విశాఖలో విజయోత్సవాలు, సంబరాలపై ఆంక్షలు!
విశాఖపట్నం: విశాఖ కమిషనరేట్ పరిధిలో రాజకీయ పార్టీల విజయోత్సవ సంబరాలపై నిషేధం విధించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నుంచి 16 వరకు విజయోత్సవ సంబరాలు నిషేధమని విశాఖ సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.
నిబంధనలకు వ్యతిరేకంగా కమిషనరేట్ పరిధిలో విజయోత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివధర్ రెడ్డి హెచ్చరించారు. విశాఖలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందన్నారు.
ఈనెల 16 తర్వాతే ముందస్తు అనుమతితో సంబరాలు జరుపుకోవాలని సీపీ శివధర్‌రెడ్డి సూచించారు.