district police
-
నందిగం సురేష్‌కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్‌ల బదిలీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ)మరికొందరు అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా అస్సాం, పంజాబ్‌ల్లోని జిల్లా పోలీసు చీఫ్‌లను బదిలీ చేసింది. పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లలో పనిచేసే అయిదుగురు నాన్ కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు(డీఎంలు), 8 మంది పోలీస్ సూపరింటెండెంట్ల(ఎస్పీలు)ను సైతం బదిలీ చేసింది. జిల్లా స్థాయిలో ప్రధానమైన పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు కాని నాన్–క్యాడర్ అధికారులను నియమించడంపై ఈసీ కఠినమైన వైఖరిని తీసుకుంది. -
నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ
ఉట్నూర్(ఖానాపూర్): పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజా వ్యవస్థ నిర్మాణంగా మారినప్పుడే సత్ఫలితాలు వస్తాయని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతీ పోలీసు ముందుకు సాగాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా అదివారం నార్త్ జోన్ డీఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్‌లతో కలిసి ఆయన ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో పర్యటించారు. అనంతరం నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజలకు దగ్గర అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతి పోలీసులు ముందుకు సాగాలన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండేట్లు విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే తరహాలో సిబ్బంది పని తీరు ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఉట్నూర్ ఏజెన్సీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో పోలీసుల తీరు అభినందనీయమన్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, నిర్మల్, కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీలు దక్షిణమూర్తి, గోద్రు, డీఎస్పీలు వెంకటేశ్, నర్సింహారెడ్డి, రాములు, సాంబయ్య, సత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో పోలీసు యాక్టు అమలు
సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంగళవారం నుంచి నెల రోజుల పాటు 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలు, సభలు, నిరాహార దీక్షలు చేపట్టరాదన్నారు. -
అన్ని దారులూ జిల్లావైపే..!
జిల్లాలోని గోదారి తీరం పులకించింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు కరీంనగర్వైపే వస్తున్నారు. దీంతో ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని పుష్కర ఘాట్లు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. నాలుగు రోజుల రికార్డులను మించిన సంఖ్యలో శుక్రవారం ఆయా ఘాట్లలో భక్తులు స్నానమాచరించారు. దాదాపు 12 లక్షల మందికిగా పైగా జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శించినట్లు అధికారుల అంచనా. - సాక్షి, ప్రతినిధి కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలు శుక్రవా రం జనసంద్రమయ్యాయి. ఒక్క ధర్మపురిలోనే 5.10 లక్షలమందికిపైగా స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 4.10 లక్షల మంది పుణ్యస్నానమాచరించారు. కోటిలింగాల, మంథనిలోనూ జనం పోటెత్తారు. కోటిలిం గాలలో లక్షమందికిపైగా పుణ్యస్నానమాచరించగా, మంథనిలోనూ సా యంత్రం 85 వేల మందికిపైగా పుష్కర స్నానం చేశారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో జిల్లాలోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయని జిల్లా పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరంలో ట్రాఫికర్... పుష్కరాల ప్రారంభంలో రెండు రోజుల పాటు భక్తు ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మూడవ రోజు రద్దీ తగ్గింది. కానీ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తరువాత రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం నుంచి ప్రధాన ఘాట్ వరకు వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఒకే రహదారి వెంట ఘాట్ వద్దకు వెళ్లే ఆటోలు, కాలినడకన భక్తు లు వెళ్లడంతో కొంత తోపులాట పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆటోల రాకపోకలను నియంత్రించి మరో రహదారి గుండా పంపివేయడంతో స్వల్పంగా ట్రాఫిక్ సద్దుమణిగింది. ధర్మపురి... జనపురి పుష్కర భక్తులతో ధర్మపురి జనపురిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 5.10 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్‌లు వేర్వేరుగా పుష్కర ఘాట్లను కలియదిరిగి భక్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. భక్తులు ఉదయం 10 గంటల సమయంలో ఎక్కువ సంఖ్యలో రావడంతో రాయపట్నం నుంచి వచ్చే తోవలో ఉన్న వాహనాల పార్కింగ్ సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. అదనంగా పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు అదికారులు చర్యలు చేపట్టారు. భక్తులు సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ధర్మపురి గోదావరి పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తులు గోదావరి ప్రవాహం కోసం దూరంగా వెళ్లి పుష్కర స్నానాలు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా... గోదావరిఖని పుష్కరఘాట్ వద్ద శుక్రవారం 20 వేల మంది, గోలివాడ పుష్కరఘాట్ వద్ద 4వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శుక్రవారం 36 డిగ్రీ ల ఉష్ణోగ్రత రామగుండం ప్రాంతంలో నమోదు కాగా, ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. పుష్కరఘాట్ వద్ద పిండ ప్రదానాలు చేసేం దుకు బ్రాహ్మణులకు, భక్తులకు టెంట్లు వేయకపోవడంతో వారు ఎండతీవ్రతతో ఇబ్బందులు పడ్డారు. కోటిలింగాలలో లక్ష స్నానాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పుష్కలంగా ఉన్న కోటిలింగాలలో శుక్రవారం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఏకంగా లక్షమందికిపైగా పుష్కర స్నానమాచరించారు. దీంతో కోటిలింగాల ప్రాంతమంతా భక్తు ల తాకిడితో కిక్కిరిపోయింది. జిల్లాలోని మిగిలిన పుష్కర ఘాట్లలోనూ గత మూడురోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగింది. ఆయా ఘాట్లన్నింటిలో కలిపి సుమారు లక్షల మంది పుణ్య స్నానాలు చేసి పులకించిపోయారు. పుష్కరాల్లో పలువురు వీఐపీలు కాళేశ్వరంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఐజీ ఎన్కే.సింగ్, మెదక్ జిల్లా తొగుట మహానంద సరస్వతి స్వామిజీ, హంపీ ఉపపీఠాధిపతి గోవిందానందస్వామి, జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, హైకోర్టు రిజిస్ట్రార్ విద్యాధర్భట్, సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్య పుష్కరస్నానం చేశారు. మంథనిలో హైకోర్టు మాజీ జడ్జీ పీఎల్ఎన్.శర్మతో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మపురిలో తొలి తెలంగాణ మహిళా పైలట్ స్వాతీరావు, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాల్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, దర్శకుడు హరిశంకర్‌లు పుష్కర స్నానాలకు హాజరయ్యారు. గోదావరిఖని సమీపంలోని సుందిల్ల పుష్కరఘాట్ వద్ద సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్, డెరైక్టర్ ఎ.మనోహర్‌రావు, జనగామ గ్రామ శివారు గోదావరి నది వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగమారుతిశర్మ పుష్కర స్నానాలు చేశారు. -
జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్
