కడప సిటీ, న్యూస్‌లైన్: కేంద్రప్రభుత్వం ప్రజలపై ఏదో విధంగా భారాలను మోపుతూ ఆర్థిక పరిస్థితులు సరిచేసుకుంటోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో పెట్రోలుపై రూ.12లు పెంచుతామని, ఇంతకు మించి పెంచమని భరోసాను అందించింది. రెండు నెలలకొకమారు పెట్రోల్ ధరను పెంచుతూ వచ్చింది. ఈ సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే పెట్రోల్ ధరను తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రస్తుతం జిల్లాలో సరాసరి రూ.81.93 వంతున లీటరు పెట్రోలును విక్రయిస్తున్నారు. కేంద్రం పెట్రోలుపై రూ.3.05పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధర స్థానిక పన్నులను తీసివేస్తే సుమారు రూ.78.49లుగా విక్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర సరాసరి రూ.56గా విక్రయిస్తున్నారు. 0.50పైసలును పెంచుతున్నట్లు ప్రకటించింది.
దీంతో లీటరు డీజిల్ ధర స్థానిక పన్నులతో కలుపుకొని సుమారు రూ.56.57 పైసలుగా విక్రయిస్తారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు లక్ష లీటర్ల పెట్రోల్ వినియోగంలో ఉంది. అలాగే ప్రతిరోజూ 2.50లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తగ్గించిన పెట్రోల్ ధర స్థానిక పన్నులను తీసివేస్తే లీటర్‌కు సుమారు రూ.3.44 వంతున తగ్గే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని వినియోగదారులకు నెలకు రూ.1,03,20,000 వంతున ప్రజలకు ఊరట కలగనుంది. అయితే పెరిగిన డీజిల్ ధరలతో రోజుకు సుమారు రూ.1,42,500లు ప్రజలపై అదనపు భారం పడనుంది.
పెట్రోల్ ధర తగ్గింపు
Published Tue, Oct 1 2013 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement