
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16వ తేదీన జరగాల్సిన ప్రధాని పర్యటన 27వ తేదీకి వాయిదా పడినట్లు పీఎంవో గురువారం ఓ ప్రకటన చేసింది. కాగా ఈ నేపథ్యంలో ప్రధాని సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం కేటాయించాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఇదే అంశంపై ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment