- వేగం పుంజుకోనున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి పోస్టుల విభజనతోపాటు ఉద్యోగులను కూడా విభజించడానికి ప్రధాని మోదీ అనుమతించారు. దీంతో ఈ రెండింటినీ ఒకేసారి చేపట్టి. విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆ కమిటీ అధికారులు శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 66 శాఖల పోస్టులను విభజించారు.
ఇప్పటికే పలు శాఖల పోస్టుల విభజన కు నోటిఫికేషన్‌ను జారీ చేయడంతోపాటు అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగిసింది. అలాంటి చోట ఉద్యోగులకు వెంటనే ఆప్షన్ పత్రాలివ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
పోస్టుల విభజనలో ఎలాంటి అభ్యంతరాలు లేని శాఖల్లో ఉద్యోగుల విభజన పూర్తిచేసి.. రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. కమలనాథన్ కమిటీనే ఉద్యోగులను విభజించి వారిని రెండు రాష్ట్రాలకు కేటాయించనుంది. ఆ తరువాత ఈ పోస్టింగ్‌లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనుందని అధికార వర్గాలు వివరించాయి.