విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీస్ ప్రొవైడర్ల విచారణ కొనసాగుతోంది. విజయవాడ భవనీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం సిట్ బృందం ఎదుట ఒక సంస్థకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు అందుకున్న ఎయిర్టెల్ ప్రతినిధులు మాత్రమే విచారణకు హాజరు కాగా, మిగిలిన 11మంది సర్వీస్ ప్రొవైడర్లు హాజరు కాలేదు. కాగా తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఏపీ నేతలు ...ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పేరిట కౌంటర్ అటాక్కు దిగిన ఏపీ సర్కార్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సంక్షోభాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు న్యాయపరిధి హైదరాబాద్లో ఉండగా, ట్యాపింగ్ కేసు విచారణ విజయవాడలో ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిట్ ఎదుట హాజరైంది ఒక్క ప్రొవైడరే..
Published Mon, Jun 22 2015 1:58 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement