ఓబుల్ రెడ్డి తండాలో తనిఖీలు
Published Thu, Jan 14 2016 12:49 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుల్ రెడ్డి తండాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గురువారం స్ధానిక సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సుమారు 2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. మరో 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement