రాజమండ్రి :విపక్ష వైఎస్సార్ సీపీ నేతలను అణ చివేయాలనే లక్ష్యంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు చెలరేగిపోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడమే నేరంగా కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడి చేశారని ఒకసారి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మరోసారి కుంటిసాకులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన వారు సంఘ విద్రోహశక్తులన్నట్టు, తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రజల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నవారిని అరాచకవాదులన్నట్టు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఉద్యమించిన 26 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనారుుంచిన అర్బన్ జిల్లా పోలీసులు తాజాగా మరో పదిమందిపై కేసు నమోదు చేశారు. ఈసారి ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్నిలతోపాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. గతంలో పోలీసుల మీద దాడి చేశారని కేసు పెట్టిన ఆర్బన్ పోలీసులు ఈసారి కండిషనల్ బెయిల్‌పై విడుదలైన రాజాతోపాటు ఇతర నాయకులు ఈ నెల 7న కంబాలచెరువు వద్ద బహిరంగ సభలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఏఎస్పీ స్థాయి అధికారిని ఎమ్మెల్యే చెవిరెడ్డి, విజయలక్ష్మి బహిరంగంగా బెదిరించారని ఆరు సెక్షన్లతో కేసులు నమోదు చేయడం గమనార్హం.
ప్రశ్నిస్తే నాన్ బెరుులబుల్ కేసు
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజమండ్రిలో గత నెల 29న ఉద్యమించిన వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ర్యాలీ చేస్తున్న పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్, ఆదిరెడ్డి వాసులను ప్రకాశ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో పెట్టారు. ప్రశ్నించేందుకు వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం నాయకుడు గణేష్‌లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం, సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడరు మేడపాటి షర్మిలారెడ్డిలను అరెస్టు చేసి గోకవరం తరలించిన విషయం తెలిసిందే. తొలుత ఏడుగురు, తరువాత 15 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తరువాత సంఖ్యను 26కు పెంచారు. రిమాండ్‌లో ఉన్న రాజా తదితరులు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాజాతో పాటు పార్టీ నాయకులపై కేసులు పెట్టడం ద్వారా పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు.
పోలీసుల లక్ష్యం మా కుటుంబమే : జక్కంపూడి
టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్న ప్రతిసారీ మా కుటుంబమే లక్ష్యంగా పోలీసులు అక్రమంగా కేసులు బనారుుంచి, జైలులో పెడుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నా భర్త, మాజీమంత్రి జక్కం పూడి రామ్మోహనరావుపై కక్షసాధింపునకు దిగి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళుతుండగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. బొమ్మూరులో ఒక మహిళపై అన్యాయంగా కేసు పెట్టినప్పుడు అడిగేందుకు వెళితే ఇలానే కేసులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చి నాతోపాటు మా ఇద్దరు కుమారుల మీద కూడా కేసులు పెట్టారు. అయినా భయపడేది లేదు. ఇవన్నీ ఊహించే న్యాయ పోరాటం చేసేందుకు న్యాయవాదిగా కోర్టుమెట్లు ఎక్కాను. నాకు అండగా పార్టీ అధినేత జగన్, జిల్లా క్యాడర్ ఉన్నారు.
- జక్కంపూడి విజయలక్ష్మి
రాజమండ్రిలో పోలీసు రాజ్యం
Published Fri, Sep 11 2015 1:31 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement