడా పలువురు పందేలు కట్టారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం, ఆ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకోవడంతో మొత్తంగా రూ. కోట్లలో పందేలు ఓడిపోయారు. భీమవరంలో రూ.కోటికిపైగా పందేలు భీమవరంలో పవన్ కల్యాణ్ గెలుస్తాడని ఆ ప్రాంతంలో సుమారు రూ.కోటికిపైగానే పందేలు జరిగాయి. ఎన్నికల అనంతరం వారం రోజుల పాటు పవన్‌కల్యాణ్ గెలుస్తాడని జోరుగా ప్రచారం జరగడంతో ఇతర పార్టీలకు చెందిన వారు తమ పార్టీ అభ్యర్థులపై పందేలు కట్టేందుకు భయపడ్డారు. లక్షకు లక్షన్నర ఇస్తామని జనసేన పార్టీకి చెందిన కొందరు హషారుపడ్డారు. ఆ తర్వాత సర్వే సంస్థలు, పలువురు నేతల చేసిన సర్వేల్లో భీమవరం గ్రంధి కచ్చితంగా గెలుస్తారని తెలియడంతో మిగిలిన రెండు పార్టీలకు చెందిన వారు పవన్ అభిమానులతో పందేలు వేశారు. ఇప్పుడు గ్రంధి గెలుపుతో ఆయన గెలుస్తారని పందేలు వేసిన వారు సంబరాల్లో ఉంటే.. పవన్‌పై వేసిన వారు మాత్రం పూర్తి నిరాశలో మునిగిపోయారు. అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై పందేలు కట్టి పలువురు అభిమానులు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. -
ఓట్లు చీల్చడానికే పవన్ కుట్ర
సాక్షి, భీమవరం: చంద్రబాబు పాలనతో ప్రజలతో విసిగిపోయారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి తెలుగుదేశంపార్టీకి అండగా ఉండడానికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సోమవారం భీమవరం బస్టాండ్‌సెంటర్‌లో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో శ్రీనివాస్ మాట్లాడారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)పదేళ్లుగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ప్రశ్నిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న వపన్‌కల్యాణ్ భీమవరం అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అరాచకల గురించి మాట్లాడకుండా తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేయడానికి పసుపు–కుంకుమ అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీచేయడమేగాక వడ్డీలేని రుణాలు అందిస్తారని దీనిని మహిళలంతా గ్రహించాలన్నారు. గత ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ పూర్తిగా అమలుచేయలేదని, ప్రస్తుత ఎన్నికల్లో విమానాలు సైతం ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను మోసగించడానికి ప్రయత్నంచేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి దోచేశారని, మళ్లీ అధికారం ఇస్తే ఇక ఏమీ మిగల్చరని దుయ్యబట్టారు. ఫీజురీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కాక విద్యార్థులు నష్టపోవడమేకాక అనేక విద్యా సంస్థలు మూతదశకు చేరాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చడానికే జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రకటించారని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. బాబు పోతేనే జాబు : రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 23 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలవలేకపోయిన చంద్రబాబునాయుడి వంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఉద్యోగం పోతే.. ఆ తర్వాత రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, దానికిగాను టీడీపీని చిత్తుగా ఓడించాలని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయి రుణ మాఫీ చేయకుండా పసుపు–కుంకుమ పేరిట మోసగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేల గురించి మోసపోకుండా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఒనగూరే డ్వాక్రా రుణ మాఫీ గురించి ఆలోచించాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే జిల్లా వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భీమవరం ప్రాంతాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేయడమేకాక ఆక్వా రంగంలో పనిచేసే మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. భీమవరం పట్టణంలో రీల్ హీరో పవన్ కల్యాణ్ కంటే రియల్ హీరో గ్రంధి శ్రీనివాస్ వల్లే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మాకు నటించడం రాదు ప్రజలతో మమేకం కావడమే తెలుసునన్నారు. సభలో పార్టీ ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పీవీఎల్ నర్సింహరాజు, ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం, ఉండి మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, కె.కృష్ణ శ్రీనివాస్, మంతెన యోగీంద్రకుమార్, గాదిరాజు సుబ్బరాజు, కామన నాగేశ్వరరావు, పేరిచర్ల విజయనర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికలు భీమవరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగసభలో తోట భోగయ్య, పారిశ్రామికవేత్త అవినాష్‌వర్మ, బీసీ సంఘం నాయకురాలు చంద్రకళ తదితరులు చేరారు. వీరికి జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. -
ఉద్యోగాల విప్లవం తెస్తాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరుటౌన్: భీమవరం పట్టణం సోమవారం జన ప్రభంజనంతో హోరెత్తింది. పట్టణమంతా జగన్ నామస్మరణతో మారుమోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయా అన్నట్లు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వైఎస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు రాగానే సీఎం..సీఎం అంటూ యువత, పార్టీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వేలాదిగా తరలివచ్చిన వైస్సార్సీపీ సైన్యం మధ్య వైఎస్ జగన్ ప్రసంగించారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. గత పాలకుల లోపాలను తేటతెల్లం చేస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు సుస్పష్టంగా వివరించారు. నేనున్నానంటూ మీ సమస్యలపై పోరాడే లోకల్ హీరో కావాలా... ఎక్కడో ఉండే సినిమా యా క్టర్ కావాలో మీరే తేల్చుకోవాలంటూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గంలో ప్రతి అడుగులోనూ ప్రతి సమస్యలోనూ నేనున్నాను అంటూ ఒక లోకల్ హీరో ఉన్నాడు. అదే మన శ్రీనన్న. ఒక లోకల్ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్ చేసే ఇంకొక యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి. ఈ నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఈ ఐదేళ్ళ చంద్రబాబు ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయా.. ఇదే చంద్రబాబు, ఆయన పార్టనర్ ఏనాడైనా ప్రజల సమస్యలపై పోరాటం చేశారా. మీ ప్రతి సమస్యను పరిష్కరించి, భీమవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు మీకు మేమున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భీమవరం బుధవారం మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. భీమవరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను, నరసాపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై మీ చల్లని దీవెనలు ఉంచాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారు ప్రజాసంకల్ప పాదయాత్ర భీమవరం గుండా సాగింది. ఆరోజు మీరందరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతీ బాధ నాకు గుర్తుంది. చెప్పిన ప్రతీ కష్టం ఈ రోజు నాకు గుర్తుంది. ఇక్కడే ఇదే భీమవరం టౌన్లో నాన్నగారు 2008లో 82 ఎకరాలు సేకరించి పేద వాళ్లకు ఇళ్లు కట్టాలని పేదలకు ఇచ్చారు. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు సేకరించిన ఆ భూమిని ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ధాక్షిణ్యంగా లాక్కోవడం ఇక్కడే ఈ భీమవరంలోనే చూశాం. లాక్కుని ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఏమిటంటే.. అవినీతితో కూడిన ఫ్లాట్లను కట్టే కార్యక్రమానికి నాంది పలికాడు. ఆశ్చర్యమేంటో తెలుసా ఆ ఫ్లాట్లల్లో సిమ్మెంట్ సబ్సిడీకి ఇస్తారు. ఆ అపార్ట్మెంట్లకు భూమి ప్రభుత్వందే కాబట్టి ఉచితంగా ఇచ్చింది. ఆ ఫ్లాట్లలో లిఫ్టులు ఉండవు, గ్రానైట్ ఫ్లోరింగ్ ఉండదు. ఇటువంటి ఫ్లాట్లను కట్టడానికి ఏ కాంట్రాక్టర్‌ను మనం అడిగినా కూడా అడుగుకు మహా అయితే రూ.1000 అవుతుందని చెబుతారు. అదే ఇక్కడ 300 అడుగుల ఫ్లాట్లకు అడుగుకు రూ.2200 చొప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అని ఇక్కడి పేద ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 300 అడుగుల ఫ్లాట్లు అడుగుకు రూ.1000 కూడా కాదు అని అంటే రూ.3 లక్షలకు అందుబాటు అయ్యే ఆ ఫ్లాటు పేదవాడికి అడుగుకు రూ.2200 చొప్పున అమ్ముతూ 300 అడుగులు అంటే రూ.6.40 లక్షలకు అమ్ముతా ఉన్న పరిస్థితి ఈ పేదవాడు వచ్చి నాకు చెప్పి్పన మాట. ఆ ఆరు లక్షల చిల్లర ఫ్లాట్లలో రూ. లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో రూ.లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది. మిగిలిన రూ.3 లక్షలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు చంద్రబాబునాయుడు తీసుకున్న లంచాలకు 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబునాయుడు ఆ లంచాలకు పేదవాడు 20 ఏళ్లపాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. ఆ ప్రతీ పేదవాడికి జగన్ అనే నేను మీ అందరికీ ఇవాళ చెబతా ఉన్నాను. చంద్రబాబు ఎన్నికల కోసమని చెప్పి ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి, ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫ్లాట్ల మీద ఏదైతే మీరు 20 ఏళ్లు పాటు నెలనెలా రూ.3 వేలు బ్యాంకులకు కడుతూ పోతా ఉన్నారో ఆ మొత్తం రూ.3 లక్షలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అని జగన్ అన్నారు. తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు ఇదే భీమవరం నియోజకవర్గంలో అక్షరాలా తాగడానికి నీళ్లు లేవని ఆ రోజుల్లో ఆ దివంగత నేత 126 ఎకరాలు సేకరించి మంచినీటి చెరువులు కట్టి ఇక్కడి ప్రజలకు తాగడానికి నీటిని సప్లై చేశారని ప్రజలు చెప్పినప్పుడు సంతోషం వేసింది. ఇవాళ ఈ ఐదేళ్ల చంద్రబాబునాయుడి పాలనలోనే భీమవరం చుట్టు పక్కల ఇప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. ఈ ఐదేళ్లలో గ్రామాలకు తాగడానికి నీరు లేకపోతే ఈ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ గాడిదలు కాస్తా ఉన్నాడు అని ప్రశ్నించారు. రోగాలతో ప్రజలు అవస్థలు ఇదే భీమవరం నియోజకవర్గంలో చెత్త వేసేదానికి డంపింగ్‌యార్డు కూడా లేదు. అంటే ఆ చెత్త మొత్తంగా టౌన్ మధ్యలోనే వేసే పరిస్థితి ఉంది. ఆ వాసనకు, ఆ దోమలకు పురుగులకు రోగాలు వచ్చి అవస్థలు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే వాడు కూడా ఈ ఐదేళ్లలో లేడు. ఈ చంద్రబాబు ప్రభుత్వం నిద్రపోతా ఉందా అని మీ అందరి తరపున అడుగుతున్నా. చెత్తను మొత్తం యనమదుర్రు డ్రెయిన్‌లో పడేస్తా ఉన్నారు. రాజకీయాల్లో లబ్ది పొందేందుకు ఇదే యనమదుర్రు డ్రెయిన్‌లో అఫ్లియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మొత్తం ప్రాజెక్ట్‌తో మొత్తం నీళ్లన్నీ శుద్ది చేస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చాడు. నేను మిమ్మల్ని అడుగతా ఉన్నా ఈ ఐదేళ్లలో యనమదుర్రు డ్రెయిన్ శుభ్రం చేశారా అని నిలదీశారు. ట్రాఫిక్ సమస్య తీరిందా? ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అప్పట్లో నాన్నగారి హయాంలో మార్కెట్‌యార్డు వరకూ బైపాస్ రోడ్డు వేశారు. ఆ తర్వాత ఆ రోడ్డు అంగుళం కూడా ముందుకు సాగని పరిస్థితి మీ కళ్లెదుటే కనిపిస్తా ఉంది. నియోజకవర్గంలో రైతన్నలు అన్నా వరి ధాన్యం పండిస్తా ఉన్నాం మద్దతు ధర రూ.1550 అని చెప్తారు. కాని పంట చేతికి వచ్చే సరికి రూ.1200, 1300 క్వింటాలుకు రాని పరిస్థితి ఉందని మేము ఎలా బతకగలం అని ఆవేదనతో అన్న మాటలు ఇవాళ్లకు కూడా నాకు గుర్తున్నాయి. ఆక్వా పరిస్థితి చూస్తే 100 కౌంటు రొయ్యల ధర కనీసం రూ.270 ఉంటేగాని కనీసం ఖర్చులు కూడా రావు, అటువంటిది ఇదే 100 కౌంటు రొయ్యల ధర రూ.200కు పడిపోవటంతో ఆక్వా రైతు పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. లోకల్ హీరో శ్రీనన్న ఇక్కడే ప్రతీ అడుగులోనూ ప్రతీ సమస్యలోనూ నేనున్నాను అనంటూ ఒక లోకల్ హీరో ఉన్నాడు. అదే మన శ్రీనన్న. ఒక లోకల్ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్ చేసే ఇంకొక సినిమా యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి అని జగన్ అన్నారు. ఐదేళ్ల చంద్రబాబునాయుడు పాలన మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఈ ఐదేళ్లలో ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలేమిటి? ఎన్నికల ప్రణాళిక, మ్యానిఫెస్టోలో రాసిన రాతలేమిటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్దమనిషి చంద్రబాబు చేసిందేమిటి అన్నది మీరందరూ కూడా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలని కోరారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మన చూసింది మోసం చేయడమే అన్నారు. దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ ఎవరూ అంటే వినిపించేది చంద్రబాబు పేరేనన్నారు. చంద్రబాబు జీవితం రెండెకరాల నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేశాడో వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు. మన లోకల్ హీరో గ్రంధి శ్రీనన్నకు మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా ఉంది. ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎంపీ అభ్యర్ధి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం, ఉండి అభ్యర్ధులు కొట్టు సత్యనారాయణ, పీవీఎల్ నరసింహరాజు, కొయ్యే మోషన్‌రాజు, పాతపాటి సర్రాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేండ్ర వెంకటస్వామి, గూడూరు ఉమాబాల, ఏఎస్‌రాజు, గాదిరాజు సుబ్బరాజు, మేడిద జాన్సన్, మంతెన బాబు, పేరిచర్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పార్టనర్ యాక్టర్ ఒక్కసారైనా వచ్చారా? తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం బారిన పడతామని, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి సముద్రతీరానికి తీసుకుపోయి అవసరమైతే అంతో ఇంతో సహాయం చేసి అక్కడ పెడితే ప్రజలు, సంతోషించే వాళ్లు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా సంతోషించేవారు. అలా కాకుండా అక్కడే ఫ్యాక్టరీ పెట్టించి డ్రెయిన్లు నాశనమైన పరిస్థితులు కల్పించారు. తుందుర్రులో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి అన్నా చంద్రబాబు ఎలాగూ సహాయం చేసింది లేదు. కనీసం అక్కడ ధర్నా చేస్తా ఉన్న ప్రజలకు కనీసం ఒక్కసారి అయినా నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఈ యాక్టర్, చంద్రబాబు పార్టనర్ కనీసం ఒక్కసారైనా వచ్చారా అని నిలదీశారు. -
గెలిచినా రాజీనామానే..?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరులో మకాం ఉంటారని గతంలో ఇల్లు వెతికారు. తర్వాత ఓటు కూడా ఇక్కడే నమోదు చేశారు. ఏలూరులో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఏం అనుకున్నారో తెలియదు కాని విజయవాడలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఓటు కూడా అక్కడికి మార్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక హడావుడిగా గాజువాక, భీమవరంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన తాజా కబురు ఏమిటంటే పవన్ కల్యాణ్ గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు. విశాఖపట్నం తో ఏం సంబంధం ఉందని ఇక్కడ పోటీ చేస్తున్నారని, నాన్‌లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు. ఎన్నికలకు పది రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గెలిస్తే ఇక్కడే ఉంటానని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చేందుకని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే భీమవరంలో గెలుపుపై నమ్మకం లేదని, అందువల్ల ఒకవేళ గెలిచినా భీమవరం స్థానాన్ని పవన్ వదులుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఇక్కడ ఉండే విషయంపై ప్రకటన చేస్తారేమో చూడాలి. గెలిచినా ఇక్కడ ఉంటారన్న నమ్మకం అయితే భీమవరం ప్రజలకు లేకుండా పోయింది. ఏలూరు, తాడేపల్లిగూడెం, అనంతపురం, పిఠాపురం, విజయవాడ సెంట్రల్ ఇలా అనేక నియోజకవర్గాలను తెరపైకి తెచ్చి ఆ తర్వాత సర్వేలు చేయించుకుని కాపు ఓట్లు ఎక్కువ ఉన్న భీమవరం, గాజువాక సీట్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కనీసం భీమవరంలో పోటీ చేయాలని భావించినప్పుడైనా ముందుగా పవన్ కల్యాణ్ ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం జనసేన వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ తనతో పాటు తన అన్నను కూడా నర్సాపురం సీటులో పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక్కరే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇల్లు తీసుకునే ప్రయత్నం ఆయన నుంచి కూడా జరగలేదు. ఎన్నికల ఫలితాల తర్వాతే వారు ఇక్కడ ఉండాలా వద్దా అన్నది ఆలోచించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా కనీసం నామినేషన్ సందర్భంలోనైనా ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదని. ఇప్పుడు సరిగ్గా పదిరోజులు కూడా ప్రచార గడువు లేని పరిస్థితుల్లో కూడా ఇల్లు తీసుకోకపోవడం, కనీసం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఒక ఖాళీ స్థలం తీసుకుని అక్కడ ఎన్నికల కార్యాలయం పెట్టారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు వచ్చినా పెదఅమిరంలోని నిర్మలాదేవి కళ్యాణ మండపంలో బస చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడే బస చేస్తున్నారు. జిల్లా నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు కనీసం పార్టీ కార్యాలయం కూడా లేకపోవడం ఏంటని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. భీమవరంలో గత రెండుసార్లుగా పెడన నియోజకవర్గం నుంచి ఇక్కడకి వచ్చి స్థిరపడిన అంజిబాబును గెలిపించడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉండిపోయామన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచో వచ్చిన పవన్ కల్యాణ్‌ను భీమవరం ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం జనసేనలో కనపడటం లేదు. గతంలో ఎన్టీఆర్ రెండుచోట్ల పోటీచేసినా ఒకటి ఆంధ్రాలో రెండోది తెలంగాణాలోగాని రాయలసీమలోగాని ఉండేటట్లు చూసుకున్నారు. చిరంజీవి కూడా కోస్తా, రాయలసీమల్లో పోటీ చేశారు. కానీ పవన్ మాత్రం పూర్తిగా కోస్తాలోనే రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో కులం బలం వున్నా, నమ్మలేం అని అనుకున్నారేమో? పైగా అన్న చిరంజీవికి జరిగిన పరాభవం గుర్తుకు వచ్చిందేమో? గాజువాకపైనే నమ్మకం పెట్టుకుని అక్కడ ఇల్లు తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా రెండుచోట్ల గెలిచినా ఓ చోట రాజీనామా చేయాల్సిందే. మళ్లీ ఉపఎన్నిక రావాల్సిందే. అందువల్ల పవన్ భీమవరం నుంచి గెలిచినా రాజీనామాకే డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని భీమవరం జనాలు అర్థం చేసుకుంటారని వైఎస్సార్ సీపీ గట్టి నమ్మకంతో ఉంది. ఇక్కడ లోకల్ అయిన గ్రంధికి ప్రజలు పట్టం కట్టడం ఖాయం అని స్థానికులు అంటున్నారు. -
నేను లోకల్..
సాక్షి, భీమవరం : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, వారికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండటమే నాకు తెలిసింది. ఎక్కడి నుంచో దిగుమతి అయిన నాయకులు గెలిస్తే ఎలా ఉంటుందో గడిచిన పది సంవత్సరాలుగా భీమవరం ప్రజలు అనుభవిస్తున్నారు. మరోసారి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానికుడిని గెలిపించాలని భీమవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఓటర్లలో ఉత్కంఠతను రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజాసమస్యలపై పోరాటమే శ్వాసగా భావించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సినీనటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి? గ్రంధి: భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన, యనుమదుర్రు డ్రెయిన్‌పై అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన, అప్రోచ్‌రోడ్లు, బైపాస్ రోడ్డును విస్సాకోడేరు శివారు వరకు అభివృద్ధి చేయడం వంటివి ప్రధానమైన అజెండా. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్స్ నిర్మాణం, పట్టణ శివారు ప్రాంతాల్లో కొత్తరోడ్లు ఏర్పాటు, వీరవాసరం, భీమవరం మండలాల్లో మంచినీరు, మురుగునీరు సమస్య, పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మాణం వంటివాటిని ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను. ప్రశ్న: మీరు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏమిటి? గ్రంధి: భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చాను. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయించాను. పేదలకు సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించాను. 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాను. యనమదుర్రు డ్రెయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డుకు శ్రీకారం చుట్టాను. ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశాను. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్ల జోన్ ఏర్పాటు చేయించాను. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశాను. ప్రశ్న: ఎన్నికల బరిలో మీ బలం ఏమిటి? గ్రంధి: ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాను. ఏ సమయంలోనైనా నా వద్దకు రావచ్చు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటమే నా బలం. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఉంది. అందుకే మరోసారి రాజన్న రాజ్యం సాకారం చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాను. ప్రశ్న: రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు? గ్రంధి: మా నాన్న గ్రంధి వెంకటేశ్వరరావే నాకు రాజకీయంగా స్ఫూర్తి. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయ్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సూపర్‌స్టార్ కృష్ణ నా అభిమాన నాయకులు. ప్రశ్న: రాజకీయ ప్రవేశం ఎప్పుడు? గ్రంధి: విద్యార్థిదశలో ఉండగానే దాదాపు 1977 ప్రాంతంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నా. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో చురుకుగా పనిచేశా. ప్రశ్న: చేపట్టి రాజకీయపదవులు? గ్రంధి: మొట్టమొదటిసారిగా భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పదవిని చేపట్టి వెనువెంటనే జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి వరించింది. ప్రశ్న: ప్రజాక్షేత్రంలో ఎప్పుడు పోటీలో పాల్గొన్నారు? గ్రంధి: 1995లో భీమవరం అర్బన్బ్యాంక్ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించా. అనంతరం 2004లో భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించా. ప్రశ్న: ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం? గ్రంధి: నా తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగా. కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేగాక ఎంతో అండదండగా ఉంటున్నారు. ప్రశ్న: రాజకీయాల్లో మీ లక్ష్యం? గ్రంధి: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించడమే లక్ష్యం. -
ప్రగల్భాల పవనం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల (విశాఖజిల్లాలోని గాజువాక, జిల్లాలోని భీమవరం) నుంచి పోటీ చేస్తున్నారు. రెండుచోట్లా గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని వదిలేయాల్సిందే. ఏది ఉంచుకుంటారో... దేనిని వదిలేస్తారో ఆయనకే తెలియాలి. ఆయన మాత్రం రెండు చోట్లా ఓటర్లపై అలవిమాలిన ప్రేమ ఒలకబోస్తూ.. నోటికొచ్చిన హామీలు ఇవ్వడాన్ని జనం నమ్మడం లేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాను గెలిస్తే భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నామినేషన్ల సందర్భంగా హామీ ఇచ్చారు. నామినేషన్లు వేయగానే భీమవరంపై ఎనలేని ప్రేమ కురిపించారు. తాను గెలిస్తే భీమవరం తాగునీటి సమస్యకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తానని పవన్కల్యాణ్చెబుతున్నారు. గతంలో ప్రజాసమస్యలపై స్పందిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తే, ముఖ్యమంత్రి అయితేగానీ పనులు చేయరా అంటూ భీమవరం వేదికగానే పవన్ ఎద్దేవా చేశారు. తన వంతు వచ్చేసరికి మాట మార్చి తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు. భీమవరం నుంచే ఉచిత విద్య, భీమవరం ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వేయి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం అంటున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌పై మీరు కోరినన్ని వంతెనలు, ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తానని, భీమవరం అభివృద్ధికి ప్రత్యేక సిబ్బంది నియామకం అంటూ వరాల జల్లు కురిపించేశారు. గత ఐదేళ్లుగా ఆ ప్రభుత్వంతో కలిసి ఉన్న వ్యక్తికి భీమవరం తాగునీటి సమస్య, డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం ఎందుకు గుర్తుకు రాలేదో అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. తానే పులపర్తి రామాంజనేయుల్ని ఎమ్మెల్యేగా, గోకరాజు గంగరాజును ఎంపీగా గెలిపించానని చెప్పుకుంటున్న పవన్‌కళ్యాణ్ ఈ ఐదేళ్లలో భీమవరానికి ఏం చేశారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సమస్య పరిష్కారం కోసం అయినా ఆయన కృషి చేశారా అన్న ప్రశ్న భీమవరం ప్రజల నుంచి వస్తోంది. తుందుర్రు అక్వా పార్కు నిలుపుదల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే, చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఉద్యమ కారులపై కేసులు పెట్టడంతో పాటు వారిపై నిర్బంధ కాండను అమలు చేసింది. ఆ సమయంలో ఉద్యమకారులు పవన్‌కళ్యాణ్‌ను పలుమార్లు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నా ఆయన మాట్లాడి పంపడం తప్ప ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. భీమవరంలో పది రోజులు మకాం వేసినప్పుడు కూడా ఆయన వేరే దారి నుంచి మొగల్తూరు వెళ్లారు. తాజాగా కూడా ఆయన ఉద్యమకారులకు అండగా మాట్లాడలేదు. ఈ ప్రాంత సమస్యల గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ఏనాడూ ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా మారుస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో గెలిస్తే పరిస్థితి ఏంటి? రెండుచోట్లా గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని కచ్చితంగా వదులుకోవాల్సిందే. అలాంటప్పుడు పవన్ మాటలు ఎంతవరకూ నమ్మాలని ప్రజలు నిలదీస్తున్నారు. నిజంగా రెండుచోట్లా గెలిస్తే సిద్ధాంతాల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఉప ఎన్నిక భారం ప్రజలపై ఎలా మోపుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ సమస్య ఉత్పన్నం కాదని నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి కనుమూరి రఘురామకృష్ణంరాజు బల్లగుద్ది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో ప్రజలు ఒక్క పని కూడా చేయించుకోలేరు. కనీసం ఒక్క ఫొటో కూడా తీయించుకోలేరు. ఎమ్మెల్యేతో పనిచేయించుకోవాలి అనుకునేవారు ఎవ్వరూ కూడా పవన్‌కు ఓటేయరు. భీమవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీనివాస్ మంచి మెజార్టీతో గెలుస్తారు అని స్పష్టంగా చెబుతున్నారు. -
అందరివాడు..అందనివాడు
భీమవరం నియోజకవర్గ ప్రజల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సింది నిత్యం తమ మధ్యే ఉంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్నా? సినీగ్లామర్‌తో రాజకీయాల్లోకి ప్రవేశించి రెండుచోట్ల నుంచి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్నా? ఏ సమస్య వచ్చినా ప్రజల ముందుండి పోరాడే గ్రంధి శ్రీనివాస్ ఒకవైపు బరిలో ఉంటే, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎలా కలవాలో తెలియని పవన్ కళ్యాణ్ మరోవైపు బరిలో ఉన్నారు. మరోవైపు పవన్ ఎన్నికల తర్వాత గాజువాకను ఉంచుకుని భీమవరాన్ని వదిలేస్తారనే ప్రచారం జనసేన వర్గాల్లోనే జోరుగా జరుగుతుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల కోసం ఏనాడూ ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినన్ని రోజులు ఇక్కడ పోలీసుల నిర్బంధకాండపై, మొగల్తూరులో ఆక్వా పరిశ్రమలో ఐదుగురు చనిపోయినా ఎన్నడూ స్పందించలేదు. నామినేషన్ వేసిన తర్వాత కూడా కేవలం వైఎస్సార్ సీపీ అభ్యర్థిని మాత్రమే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, పదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబును పల్లెత్తు మాట కూడా అనలేదు. దీన్నిబట్టి అక్కడ తెలుగుదేశం–జనసేన బంధం ఎంత గట్టిగా ఉందో అర్థం అవుతుంది. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్) అంటూ హడావిడి మొదలుపెట్టిన పవన్‌కళ్యాణ్ దాని పేరిట రూ.2 కోట్లు డిపాజిట్ చేస్తున్నామని.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా, ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా డైలాగులు చెప్పారు. తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. సీపీఎఫ్ ఏమైందో తెలియదు. మళ్లీ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకుని బాబుతో జతకలిశారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. 2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా ప్రతి ఎన్నికకి గుర్తులు మారుస్తూ ప్రజల ముందుకు వచ్చి ఆ తర్వాత కనపడకుండా పోయే పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమవరం నుంచి పోటీకి సై అంటున్నారు. ఎన్నికల తర్వాత కన్పించని అందనివాడు కావాలా, నిత్యం భీమవరంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే అందరివాడు గ్రంధి శ్రీనివాస్ కావాలా? గ్రంధి శ్రీనివాస్.. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలోనే పుట్టి పెరిగారు. చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరితో కలివిడిగా ఉంటున్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చారు. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేశారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించారు. 700 మంది పేదలకు గ్రంధి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. యనమదుర్రు డ్రైయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. భీమవరం మండలంలో పేదలకు 1,000 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. తోపుడుబండ్ల వర్తకులకు హాకర్లజోన్ ఏర్పాటు చేయించారు. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. ప్రజలతో మమేకం అవుతారు, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై, తుందుర్రు ఆక్వాఫుడ్ పార్కుపై అలుపెరుగని పోరాటం చేశారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. 2019లో మళ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర గ్రంధి శ్రీనివాస్‌ది. స్థానికుడు కావడంతో నియోజకవర్గ సమస్యలపై అవగాహన పవన్ కళ్యాణ్ చిరంజీవి పుట్టిన ఊరు మొగల్తూరు. ఇది నరసాపురం నియోజకవర్గంలో ఉంది. కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు నరసాపురంలో పోటీ చేయకుండా పాలకొల్లులో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ రెంటికి సంబంధం లేని పక్క నియోజకవర్గం అయిన భీమవరాన్ని ఎంచుకున్నారు. నాకు కులమతాలే లేవని చెప్పిన పవన్ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఈ జిల్లాలో నుంచున్నానని సెలవిచ్చారు. నిజంగా అదే కారణం అయితే దెందులూరులో నిల్చోవచ్చు కదా? భీమవరంలోనే గెలిచేటట్లైతే గాజువాకలో ఎందుకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై అపనమ్మకమా? అన్న పరాజయం భయపెట్టిందా? ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్ వదిలేస్తారు?ఖచ్చితంగా భీమవరమే.. అనుమానం ఏమైనా ఉందా?.. రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది? అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు? పోనీ గెలిచినా.. ఓడినా భీమవరంలో ఉంటారా? ఇంతకుముందు ఏలూరులో ఆఫీసు పెడతానని, ఇక్కడి నుంచే ఓటు నమోదు చేయించుకుని తర్వాత విజయవాడ వెళ్లి అక్కడే ఓటు నమోదు చేయించుకోలేదా? ఏ మాత్రం నిలకడలేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా? రూ. 50 లక్షలు బ్లాక్‌మనీ లేదని మొదటి నుంచి నమ్ముకున్న తనను తప్పించి అవినీతిపరుడైన చిర్రి బాలరాజుకు టిక్కెట్ ఇచ్చారంటూ దివ్వెల సృజన ఆవేదన నిజం కాదా? పార్టీలో కీలకమైన బాధ్యతలు చూసే సృజనకే 20 రోజులు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ కలవలేదు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో విజ్ఞత గలిగిన ఓటర్ ఆలోచించే సమయం వచ్చింది. -
ఏసీబీ కొరడా
భీమవరం (ప్రకాశం చౌక్): రైతుకు పాస్‌బుక్ కావాలంటే లంచం.. రొయ్యల చెరువులకు అనుమతులు కావాలంటే లంచం.. పొలాలను సర్వే చేయాలంటే లంచం.. పోలీసు కేసు లేకుండా చూడాలంటే లంచం.. ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం సామాన్యుడికి కష్టంగా మారింది.. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కొందరు అవినీతి అధికారులు సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకూ అందరినీ పీల్చిపిప్పిచేస్తున్నాయి.. పోలీసు శాఖలో డీఎస్పీ స్థాయినుంచి రెవెన్యూలో ఆర్ఐ, వీఆర్వో వరకూ ఇందుకు మినహాయింపు కాదు. ఏడాది వ్యవధిలో ఉభయగోదావరి జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో ఇలాంటి ఎన్నో నిజాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించడంతో 2018 నుంచి ఇప్పటివరకూ 25 కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఈనెలలోనే ఐదు రోజుల వ్యవధిలో ఒక ఎస్సై, ఏఎస్సై, సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం సంచలనం కలిగించింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, విద్యా, అటవీ, ట్రెజరీ, ఆడిట్, హౌసింగ్ తదితర శాఖల్లో అధికారులపై ఏసీబీ దాడులు ఎక్కువగా జరిగాయి. నాన్‌బెయిలబుల్ కేసులు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కుకున్న అధికారులపై నాన్‌బెయిలబుల్ కేసులను అవినీతి నిరో ధక శాఖ అధికారులు పెడుతున్నారు. సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ములు డిమాండ్ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా వ్యవహారాలు జిల్లాలోని పోలీస్ శాఖలో కొందరు అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో బ్రోకర్లను ఏర్పాటుచేసుకుని ఏ కేసు వచ్చినా పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయమైన కేసు ఫైల్ చేయాలన్నా, అక్రమ కేసు నమోదు చేయకుండా ఉండాలన్న బ్రోకర్ల ద్వారా వ్యవహారాలు నడుతుపున్నట్టు తెలుస్తోంది. మరికొందరు అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఈనెలలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఇద్దరు పోలీసు అధికారులు నేరుగా లంచం డిమాండ్ చేసి పట్టుబడినవారే కావడం విశేషం. లంచం అడిగితే మాకు చెప్పండి జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేసినా, సొమ్ములు ఇవ్వకపోతే పనులు చేయకపోయినా మా దృష్టికి తీసుకురండి. నా సెల్ నం: 94404 46157 ఫోను, వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయవచ్చు. అక్రమ అస్తుల వివరాలు తెలిపే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరం అని ప్రజలు తెలుసుకోవాలి. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై బెయిల్ రాని కేసులు కడుతున్నాం. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. లంచం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకోవాలి. ప్రస్తుతం చాలా శాఖలకు సంబంధించి పనులు ఆన్లైన్లో అయిపోతున్నాయి. చదువుకున్న యువత మంచి అవగాహన కల్పించుకుని సామాన్యులకు ఆన్‌ౖలñ న్ల ద్వారా పనులు జరుగుతున్నట్టు వివరించాలి. – వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ ఏలూరు -
జొన్నలగడ్డ అక్వా పార్క్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం
-
జొన్నలగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమ గోదావరి : భీమవరం మండలం జొన్నలగడ్డలో మరోమారు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు, గ్రామస్థులను మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ పరిస్థితికి దారితీసింది. ఆక్వా పార్క్‌కి వ్యతిరేకంగా స్థానికులు మూడు రోజుల నుంచి జొన్నలగరువులోని వాటర్ ట్యాంక్‌పై ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. పోరాట కమిటి నేతలు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులులను మూడోరోజు కూడా వాటర్ ట్యాంక్‌పై నిరసనను కొనసాగించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకుతామని వారు బెదిరించడంతో పోలీసులు ట్యాంక్ చూట్టు వలలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డిమాండ్లపై చర్చిస్తామని, ఆదివారం పోరాట కమిటీ నాయకులను చర్చకు పిలిశారు. ముందుగానే అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు.. డీఎస్పీ ఆదేశంతో వారిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉత్రిక్తంగా మారింది. మహిళలను కూడా ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్‌లో పడేశారు. అక్కడి చేరుకున్న గ్రామస్థులను, మహిళలను, సీపీఎం నేతలు పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లపై పోరాట కమిటీ నేతలు మండిపడుతున్నారు. ఆక్వా పార్క్‌ను తరలించే వరకు తమ దీక్ష చేస్తామంటూ పోరాట కమిటీ నేతలు ప్రకటించారు. పోలీసులు వాటర్ ట్యాంక్ మీదుకు వస్తే పైనుంచి దూకేస్తామని నేతలు హెచ్చరించారు. -
భీమారంలో బావ, మరదలు..
భీమారం : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ డివిజన్ భీమారంలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో బుధవార అర్ధరాత్రి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మరదలిని హత్య చేసి, బావ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి–అరుణ దంపతులకు కూతుళ్లు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డితోపాటు మరో కుమారుడు ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్‌కు చెందిన రావుల రవీందర్‌రెడ్డి–రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్‌రెడ్డి(30)తో ప్రతిభారెడ్డికి మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి రెండేళ్ల కూతురు ఉంది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భీమారంలో నివాసముంటున్నాడు. మరదలితో వివాహేతర సంబంధం.. ప్రతిభారెడ్డి సోదరి రక్షణారెడ్డి(23) చదువు నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం పొందింది. మూడేళ్లుగా అక్క ఇంట్లోనే ఉంటూ కళాశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో తన బావతో ఏర్పడిన సాన్నిహిత్యమే వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. అయితే విషయం బయటికి పొక్కడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని మందలిం చినట్లు తెలిసింది. దీంతో రక్షణారెడ్డిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.15 రోజులుగా రక్షణారెడ్డి ఇంటి నుంచి కాలేజీకి రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగకు ప్రతిభారెడ్డి తన తల్లిగారింటికి వెళ్లగా, ప్రవీణ్‌రెడ్డి ప్రస్తుతం హుజు రాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచే కళాశాలకు వెళ్తున్నాడు. భీమారం ఇంట్లో ఆత్మహత్య.. ఉదయం కళాశాలకని బయల్దేరిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రవీణ్‌రెడ్డికి ఫోన్ చేసినా నోరెస్పాన్స్ వచ్చింది. దీంతో అర్ధరాత్రి ప్రతిభారెడ్డి తన తండ్రి తిరుపతిరెడ్డి, సోదరుడితో కలిసి భీమారానికి బయల్దేరింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో కింది పోర్షన్లో వారిని నిద్ర లేపి తాళం చెవి ఇచ్చారా అని అడిగింది. వారు లేదనడంతో ఎలాగు రాత్రికి అక్కడే ఉండాలని భావించి రాయితో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్షణారెడ్డి మంచంపై విగతజీవురాలై కనిపించింది. పక్కనే సీలింగ్ ఫ్యాన్ పడి ఉంది. ప్రవీణ్‌రెడ్డి బెడ్రూమ్ వెనక తలుపు తెరిచి అదే బెడ్ పక్కన పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు సీఐ సతీష్‌బాబు, ఎస్సై భీమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడే విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు రోజుల క్రితమే సూసైడ్ నోట్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ప్రవీణ్‌రెడ్డి ఐదురోజుల క్రితమే సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడు. ఈ నోట్ పోలీసులకు చిక్కింది. తన భార్య మంచిదని అందులో పేర్కొన్నాడు. అత్తమామలు కూడా తనకు తల్లిదండ్రిలాంటి వారని రాశాడు. తన కూతురిని సాకే బాధ్యత తండ్రి తీసుకోవాలని పేర్కొన్నాడు. చెల్లిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు తన చెల్లిని చంపి, ప్రవీణ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ప్రతిభారెడ్డి రోదిస్తూ తెలిపింది. బతికి ఉంటే ఎక్కడ చంపుతారనే భయంతో నిద్రమాత్రలు మింగాడని పేర్కొంది. మృతుడి భార్య ప్రతిభారెడ్డి -
మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇంజక్షన్ సైకో కలకలం సృష్టిస్తున్నాడు. భీమవరంలో ముగ్గురు వ్యక్తులు బ్లాక్ పల్సర్ పై సంచరిస్తుండగా గ్రామస్తులు వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజక్షన్ సైకో అనే అనుమానంతో వీరిని గ్రామస్తులు వెంబడించి, ఇద్దరిని పట్టుకోగా, ఒకరు పరారైనట్లు సమాచారం. గ్రామస్తులు వెంబడిస్తున్న సమయంలో వారు పల్సర్ బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఓ అధికారి తెలిపారు. జిల్లాలోని పెంటపాడు మండలం కొండేపాడు గ్రామంలో అల్లూరి పాపారావు అనే వ్యక్తిపై గురువారం సిరంజీ సైకో దాడి చేసిన విషయం విదితమే. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆయన తొడపై సిరంజీతో గుచ్చి పారిపోయిన ఘటన మరువకముందే భీమవరం మండలంలో ఇంజక్షన్ సైకో సంచారం కలకలం సృష్టిస్తోంది.