Urban police
-
టీడీపీ నేతల్లో వణుకు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన టీడీపీ దాడిని తిరుపతి అర్బన్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనలో పాల్గొ న్న టీడీపీ ముఖ్య నాయకుల్ని విడతల వారీగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. దీంతో నగర టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు కలవరానికి లోనవుతున్నారు. కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే 15 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. ఘటనలో పాల్గొన్న 40 మంది టీడీపీ నాయకులు, వార్డు స్థాయి నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని వ్యక్తిగతంగా విచారణ జరుపుతున్నారు సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి క్రైం : తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చిన అమిత్ షా ఈ నెల 11న ఉదయం దర్శనం పూర్తిచేసుకుని కొండ దిగుతుండగా అలిపిరి దగ్గర కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపారు. కాన్వాయ్‌లో ఉన్న బీజేపీ నేత కోలా ఆనంద్ కారు అద్దాలను పగులగొట్టి ఉద్రిక్తత సృష్టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి చేయ డం జాతీయ స్థాయిలో సంచలనమైంది. మరుసటి రోజు ప్రధాన పత్రికలన్నీ దాడి జరిగిన తీరును, బీజేపీ నేతల ఖండనలనూ ప్రముఖంగా ప్రచురించాయి. కేంద్ర ఇంటెలిజెన్సు ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై తిరుపతి అర్బన్ పోలీసుల్ని నివేదిక కోరారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుని కాన్వాయ్‌పై దాడి జరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఏపీ పోలీస్ బాస్‌లు ప్రశ్నించారు. దీంతో తిరుపతి అర్బన్ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అదే రోజున కాన్వాయ్ పై కర్రతో దాడికి పాల్పడిన సుబ్రమణ్యయాదవ్ అనే టీడీపీ నాయకుడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అతనిపై కేసు నమోదు చేశారు. తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో అలిపిరి సీఐ చంద్రశేఖర్ నాయకుల విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా.... సంఘటన జరిగిన 11వ తేదీ అలిపిరి నిరసనలో పాల్గొన్న టీ డీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో టీటీడీ అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలు, మీడియా ప్రచురించిన ఫోటోలు, టీవీ ఛానళ్ల వీడియోలలో కనిపించిన నగర పార్టీ నేతల పేర్లను నమోదు చేసుకుని విడతల వారీగా స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌నాయుడు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, ఎమ్మెల్యే అల్లుడు సంజయ్‌లను ప్రధాన నాయకులుగా గుర్తించారు. వీరి నేతృత్వంలోనే పార్టీ కార్యకర్తలు ఆ రోజున నిరసనకు హాజరైనట్లు పోలీసులు సమాచారం తెప్పించుకున్నారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు దాడి జరిపేందుకు కర్రలు, రాళ్లు వాడారా లేదానన్న అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి సమీక్షిస్తున్నారు. బాధ్యులపై కేసులు ఖాయం అమిత్ షా కాన్వాయ్‌లో వెనుక ఉన్న వాహనంపై కర్రతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యాన్ని ఆ రోజే అరెస్టు చేశాం. దాడికి దారితీసిన పరిస్థితులు, ఎవరెవరి పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే చాలా మందిని విచారించాం. నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ, తిరుపతి -
రాజమండ్రిలో పోలీసు రాజ్యం
రాజమండ్రి :విపక్ష వైఎస్సార్ సీపీ నేతలను అణ చివేయాలనే లక్ష్యంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు చెలరేగిపోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడమే నేరంగా కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడి చేశారని ఒకసారి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మరోసారి కుంటిసాకులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన వారు సంఘ విద్రోహశక్తులన్నట్టు, తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రజల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నవారిని అరాచకవాదులన్నట్టు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఉద్యమించిన 26 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనారుుంచిన అర్బన్ జిల్లా పోలీసులు తాజాగా మరో పదిమందిపై కేసు నమోదు చేశారు. ఈసారి ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్నిలతోపాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. గతంలో పోలీసుల మీద దాడి చేశారని కేసు పెట్టిన ఆర్బన్ పోలీసులు ఈసారి కండిషనల్ బెయిల్‌పై విడుదలైన రాజాతోపాటు ఇతర నాయకులు ఈ నెల 7న కంబాలచెరువు వద్ద బహిరంగ సభలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఏఎస్పీ స్థాయి అధికారిని ఎమ్మెల్యే చెవిరెడ్డి, విజయలక్ష్మి బహిరంగంగా బెదిరించారని ఆరు సెక్షన్లతో కేసులు నమోదు చేయడం గమనార్హం. ప్రశ్నిస్తే నాన్ బెరుులబుల్ కేసు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజమండ్రిలో గత నెల 29న ఉద్యమించిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ర్యాలీ చేస్తున్న పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్, ఆదిరెడ్డి వాసులను ప్రకాశ్‌నగర్ పోలీసు స్టేషన్లో పెట్టారు. ప్రశ్నించేందుకు వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం నాయకుడు గణేష్‌లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం, సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడరు మేడపాటి షర్మిలారెడ్డిలను అరెస్టు చేసి గోకవరం తరలించిన విషయం తెలిసిందే. తొలుత ఏడుగురు, తరువాత 15 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తరువాత సంఖ్యను 26కు పెంచారు. రిమాండ్‌లో ఉన్న రాజా తదితరులు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాజాతో పాటు పార్టీ నాయకులపై కేసులు పెట్టడం ద్వారా పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల లక్ష్యం మా కుటుంబమే : జక్కంపూడి టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్న ప్రతిసారీ మా కుటుంబమే లక్ష్యంగా పోలీసులు అక్రమంగా కేసులు బనారుుంచి, జైలులో పెడుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నా భర్త, మాజీమంత్రి జక్కం పూడి రామ్మోహనరావుపై కక్షసాధింపునకు దిగి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళుతుండగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. బొమ్మూరులో ఒక మహిళపై అన్యాయంగా కేసు పెట్టినప్పుడు అడిగేందుకు వెళితే ఇలానే కేసులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చి నాతోపాటు మా ఇద్దరు కుమారుల మీద కూడా కేసులు పెట్టారు. అయినా భయపడేది లేదు. ఇవన్నీ ఊహించే న్యాయ పోరాటం చేసేందుకు న్యాయవాదిగా కోర్టుమెట్లు ఎక్కాను. నాకు అండగా పార్టీ అధినేత జగన్, జిల్లా క్యాడర్ ఉన్నారు. - జక్కంపూడి విజయలక్ష్మి -
ఖాకీచులాట
వరంగల్ క్రైం : వరంగల్ రూరల్, అర్బన్ పోలీసుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లా పోలీసు శాఖ అర్బన్, రూరల్‌గా విభజన చెంది మూడేళ్లకు పైగా కాగా... హెడ్క్వార్టర్స్లోకి కొన్ని విభాగాలు ఇప్పటికీ ఉమ్మడిగానే పనిచేస్తున్నాయి. ఇటీవల కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయూలు ఏర్పడ్డాయి. చిన్ని చిన్న విషయాల్లో ఇప్పటికే అనేక మార్లు మనస్పర్థలు వచ్చినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారు. కానీ... శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంఘటనతో అర్బన్, రూరల్ పోలీస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి వృత్తి సిబ్బందిపై ఆంక్షలు చిలికిచిలికి గాలివానగా మారి దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగిందంటే... ప్లంబర్, కార్పెంటరీ ఇలాంటి వృత్తి ఉద్యోగులు అటు అర్బన్‌కు, ఇటు రూరల్ కార్యాలయాలకు అవసరం వచ్చిన సమయంలో ఉమ్మడిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిపై అధికారిగా ఉన్న రూరల్‌కు చెందిన వ్యక్తి ఒకరు అర్బన్‌కు పనులు చేయొద్దని హుకుం జారీచేశారు. అనేక పర్యాయాలు అర్బన్‌కు పని ఉన్నప్పుడు సదరు సిబ్బంది వెళ్లకుండా అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా పలుమార్లు సిబ్బంది అర్బన్‌కు చెందిన పనులు చేయకపోవడంతో పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో సదరు అధికారి ఇలా చేయడం నచ్చని ఒక అర్బన్ అధికారి రూరల్ పోలీస్ పరేడ్‌కు వెళ్లొద్దని తన ఆధీనంలోని బ్యాండ్ కళాకారులను ఆదేశించారు. దీంతో రూరల్ పరేడ్ బ్యాండ్ ప్రదర్శన లేకుండానే ముగిసింది. ఈ విషయంపై ఆగ్రహించిన రూరల్ ఉన్నతాధికారి ఒకరు ‘మాకు బ్యాండ్ ఇవ్వరా’ అంటూ అర్బన్ అధికారులపై చిందులేశారు. అర్బన్ అధికారి కుర్చీ బయటపడేసి... బ్యాండ్‌ను అడ్డుకున్న అర్బన్ అధికారికి, ఇదే కేడర్‌లో ఉన్న రూరల్ అధికారి ఒకే గదిలో నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో అర్బన్‌కు ఈ పోస్టు ఉండేది కాదు. నాలుగు నెలల క్రితమే ఈ పోస్టు మంజూరైంది. మరో బిల్డింగ్ లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఒకే గదిని కేటాయించారు. అయితే శుక్రవారం జరిగిన ఘటన నేపథ్యంలో అర్బన్ అధికారి కుర్చీని రూరల్ అధికారి బయటకు విసిరేయించాడు. సదరు అర్బన్ అధికారికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని బయట పడేయడంతో హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్బన్, రూరల్ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి చేయిదాటుతోందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను పిలిపించి విషయం తెలుసుకున్నారు. అర్బన్ అధికారి తనకు జరిగిన అవమానాన్ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావును కలిసి వివరించారు. దీంతో రూరల్ అధికారులను అర్బన్ ఎస్పీ మందలించినట్లు తెలిసింది. మరో మారు ఇలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించినట్లు సమాచారం. దయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన గొడవ పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. -
శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం వద్దు
పగలు జరిగే దొంగతనాలపై దృష్టి పెట్టండి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు వరంగల్‌క్రైం : శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు అర్బన్ పోలీసు అధికారులకు సూచించారు. అర్బన్ పోలీసు విభాగం పనితీరుపై శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అర్బన్ పరిధిలోని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు, సీఐలు, సబ్ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పరిశోధన పురోగతి, గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతితోపాటు నిందితులను అరెస్టు చేయకపోవడానికిగల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష జరిపారు. శుక్రవారం హన్మకొండలోని గణేష్‌నగర్‌లో జరిగిన దోపిడీపై స్పందిస్తూ దోపిడీ జరిగిన తీరుపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అర్బన్ పరిధిలో రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించడంతో రాత్రి పూట జరిగే దొంగతనాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. అరుుతే కొద్దికాలంగా నగరంలో పగటి పూట చోరీలు జరగడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు కూడా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే అధికారులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ తీరు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యంగా చోరీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో అధికారులు తమ సమయాన్ని విశ్రాంతికి కేటాయించకుండా తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముమ్మర గస్తీ నిర్వహించాలన్నారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా కదలికలను గుర్తించాలన్నారు. అధికారులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామాల స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. జులాయిలపై దృష్టి పెట్టడంతోపాటు వారి వ్యక్తిగత అలవాట్లపై నజర్ పెట్టాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, ఓఎస్డీలు వాసుసేన, నాగరాజు కుమార్, అర్బన్ స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, రాజిరెడ్డి, ప్రభాకర్, రాజమహేంద్రనాయక్‌తో పాటు ఇన్స్పెక్టర్లు , ఆర్ఐలు, సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : అర్బన్ పరిధిలో దొంగతనాల నియంత్రణకు గతంలో చోరీలకు పాల్పడిన స్థానిక నేరస్తులను గుర్తించి, వారిపై నిఘా పెట్టాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అర్బన్ పోలీసు అధికారులను ఆదేశించారు. అర్బన్ పోలీస్ విభాగ పనితీరుపై శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్బన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు హాజరైన ఈ సమావేశంలో ఆయూ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, కేసుల పరిశోధన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతితోపాటు, నేరస్తులు అరెస్టు చేయలేకపోవడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో మేడారం జాతరతోపాటు అర్బన్ పరిధిలో నిర్వహించే ఆగ్రహంపహాడ్, అమ్మవారిపేట, లింగంపల్లి గ్రామాల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరపై ఆయన సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. వచ్చే నెల రెండో తేదీన జిల్లాలో నిర్వహించే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు అర్బన్ పరిధిలో ఏర్పాటు చేసిన 200 కేంద్రాల్లో సుమారు 81 వేల మంది హాజరుకానున్నారని, ఇందుకోసం అధికారులు తమ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించడంతోపాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్దేశించిన సమయాల్లో చేరేందుకు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ఎన్నికలను అర్బన్ పరిధిలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత విభాగం అధికారులకు కావాల్సిన సమాచారం అందజేయడంతోపాటు అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. అనంతరం శాంతిభద్రతలను సమీక్షిస్తూ మహిళలపై దాడులకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ బి. ఉమమహేశ్వర్‌రావు, డీఎస్పీలు మల్లారెడ్డి, రాజిరెడ్డి, ప్రకాశ్‌రావు, రవికుమార్, రమేశ్, ట్రైనీ డీఎస్పీ శిరీషారాఘవేందర్ పాల్గొన్నారు. -
చుట్టూ నేరగాన్లే
=నేరగాళ్ల అడ్డాగా జిల్లా సరిహద్దులు =పుత్తూరులో తీవ్రవాదుల ఉనికి వెల్లడి =వరదయ్యపాళెంలో దొంగనోట్లు స్వాధీనం =చిత్తూరు, గుడిపాల, పలమనేరు మార్గాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ =యాదమరి, కుప్పం మార్గాల్లో =బియ్యం అక్రమ రవాణా =ఎర్రావారిపాళెం, కుప్పంలో గంజాయి సాగు =తమిళనాడు, కర్ణాటక నుంచి నేరగాళ్ల రాక అంతర్రాష్ట్ర సరిహద్దులున్న చిత్తూరు జిల్లా నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. తీవ్రవాదుల ఉనికి నుంచి దొంగనోట్ల చెలామణి వరకు, ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి రేషన్ బియ్యం అక్రమరవాణా వరకు జిల్లా సరిహద్దులు నెలవుగా ఉంటున్నాయి. జిల్లాలోని సత్యవేడు, వరదయ్యపాళెం, కుప్పం, బి.కొత్తకోట, రామసముద్రం, వి.కోట, రామకుప్పం, పుత్తూరు, నగరి, గుడిపాల, ఎస్ఆర్.పురం, పాలసముద్రం మండలాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 30-40 కి.మీ.దూరంలో ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రాల నేరగాళ్లు ఈ ప్రాంతాల్లో చేరి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల వరుసగా వెలుగుచూసిన నేర సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంచలన నేరాలకు అడ్డాగా మారుతున్న సరిహద్దు ప్రాంతాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... తమిళనాడు, కర్ణాటక నుంచి నేరగాళ్ల రాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినవారు అక్కడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చిత్తూరు జిల్లాను కేంద్రంగా చేసుకుంటున్నారు. తిరుపతి అర్బన్ పోలీసులు రెండు నెలల కిత్రం అరెస్టు చేసిన గజదొంగ ఏలుమలై తమిళనాడు కాంచీపురానికి చెందినవాడు. ఇతని నుంచి అప్పట్లో రూ.70 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్, చిత్తూరు జిల్లాల పోలీసులకు ఇటీవల ప్రతి రోజూ 20 నుంచి వంద మంది వరకు పట్టుబడుతున్న ఎర్రచందనం నరికే కూలీలందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరువణ్ణామలై, వేలూరు, సేలం ప్రాంతాలకు చెందినవారే. అలాగే కర్ణాటకలో ఒక హత్యకేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తుపాకీతో తిరుమలకు వెళ్తుండగా ఆరునెలల క్రితం అలిపిరి టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లా సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంగా ఇలాంటి వారు మరెందరో ఉన్నట్టు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ శేషాచల కొండల్లోని వేల కోట్ల రూపాయల ఎర్రచందనం జిల్లా నుంచి అక్రమంగా దేశ,విదేశాలకు తరలిపోతోంది. ముఖ్యంగా గుడిపాల, యాదమరి, వి.కోట, రామసముద్రం, గంగవరం, వరదయ్యపాళెం, సత్యవేడు మార్గాల్లో, ఇటు మదనపల్లి నుంచి చిక్బల్లాపూర్ మీదుగా కర్ణాటక, తమిళనాడుకు తరలుతోంది. పోలీసులు, అటవీశాఖ ఎన్నిసార్లు దాడులు చేసి స్మగ్లర్లను, చెట్లు నరికే కూలీలను అరెస్టు చేసినా అక్రమరవాణా ఆగడం లేదు. తమిళనాడు నుంచి చెట్లు నరికే కూలీలు, కర్ణాటక నుంచి స్మగ్లర్లు జిల్లాలోకి ప్రవేశించి యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు గత ఐదేళ్లుగా స్మగ్లర్లు తరలించిన ఎర్రచందనం విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. వరదయ్యపాళెంలో దొంగనోట్లు తాజాగా రెండు రోజుల కిత్రం వరదయ్యపాళెంలో పోలీసులు రూ.20 వేల వరకు దొంగనోట్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఇవి ఎలా చేరాయి, ఈ దొంగనోట్లు తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకొ చ్చి ఎవరైనా చెలామణి చేశారా ?అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రవాదుల ఉనికి వెల్లడైన రెండువారాల్లోపే వరదయ్యపాళెంలో దొంగనోట్లు వెలుగుచూడడం సరిహద్దు ప్రాంతాల్లో నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది. తీవ్రవాదుల కలకలం పాతగుడ్డలు, చింతపండు వ్యాపారాల పేరిట అల్ఉమా తీవ్రవాదులు ఆరునెలలకు పైగా పుత్తూరులో నివాసం ఉంటూ సంచలనం సృష్టిం చారు. తమిళనాడు పోలీసుల సమాచారంతో మన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన పుత్తూరుకు తమిళనాడు సరిహద్దు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో సైంటిస్టులను కాల్చి చంపిన ఐఎంఏ తీవ్రవాదులు ఇద్దరిని పుంగనూరు నుంచి కర్ణాటక పోలీసులు పట్టుకెళ్లారు. పుంగనూరు కూడా కర్ణాటక సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొలాల్లో గంజాయి సాగు ఎర్రావారిపాళెం మండలంలోని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గజరాతి దిన్నె, శెట్టిపల్లి గ్రామాల్లో కొందరు రైతులు గంజాయి సాగు చేస్తూ ఇటీవల పట్టుబడడం సంచలనం రేపింది. ఇక్కడ సాగు చేసిన గంజాయిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. అలాగే కుప్పం ప్రాంతంలోనూ మూడు నెలల క్రితం గంజాయి సాగును కనుగొని ధ్వంసం చేశారు. జిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల మీదుగా గంజాయి, నాటు సారా అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. పక్క రాష్ట్రాలకు రేషన్ బియ్యం జిల్లాలో కిలో రూపాయికి ఇచ్చే రేషన్ బియ్యం కొన్ని చోట్ల డీల ర్ల చేతివాటం, మరి కొన్ని చోట్ల సివిల్ సప్లయిస్ సిబ్బంది సహకారంతో పొరుగు రాష్ట్రాలకు తరలుతోంది. అక్రమార్కులు ఈ బియ్యాన్ని సరిహద్దులు దాటించి వాటికి పాలిష్ వేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. వి.కోట, కుప్పం, రామకుప్పం, సత్యవేడు, వరదయ్యపాళెం, నగరి, గుడిపాల, చిత్తూరు, యాదమరి ప్రాంతాల నుంచి లోడ్లకు లోడ్లు రాత్రి సమయాల్లో రేషన్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోనూ అక్రమగా తరలుతున్న ఒక లారీ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో సీజ్‌చేశారు. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేస్తున్నా రేషన్ బియ్యం అక్రమంగా తరలడం మాత్రం ఆగడం లేదు. -
సర్ఫ్ పేరుతో దగా..
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఒక ప్యాకెట్ కొంటే రెండు ఉచితం అంటూ ఖమ్మంనగరంలోని యూపీహెచ్ కాలనీలో నకిలీ సర్ఫ్ విక్రయిస్తున్న ఎనిమిది మందిని ఖమ్మం అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికు ల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం స్థానిక యూపీహెచ్ కాలనీ వీధుల్లో కొందరు సేల్స్మెన్లు తిరుగూ సర్ఫ్ విక్రయం చేపట్టారు. కంపెనీ ప్రచారం కోసమని, రూ.120 చెల్లించి ఒక కేజీ సర్ఫ్ కొంటే రెండు కేజీలు ఉచితంగా ఇస్తున్నామని విక్రయాలు చేపట్టారు. కాలనీలోని ఓ మెకానిక్ షెడ్డు వారు ఈ సర్ఫ్‌ను కొనుగోలు చేసి ప్యాకెట్ చింపి చేతులు కడుక్కునేందుకు యత్నించారు. కానీ సర్ఫ్ నురుగు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వారిని ఈ విషయంపై గట్టిగా ప్రశ్నించడంతో ‘తాము నెలకు రూ.5 వేల వేతనంపై సర్ఫ్ విక్రయిస్తున్నామని, తమకు ఏమీ తెలియదని పోలీసులకు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విజయవాడ కేంద్రంగా ఈ సర్ఫ్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. వీరిచ్చిన సమాచారం మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన కటుకూరి నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్థానికులు వారి వద్ద కొన్న సర్ఫ్‌ను తిరిగి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నారు. పోలీసులు ఈ ఎనిమిది మంది వద్ద రూ. 8వేల నగదుతో పాటు మూడు బస్తాల్లో ఉన్న 225 సర్ఫ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎస్సై గణేష్‌ను వివరణ కోరగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కటుకూరి నాగరాజును మాత్రమే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు
సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమంతో ఎర్రచందనం స్మగ్లర్ల రూటు మారింది. పోలీసుల భయం కన్నా వరుస ఆందోళనలతో హైవేలు, గ్రామీణ రహదారుల్లో అవాంతరాలు ఏర్పడుతుండటంతో రైళ్లలో ఎర్రచందనం దుంగలు తరలించడం మేలు అన్న నిర్ణయానికి ఎర్ర దొంగలు వచ్చా రు. చామల రేంజ్లో నరికే దుంగలను పనపాకం, చంద్రగిరి వంటి స్టేషన్లకు రాత్రి సమయాల్లో, తెల్లవారు జామున తెచ్చి పట్టాల పక్కన ఉంచి ప్యాసింజరు రైళ్లు అగిన వెంటనే అందులో ఎక్కించి తీసుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా చిత్తూరు హైవే లేదా నాయుడుపేట రహదారిలో గాజులమండ్యం మీదుగా, శ్రీకాళహస్తి మీదుగా తడ మార్గం లోనూ చెన్నయ్‌కు ఎర్రచందనం దుంగలు తరలించేవారు. ఈ మార్గాల్లో రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలను అర్బన్ పోలీసులు ముమ్మరం చేశారు. దీనికితోడు పగటి పూట రహస్యంగా, పోలీసులు కనుక్కోలేని విధంగా వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నించిన హైవేల్లో సమైక్యాంధ్ర ఉద్యమ కారులు వంటవార్పులు, రాస్తారోకోలు, మానవహారాలకు దిగుతుండటంతో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు రోడ్లపైనే అగిపోతున్నాయి. ఈనేపథ్యంలో రోడ్డు మార్గంలో కన్నా రైలు మార్గమే సురక్షితం అనే వ్యూహంతో స్మగ్లర్లు రూటు మార్చినట్టు తెలుస్తోంది. రైల్వే పోలీసుల దృష్టి ఉండదు తిరుపతి నుంచి కాట్పాడి వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లలో పెద్దగా పోలీసు నిఘా ఉండదు. ఈ రైళ్లలో టీసీలు గానీ, జనరల్ ైరె ల్వే పోలీసు లేదా రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కూడా పెద్దగా పట్టించుకోదు. దీంతో ఇందులో ప్రయాణి ంచే వారి గురించి, రవాణా చేసే వస్తువుల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్యాసింజర్ రైళ్లు క్రాసింగ్ కోసం లేదా స్టాపింగ్ రీత్యా పనపాకం, చంద్రగిరి రైల్వేస్టేషన్ల వద్ద కచ్చితంగా నిలుపుతారు. ఈ సమయాన్ని ఎర్రచందనం అక్రమ రవాణాదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. చంద్రగిరి, పనపాకం రైల్వేస్టేషన్లు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంటాయి. సమీప అడవుల్లో నుంచి ఎర్రచందనం దుంగలు నరికి కాలిదారిన కూడా తీసుకు రావచ్చు. జనం దృష్టి పడకుండా, నిర్మానుష్యంగా ఉంటాయి. దీన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని ఎర్రచందనం పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారు. పనపాకం వద్ద పట్టుబడ్డ ఎర్ర కూలీలు ఇటీవల పనపాకం సమీపంలో అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన 15 మందికి పైగా కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని విచారించి, రిమాండ్‌కు పంపించారు. ఈ ప్రాంతంలో ఎర్రచందనం కూలీల కదలికలు ఉన్నాయంటే ఎర్రచందనం స్మగ్లింగ్ రైళ్ల ద్వారా సాగేందుకు అవకాశం ఉందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఈ తరహా ఎర్రచందనం స్మగ్లింగ్ పై అటు టాస్క్‌ఫోర్స్, ఇటు అటవీశాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.