కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యథావిధిగా సోమవారం కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి పాదయాత్రకు బయల్దేరగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
పాదయాత్రను అడ్డుకునే కంటే తనను జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు చట్టాన్ని, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ముద్రగడను సోమవారం ఆయన స్వగృహంలో బొత్స కలుసుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.