తూర్పుగోదావరి జిలా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నిండు గర్భిణి వైద్యం అందక కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కళావతికి నెలలు నిండాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయం నొప్పులు వస్తుండటంతో ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో.. శనివారం ఒక్కరు కూడా లేరు.. దీంతో స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ చేసింది. అనంతరం కళావతి చనిపోయినట్టు ఆమె భర్త, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పోవడం వల్లే కళావతి చనిపోయిందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.