'సోనియాను దెయ్యమని తిట్టినా.. తెలంగాణ ఇచ్చింది'
'సోనియాను దెయ్యమని తిట్టినా.. తెలంగాణ ఇచ్చింది'
Published Tue, Mar 4 2014 7:05 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
వరంగల్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని దెయ్యమని కేసీఆర్ తిట్టినా .. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేయమని ఎవరూ కేసీఆర్ ను అడగలేదని పొన్నాల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని పొన్నాల స్పష్టం చేశారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశమున్నా.. తెలంగాణ ఏర్పాటుకు ధైర్యంతో సోనియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చి.. ఎదో కుంటిసాకులు చెప్పడం తగదని, విలీన నిర్ణయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని.. అయితే సోనియాను విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదని పొన్నాల మండిపడ్డారు.
Advertisement
Advertisement