
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత్తిపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులైనా గవర్నర్ కొత్తప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ పిలవలేదని దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి పాలన లేదా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని పిటిషనర్ కోరారు. అత్యధిక మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో విఫలమైనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం, గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, పీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు.