సదస్సు మధ్యలో చంద్రబాబుకు ప్రధాని ఫోన్! | Prime Minister phone to chandrababu naidu in the middle of the conference | Sakshi
Sakshi News home page

సదస్సు మధ్యలో చంద్రబాబుకు ప్రధాని ఫోన్!

Published Fri, Nov 7 2014 12:51 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

సదస్సు మధ్యలో చంద్రబాబుకు ప్రధాని ఫోన్! - Sakshi

సదస్సు మధ్యలో చంద్రబాబుకు ప్రధాని ఫోన్!

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేబినెట్‌లో చోటు కల్పించే అంశంపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు గురువారం ఫోన్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో మాట్లాడుతుండగానే ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది.

దీంతో చంద్రబాబు ఉన్నపళంగా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చారు. దీనిపై సమ్మిట్‌లో ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించగా ‘రెండు రోజుల్లో మీకూ తెలుస్తుంది కదా..’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి ఇదే విషయాన్ని వారు ప్రస్తావించగా ‘‘ఆయన (మోదీ) నా నుంచి సమాచారం కోరేందుకు ప్రయత్నిస్తుంటే నేనేమో ఆ సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నా’’ అంటూ చంద్రబాబు చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement