ప్రైవేట్ అంబులెన్స్‌లదే
Published Thu, Feb 13 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌ల హ వా కొనసాగుతోంది. దీంతో పేదల జేబులు గుళ్ల అవుతున్నాయి. రోగులకు ప్రైవేట్ అంబులెన్స్‌లకు మధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇం దుకు 30 శాతం వరకు కమీషన్‌ను పొందుతున్నారని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌ను ఎవరైనా అడిగితే పనిచేయడం లేదని ఆస్పత్రి సిబ్బం ది సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌ను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్యోగులు తక్కువ ధరకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని రోగి బంధువులను నమ్మించి నిర్వాహకుల సెల్ నంబర్లను రోగుల బంధువుల కు ఇచ్చి దగ్గర ఉండి ఫోన్ చేయిస్తున్నారు.
అలాగే రోగిని ఎక్కించే వరకూ సిబ్బంది అక్కడే ఉంటున్నారు. అత్యవసర విభాగంలో రోగులను ప్రతిరోజూ కేజీహెచ్‌కు తరలిస్తుంటారు. అయితే ఏ రోగిని రిఫర్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని కొందరు ఉద్యోగులు అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. విశాఖపట్నం వెళ్లడానికి రోగి వద్ద రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అంబులెన్సులో రోగులకు తరలిస్తే ఎటువంటి చార్జీలుండవు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ సీతారామరాజు వద్ద ప్రస్తావించగా ప్రైవేటు అంబులెన్స్‌కు సహకరిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానన్నారు.
Advertisement