- చైనా దేశీయుడి అరెస్టుతో కీలక విషయాలు - పోలీసుల నుంచి తప్పించుకున్న ఐదుగురు - దుంగల కోసం వెతుకుతున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన కే.శ్రీనివాసరాజును అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులు మాత్రమే పట్టుబడ్డారు. మరో ఐదుగురు పారిపోయారు. వీరి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఇలా పట్టుకున్నారు.. ఈనెల 5న పూతలపట్టు సమీపంలో ఇద్దరు అనుమానితులు రెండు ఎర్రచందనం దుంగలను ద్విచక్ర వాహనంలో తీసుకెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రావారిపాళెం మండలం పులిబోనుపల్లెకు చెందిన కే.చంద్రశేఖర్‌రెడ్డి(30), చింతగుంటకు చెందిన కే. చంద్ర(35)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హైదరాబాదులో ఓ ముఠా చైనాకు చెందిన వ్యక్తికి ఎర్రచందనం అమ్మడానికి ప్రయత్నిస్తోందని పోలీసులకు వీరు సమాచారం ఇచ్చారు. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ మహేష్‌తో ఉన్న ఓ బృందం హైదరాబాదుకు వెళ్లింది. గురువారం రాత్రి 1.30 గంట ప్రాంతంలో హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపై స్మగ్లర్ల ముఠా మాట్లాడుకుంటుండగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. వీరిలో చైనాకు చెందిన యంగ్‌పెంగ్, రాయచోటికి చెందిన శ్రీనివాసరాజు దొరికారు. శ్రీనివాసరాజుపై ఇప్పటికే బీ.కొత్తకోట పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. చైనా దేశీయుడి వద్ద ఉన్న ఆపిల్ ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో మన దేశ స్మగ్లర్లు ఇంగ్లిషులో టైపు చేస్తే చైనీయుడికి చైనీస్ భాషలో అనుకరణ చేస్తుంది. తమ వద్ద ఉన్న పెద్ద మొత్తంలోని ఎర్రచందనం దుంగలను విక్రయిస్తామని చైనీయుడితో ఒప్పందం కుదుర్చుకుంటుండగా పోలీసులు దాడులు చేశారు. మరికొందరి కోసం వేట.. హైదరాబాదులో పోలీసుల నుంచి తప్పించుకున్న వారిలో కడపకు చెందిన కిషోర్‌కుమార్‌రెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి అలియాస్ సుదర్శన్‌రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన దాసరి సూరిబాబు, కడపకు చెందిన అల్లూరి వెంటకరమణ, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన శ్రీనివాసులు, మైసూర్‌కు చెందిన మహ్మద్ ముంజామిల్ అనే స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైనా దేశీయుడికి తమ వద్ద ఉన్న ఎర్రచందనం దుంగల ఫొటోలు, వీడియోలను వాట్సప్, మెయిల్ ద్వారా చూపించి అతన్ని భారత్‌కు రప్పించడంలో వీళ్లంతా ప్రధాన పాత్ర పోషించారు. నిందితులతో పాటు జిల్లాలో రహస్య ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం దుంగల డంప్ కోసం సైతం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
జిల్లా పోలీసుల పనితీరు భేష్
అభినందించిన డీఐజీ మల్లారెడ్డి ఖమ్మంక్రైం : ఎస్పీ షానవాజ్ ఖాసిం పర్యవేక్షణలో జిల్లా పోలీసు సిబ్బంది పనితీరు భేష్‌గా ఉందని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులో ఉన్నాయన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ పనితీరు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. నేరాల నియంత్రణకు నగరంలో మరికొంత మందితో బ్లూకోర్ట్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్పీ షానవాజ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మొదట పోలీస్ అతిథి గృహం చేరుకున్న డీఐజీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ఫైళ్లు పరిశీలించారు. వాచర్ కౌంటర్లోని రిజిష్టర్‌ను ప్రత్యేకంగా చూశారు. సీఐ రమణమూర్తి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డీఐజీ వెంట ఎస్పీ షానవాజ్ ఖాసిం, అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ దక్షిణమూర్తి, సీఐ రమణమూర్తి, ఎస్సైలు కరుణాకర్, భాను ప్రకాష్, పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకున్నోడే దొర!
జిల్లాలో బ్యాంకు చోరీలు.. దారి దోపిడీ కేసులను ఛేదించడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. వరుస సంఘటనల్లో లక్షలాది రూపాయలు.. కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనా.. ఇప్పటికీ ఏ ఒక్క నిందితుడినీ గుర్తించలేకపోయారు. ఇక్కడ చోరీ చేసిన వారు ఇతర జిల్లాల పోలీసులకు చిక్కడం.. మన పోలీసుల సమర్థతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఫలితంగా ‘దోచుకున్నోడే.. దొర’ అనే చందం గా మారింది. అసలు ఎందుకిలా జరుగుతోంది.. మన పోలీసుల్లో సత్తా లేదా..? అని సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్న. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి * పురోగతి లేని బ్యాంకు చోరీ కేసులు * ఒక్కరినీ పట్టుకోలేకపోయిన జిల్లా పోలీసులు * డిపార్ట్మెంట్ పనితీరుపై ప్రజల్లో అనుమానం వరంగల్ జిల్లా భూపాల్పల్లి గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన దోపిడీని అక్కడి పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. కరీంనగర్ జిల్లా కాటారంలో దొంగను పట్టుకుని కోర్టు బోనులో నిలబెట్టారు. చోరీకి గురైన సొత్తును బ్యాంకుకు అప్పగించారు. మరి మన జిల్లా పోలీసులకు ఏమైంది..? దొంగలు తెగబడి బ్యాంకు దోపిడీలు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్..గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఇలా ఒక్కొక్కటి లూటీ చేశారు. తాజాగా ఝరాసంగం సిండికేట్ బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. అయినా మన పోలీసుల్లో చలనం లేదు. నెలలు గడుస్తున్నా దొంగల ఆచూకీ దొరకటం లేదు. ఎందుకీ నిర్లిప్తత? వరంగల్ పోలీసులకున్న సత్తా మన వాళ్లలో లేదా? నేర పరిశోధనలో మన పోలీసులకు అంత సీన్ లేదా..? లేకుంటే జిల్లా పోలీసు బాసే.. ఇప్పుడో.. రేపో అన్నట్టు ఉండగా..! నాలుగు కాసులు వెనకేసుకోక ఈ కేసుల గొడవలు ఎందుకు అనుకుంటున్నారా? అనేది సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఒక్క బ్యాంకులే కాదు, ఇళ్ల మీద పడి దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో... 2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. రూ.13.45 లక్షల నగదుతో పాటు సుమారు 7 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది. అయితే దుండగులను పట్టుకోవడంలో మన పోలీసులు చేతులెత్తేశారు. అదే దొంగలు హైదరాబాద్‌లో దొంగతనం చేస్తూ దొరికిపోయి అక్కడి పోలీసుల విచారణలో తామే ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. * సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫీ జ్యూవెలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. వీరు ఇంకా దొరకలేదు. * 2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరీకి పాల్పడి రూ.3.75 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో ఎస్ఐ వెంకటేష్ గాయపడ్డాడు. * వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలోని కెనరా బ్యాంకు దోపిడీ జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్తుల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దొంగలు 5కిలోల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకె ళ్లినా ఆ బ్యాంకు లూటీ అయ్యిందనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. దొంగలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాంకులో నగదు, నగలు దాచుకున్న వారి ఆందోళనకు గురవుతున్నారు. * శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలో అద్దె భవనంలో బ్యాంకు కొనసాగుతోంది. దొంగలు లోపలికి చొరబడి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు. అల్లాదుర్గం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో నవంబర్ 3న దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకులో చొరబడి సీసీ కెమెరాను ఎత్తుకుపోయారు. కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేశారు. దొంగలకు లాకర్ తెరుచుకోకపోవడంతో నగలు, నగదు చోరీ కాకున్నా.. బ్యాంకులోని వస్తువులు ధ్వంసం కావడంతో ఆస్తి నష్టం జరిగింది. పొలీసులు కేసు నమోదు చేసినా దొంగలను పట్టుకోలేదు. సీసీ కెమెరాలోని దొంగ ఫొటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణను మాత్రం ముమ్మరం చేయలేదనే ఆరోపణలున్నాయి. -
జీ హుజూర్
* తెలుగుతమ్ముళ్లు ఏది చెప్పినా.. ఏమి చేసినా ఓకే అంటున్న అధికారులు * ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు * అధికారులను దూషిస్తున్నా కనిపించని సంఘీభావం సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పోలీసులు, అధికారులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారు. వారు ఏమి చేసినా జీ హుజూర్ అంటున్నారు. చౌక దుకాణాల డీలర్‌షిప్‌లు రద్దు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు. సబ్స్టేషన్లలో అర్హతతో నిమిత్తం లేకుండా ఆపరేటర్ల ఎంపిక. ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా... ఇవన్నీ జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు. వీటన్నింటికీ ఏకైక అర్హత అధికార పార్టీ. అక్రమార్జనకు అధికారపార్టీ నేత అయితేనే అర్హతగా యంత్రాంగం భావిస్తోంది. అందు కు అనుగుణంగా యంత్రాం గాన్ని తెలుగు తమ్ముళ్లు మలుచుకుంటున్నారు. కాదు.. కూడదంటే బెదిరింపులు, దూషణలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే పాలకులు. వారి నేతృత్వంలోనే చట్టాలు, శాసనాలు చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా యంత్రాంగం మసలుకోవాలి. జిల్లాలోని ప్రజలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇరువురు ఎంపీలను ఆ పార్టీకి అప్పగించారు. ప్రజలు తిరస్కరించినా అధికార పార్టీ తమదేనన్న ఏకైక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు అనువుగా యంత్రాంగాన్ని మలుచుకోవడంలో బిజీగా గడుపుతున్నారు. బహిరంగంగానే ఆదేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. కొంతమంది నేతలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో అందుకు అనుగుణంగా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఓ ఉన్నతస్థాయి అధికారి బహిరంగంగానే అధికారపార్టీ నేతల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర ప్రజాప్రతినిధులతో నిమిత్తం లేకుండా అధికారపార్టీ నేతలు చెప్పిందే వినాలని.. వారిని మెప్పించాలనే తత్వాన్ని కింది స్థాయి యంత్రాంగం వంటబట్టించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 125 రేషన్‌షాపుల డీలర్‌షిప్‌లు రద్దు అయ్యాయి. సబ్స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్గంలో కొల్లగొట్టేందుకు అస్కారం ఏర్పడుతోంది. వీటిని నియంత్రించాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
పోలీస్ అలర్ట్
మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన ► జిల్లా పోలీసులుగుంటూరులోని బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ►అదే సందర్భంగా గుంటూరులో తుపాకీ కలకలంతో ఉలికిపాటు ►నల్లమలలోనూ కొనసాగుతున్న కూంబింగ్ సాక్షి, గుంటూరు: జిల్లా పోలీసులు ఆదివారం రాత్రినుంచి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ.. మావోయిస్ట్ కదలికలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగరంలోనైతే బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు హడలిపోయారు. అసలు పోలీసులు ఇంత హడావుడి ఎందుకు చేశారంటే ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతుండటమే. దీనిపై ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరంతా అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ వదలి వెళ్ళడంతో ఇదేమైనా మావోయిస్ట్‌ల పనా.. అనే దానిపైనా పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఉపాకీ గురించి వివరాలు అడగడంతో అర్బన్ ఓఎస్డీ జగన్నాథ్‌రెడ్డి హుటాహుటిన అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తుపాకీని పరిశీలించి, అది ఎయిర్‌గన్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఎన్కౌంటర్ కూడా కారణమే... జిల్లాలో మావోయిస్ట్ కదలికలు లేవని చెబుతూనే గత నెలలో నల్లమల అటవీ ప్రాంతంలోని గుంటూరు- ప్రకాశం బోర్డర్లో గుంటూరు ఏఎన్ఎస్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్ట్ ముఖ్య నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్ట్ జిల్లాకమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో మావోయిస్ట్ విక్రమ్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు నల్లమలను జల్లెడపడుతున్నప్పటికీ ఇంత వరకూ విక్రమ్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీనికితోడు జాన్ బాబూరావు రిక్రూమెంట్ చేసేందుకే బయటకు వచ్చాడని తేలడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆగస్టు మూడు వరకూ వారోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మండల కేంద్రాల్లో పోలీసులు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బంధీ నిర్వహించారు. గ్రామాల్లో మావోయిస్ట్ సానుభూతిపరులుగా అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచారు. గుంటూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో ఫ్లాట్పామ్లు, పార్శిల్ కార్యాలయం, వ్యాపార సముదాయాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. -
అంతర్రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు
- పీడీ యాక్టు ప్రయోగం - రాజమండ్రికి తరలింపు కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేసి వారి ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించింది. అదనపు ఎస్పీ ఆపరేషన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియాస్ నందలూరు బాషా ను పీడీ యాక్టు కింద సోమవారం నందలూరు శివార్లలోని ఆల్విన్ కర్మాగారం వద్ద అరెస్టు చే శారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఆపరేషన్స్ వెంకటరమణ మాట్లాడుతూ కలెక్టర్ కోన శశిధర్ ఇచ్చిన డిటెన్షన్ ఆదేశాల ద్వారా ఖాదర్‌వలీని రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలిస్తున్నామన్నారు. ఖా దర్‌వలీ స్వగ్రామం నందలూరు అన్నారు. ఇతను తన సహచరులతో కలిసి రాజం పేట, కోడూరు, బద్వేలు పరిసర ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్టులోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి వాహనాల ద్వారా తరలించేవాడన్నారు. జిల్లా కర్నాటక రాష్ట్రంలోని కాడేగానహల్లికిచెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ షబ్బీ ర్, మరి కొందరికీ ఎర్రచందనం దుంగలను విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించేవాడన్నారు. పరిసర గ్రామాల్లోని యు వతను కూడా స్మగ్లింగ్‌వైపు తిప్పుకొని ము ఠా ఏర్పరచుకున్నారన్నారు. ఖాదర్‌వలీ గ తంలో మూడు పర్యాయాలు అరెస్టు కాబడి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోలేదన్నారు. ప్రత్యేక బృందానికి ప్రశంసలు ఎర్రచందనాన్ని జిల్లా నుంచి కర్నాటక రాష్ట్రం కాటెగానహల్లికి అక్రమ రవాణా చేస్తూ కేసుల్లో నిందితుడిగా ఉండి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియాస్ నందలూరు బాషను అరెస్టు చేసిన ప్రత్యేక బృందం రాజంపేట డిఎస్పీ జివి రమణ, ఒంటిమిట్ట సీఐ రెడ్డప్ప, నందలూరు ఎస్ఐ కృష్ణయ్యతోపాటు సిబ్బందిని అదనపు ఎస్పీ ఆపరేషన్స్ ఎ.వెంకటరమణ అభినందించారు. రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫారసు చేస్తామని తెలిపారు. -
నిఘా నీడలో సార్వత్రిక ఎన్నికలు
కర్నూలు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను ప్రశాం తంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. రాయలసీమ ఐజీ నవీన్‌చంద్ రెండు రోజులుగా కర్నూలులోనే తిష్ట వేసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే జల్లాకు 16 కంపెనీల కేంద్ర బలగాలను రప్పించారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంకు చెందిన మూడు కంపెనీల సిబ్బంది సేవలను ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్మ్డ్ రిజర్వు సిబ్బందితో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా బందోబస్తు విధులకు వచ్చారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు పాణ్యం, కోడుమూరు, బనగానపల్లె నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. రాజకీయ వైరుధ్యం ఉన్న 200 గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఏసీబీ జాయింట్ డెరైక్టర్ శ్రీకాంత్ గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ఈయనను జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమిం చారు. సోమవారం రాత్రి ఆయన కర్నూలుకు చేరుకున్నారు. అలాగే ఎన్నికల విధులకు ఆరుగురు ట్రైనీ ఐపీఎస్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు ఎన్నికల విధులకు నియమించారు. సోమవారం జిల్లా పోలీసు మైదానం నుంచి కేంద్ర బలగాలతో పాటు మిగిలిన సిబ్బంది బందోబస్తుకు బస్సుల్లో తరలివెళ్లారు. -
ఖాకీలకు సవాల్
సగటున మూడో రోజులకో దారుణహత్య... పట్టపగలు వణుకు పుట్టిస్తున్న బ్యాంకు దోపిడీలు... వరుసగా భారీ చోరీలు... ఘోరాలు... కరీంనగర్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరసామ్రాజ్యం విస్తరిస్తున్నతీరు కలవరపెడుతోంది. జిల్లా పోలీసు విభాగానికి సవాలు విసురుతోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 18 మంది కిరాతకంగా హత్యకు గురయ్యారు. గడిచిన మూడు నెలల్లోనే మూడు చోట్ల బ్యాంకు చోరీలు, ఒక దారి దోపిడీ హడలెత్తించింది. ఇదేమీ పట్టనట్లుగా పోలీసు యంత్రాంగం నేలవిడిచి సాము చేస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించే ప్రాథమిక కర్తవ్యాన్ని మరిచినట్లు సాదాసీదాగా ప్రవర్తిస్తోంది. మరోవైపు అనుచిత ప్రవర్తనతో తరచుగా విమర్శల పాలవుతోంది. ఇటీవల కోరుట్ల ఠాణాలో లాకప్‌డెత్‌ను తలపించిన నిందితు డు చంద్రయ్య ఆత్మహత్య... విద్యార్థి జేఏసీ నేత శ్రీరామ్‌పై కమాన్‌పూర్‌లో విచక్షణరహితంగా ప్రవర్తించిన తీరు పోలీసుల పరువును బజారుకీడ్చింది. చిన్నాచితక సంఘటనలకు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ల బ్రహ్మాస్త్రం ప్రయోగిం చే ఉన్నతాధికారులు ఆ రెండు కేసుల్లోనూ అ డ్డంగా ఇరుక్కున్నారు. అసలైన బాధ్యులను వెనుకేసుకొచ్చిన అపప్రథను నెత్తినేసుకున్నా రు. రాష్ట్రస్థాయిలో అందరినీ ఆకర్షించేందుకు అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు వనం వీడి జనంలోకి రావాలని చేపట్టిన ఁఅంతర్మథనంరూ. ఆరంభశూరత్వంగా బీర్‌పూర్‌లోనే ఆగిపోయింది. వరుసగా పెరిగిపోతున్న క్రైంరేటును కట్టడి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కసరత్తు చేయకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న జిల్లాల్లో కరీంనగర్ రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. మరోవైపు దారుణహత్యలు జరుగుతున్న తీరు భయోతాత్పం కలిగిస్తోంది. హుజూరాబాద్‌లో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి టోనీ హత్య, ఇటీవల చిగురుమామిడిలో చిన్నారి లయశ్రీని బలిగొనటం, సారంగపూర్ మండలంలో చెర్లపల్లి, ఇటీవల మహాముత్తారం మండలంలో జరిగిన జంటహత్యలు, గోదావరిఖనిలో వీక్లీ మార్కెట్లో యువకుడు చక్రధర్‌ను కిరాతకంగా హతమార్చటం, వీణవంక మండలం నర్సింగపూర్‌లో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాలరాజు హత్య, అదే మండలం అయిలాబాద్‌లో తోట చంద్రయ్యను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి పొడిచి చంపిన ఘటనలన్నీ వరుసగా కలకలం రేకెత్తించాయి. కుటుంబకలహాలు, వివాహేతర సంబంధాలు, భూతగాదాలతో పాటు రాజకీయ కక్షలు ఈ హత్యలకు పురిగొల్పాయి. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే ఈ నేరాలు.. ఘోరాలు మరింతగా జడలు విచ్చుకునే ప్రమాదముంది.