హైదరాబాద్: ఉపాధ్యాయులు, ఉద్యోగులు నూతన వేతనాలు పొందేందుకు వీలుగా అనుంబంధ బిల్లుల స్వీకరణ గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్టు డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్ (డీటీఏ) తెలిపినట్లు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) వెల్లడించింది. డీడీవోలందరూ హెచ్‌ఆర్‌ఎంఎస్ ప్రోగ్రాం ద్వారా ఆన్‌లైన్‌లోనే నూతన వేతనాలు, బకాయిల బిల్లులను సమర్పించాలని, పీఆర్సీ వేతన స్థిరీకరణ కోసం ట్రెజరీ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు డీటీఏ వివరించినట్లు టీఎస్‌యూటీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు సేవా గ్రంథాలను అప్‌డేట్ చేసుకుని వేతన స్థిరీకరణకు అవసరమైన వివరాలను సిద్ధం చేసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. నర్సిరెడ్డి, చావ రవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నెలాఖరు వరకు పీఆర్సీ బిల్లుల స్వీకరణ
Published Sat, Apr 18 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement