'ఎన్నిసార్లు అడ్డుకున్నాపాదయాత్ర విరమించను'
Published Tue, Aug 8 2017 12:06 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
కాకినాడ: కిర్లంపూడిలోని తన నివాసం నుండి కాపు నేతలతో మంగళవారం ఉదయం పాదయాత్ర కోసం బయలుదేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు మళ్ళీ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నిసార్లు తనని అడ్డుకున్నా తాను మాత్రం పాదయాత్రను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు గౌరవం పాడవుతుందని తాము బాధపడుతున్నామని, అందువల్ల తామేమి మాట్లాడలేకపోతున్నామని ముద్రగడ అన్నారు. సర్కారు తీరుకు నిరసనగా చేతులకు నల్ల రిబ్బన్లతో బేడీలు వేసుకుని కాపు నేతలు ముద్రగడ నివాసం వద్ద ప్రదర్శన చేశారు.
Advertisement
Advertisement