సగటున మూడో రోజులకో దారుణహత్య... పట్టపగలు వణుకు పుట్టిస్తున్న బ్యాంకు దోపిడీలు... వరుసగా భారీ చోరీలు... ఘోరాలు... కరీంనగర్‌లో కల్లోలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరసామ్రాజ్యం విస్తరిస్తున్నతీరు కలవరపెడుతోంది. జిల్లా పోలీసు విభాగానికి సవాలు విసురుతోంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 18 మంది కిరాతకంగా హత్యకు గురయ్యారు. గడిచిన మూడు నెలల్లోనే మూడు చోట్ల బ్యాంకు చోరీలు, ఒక దారి దోపిడీ హడలెత్తించింది. ఇదేమీ పట్టనట్లుగా పోలీసు యంత్రాంగం నేలవిడిచి సాము చేస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించే ప్రాథమిక కర్తవ్యాన్ని మరిచినట్లు సాదాసీదాగా ప్రవర్తిస్తోంది. మరోవైపు అనుచిత ప్రవర్తనతో తరచుగా విమర్శల పాలవుతోంది. ఇటీవల కోరుట్ల ఠాణాలో లాకప్‌డెత్‌ను తలపించిన నిందితు డు చంద్రయ్య ఆత్మహత్య... విద్యార్థి జేఏసీ నేత శ్రీరామ్‌పై కమాన్‌పూర్‌లో విచక్షణరహితంగా ప్రవర్తించిన తీరు పోలీసుల పరువును బజారుకీడ్చింది.
చిన్నాచితక సంఘటనలకు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ల బ్రహ్మాస్త్రం ప్రయోగిం చే ఉన్నతాధికారులు ఆ రెండు కేసుల్లోనూ అ డ్డంగా ఇరుక్కున్నారు. అసలైన బాధ్యులను వెనుకేసుకొచ్చిన అపప్రథను నెత్తినేసుకున్నా రు. రాష్ట్రస్థాయిలో అందరినీ ఆకర్షించేందుకు అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు వనం వీడి జనంలోకి రావాలని చేపట్టిన ఁఅంతర్మథనంరూ. ఆరంభశూరత్వంగా బీర్‌పూర్‌లోనే ఆగిపోయింది. వరుసగా పెరిగిపోతున్న క్రైంరేటును కట్టడి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కసరత్తు చేయకపోవటం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న జిల్లాల్లో కరీంనగర్ రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. మరోవైపు దారుణహత్యలు జరుగుతున్న తీరు భయోతాత్పం కలిగిస్తోంది. హుజూరాబాద్‌లో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి టోనీ హత్య, ఇటీవల చిగురుమామిడిలో చిన్నారి లయశ్రీని బలిగొనటం, సారంగపూర్ మండలంలో చెర్లపల్లి, ఇటీవల మహాముత్తారం మండలంలో జరిగిన జంటహత్యలు, గోదావరిఖనిలో వీక్లీ మార్కెట్‌లో యువకుడు చక్రధర్‌ను కిరాతకంగా హతమార్చటం, వీణవంక మండలం నర్సింగపూర్‌లో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాలరాజు హత్య, అదే మండలం అయిలాబాద్‌లో తోట చంద్రయ్యను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి పొడిచి చంపిన ఘటనలన్నీ వరుసగా కలకలం రేకెత్తించాయి.
కుటుంబకలహాలు, వివాహేతర సంబంధాలు, భూతగాదాలతో పాటు రాజకీయ కక్షలు ఈ హత్యలకు పురిగొల్పాయి. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే ఈ నేరాలు.. ఘోరాలు మరింతగా జడలు విచ్చుకునే ప్రమాదముంది.
ఖాకీలకు సవాల్
Published Wed, Feb 5 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement