
కలెక్టర్లకు నిత్య పరీక్షలు: సీఎం
కలెక్టర్లు నైపుణ్యం పెంచు కోవాలని, కలెక్టర్లతో పాటు శాఖాధిపతులు, మంత్రులకు అనునిత్యం పరీక్షలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
గురువారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ప్రజల సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యా లుగా తమ ప్రభుత్వం స్వల్ప, మధ్య, దీర్ఘకా లిక ప్రణాళికలతో ముందుకెళుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, ప్రజలకు అవినీతిలేని పాలన అందించాలనే ఉద్దేశంతోనే ‘ప్రజలే ముందు’ (పీపుల్ ఫస్ట్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. రాష్ట్ర విభజన రోజైన జూన్ రెండో తేదీన ఏటా నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. కరువును ఎదుర్కోవడంలో గత ఏడాది విఫలమయ్యామని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ ఏడాది అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.