హైదరాబాద్: విజయవాడలో పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ విద్యార్థులకు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే కౌన్సెలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 3,693 మంది విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. తెలంగాణకు 788 పీజీ సీట్లు ఉండగా అందులో 508 నాన్ సర్వీసు, 280 సర్వీసు సీట్లుగా నిర్ధారించినట్లు వైద్య విద్యా సంచాలకులు పుట్టా శ్రీనివాస్ తెలిపారు. ఏడో తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని, మొదటిరోజు 800 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరిగేందుకు ఇద్దరు పరిశీలకులను కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉంచినట్లు ఆయన చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉండి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమీక్షిస్తానన్నారు.
పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రారంభం
Published Thu, Apr 30 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement