Dominant
-
నియామకాల్లో హిందీ ఆధిపత్యం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్ టీచర్ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్. నియామక పరీక్షలో ఇంగ్లిష్ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్‌గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య కారణం. పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ సెక్రటేరి యట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి. నాగటి నారాయణ వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు మొబైల్: 94903 00577 -
ఆలయంలోకి ప్రవేశించొద్దని పెళ్లి బృందంపై దాడి..
భోపాల్: దేశంలో దళితులపై వివక్షతను రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు .. ఇండోర్ జిల్లాకు చెందిన వికాస్ కల్మోడియా అనే గిరిజన యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో, అతను స్థానిక ఆలయానికి చేరుకున్నాడు. కొంత మంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించేది లేదని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, వివాహ బృందంపై దాడికి తెగపడ్డారు. ఈ క్రమంలో వరుడి తండ్రి ఓం ప్రకాశ్ తమపై దాడిచేసిన యువకులపై స్థానిక మన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరితో పాటు మరో 9 మంది గుర్తు తెలియని యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులను నమోదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న మన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎంలు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారని, కానీ వారిలో వారే పోట్లాడుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ బుధవారం 5 లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇప్పటికే నీరసించిన కాంగ్రెస్.. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ పనితీరు వల్ల బీజేపీకి ఏమాత్రం పోటీనిచ్చే స్థితిలో లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మధ్యప్రదేశ్‌లో లేవనెత్తడానికి కాంగ్రెస్‌కు ఎలాంటి సమస్యలు కనిపించడం లేదని, అందుకే నిస్సహాయ స్థితిలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఫొటోలను చూపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కొత్తగా ఓటేయబోతున్న బాలికల్లో 90 శాతం మంది బీజేపీకే మద్దతిస్తున్నట్లు తాను ఓ టీవీ కార్యక్రమంలో చూశానని అన్నారు. వాటిని వినోదంగానే చూడండి.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌సింగ్‌లను మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. కానీ వారిలో ఒకరంటే ఒకరికి పడదు. మరో డజను మంది కూడా సీఎం పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. వారెవరూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరు’ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న తప్పుడు సమాచారానికి ఎలా స్పందించాలని ఓ కార్యకర్త ప్రశ్నించగా..అలాంటి వార్తలను వినోదంగానే భావించాలని సూచించారు. సీతారాముల వివాహ ఊరేగింపునకు మోదీ డిసెంబర్ 12న అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు జరిగే సీతారాముల ప్రతీకాత్మక వివాహ ఊరేగింపు కార్యక్రమానికి మోదీని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఆహ్వానించనున్నారు. మోదీకి త్వరలో∙ ఆహ్వానం వస్తుందని మీడియాలో వార్తలొచ్చాయి. బరాత్‌ను రాముని జన్మస్థలం అయోధ్య నుంచి సీతాదేవి పుట్టినిల్లు జనక్‌పూర్‌కు మోదీ తీసుకురానున్నారు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 21న ఎర్రకోటలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. -
జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు
జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు మరోమారు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం ఉన్న పెదదండ్లూరులో రామసుబ్బారెడ్డి ఆదివారం విందుకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఆది అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎందుకు పిలిచారని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎమ్మెల్యే ఆది టీడీపీలో చేరికను మొదటి నుంచి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
పేరు మహిళా సంఘాలది..అధికారం తమ్ముళ్లది..
పాలకొండ రూరల్/వీరఘట్టం: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఇసుక రీచ్‌ల నిర్వహణ వారికి అప్పగించామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. మహిళల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతాయని చెబుతోం ది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. టీడీపీ స్థానిక నేతలు రీచ్‌ల్లో అధికారం చలాయిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులను అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. ఎక్కడికక్కడ రీచ్‌లను తమ ఆధీనంలో ఉంచుకుని అడ్డంగా లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నారు. జిల్లాలో ని ఆకులతంపర, అల్లెన, దంపాక, కాఖండ్యాం, కల్లేపల్లి, యరగాం, బత్తేరు, తలవరంలలో ఇప్పటికే ర్యాంపులు కొనసాగుతున్నాయి. పురుషోత్తపురం, పెద్దసవలాపురం ల్లో రీచ్‌లు గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రారం భం కాలేదు. ఇప్పటికే ఇసుక తోడుతున్న అన్ని ప్రాంతాల్లో మహిళా సంఘాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రీచ్‌లున్న ప్రాంతాల్లో స్థానికంగా బోలెడన్ని సమస్యలు లేవనెత్తాయి. ప్రతి రీచ్‌లోనూ టీడీపీ నేతల హవా కొనసాగుతోంది. రీచ్‌ల వద్ద ఆధిపత్య పోరు గ్రామాల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలతో ఆదిపత్యపోరు తొలినుంచి జరుగుతున్న మాట బహిరంగ సత్యం. ఇటీవల పాలకొండలో నియోజకవర్గ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో రోడ్డున పడిన విషయం ఇందుకు నిదర్శనం. ఇదే తీరును ఇసుక ర్యాంపుల వద్ద కూడా ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు తమవర్గానికంటే తమవర్గానికి పైచేయంటూ నిర్వాహక మహిళా సంఘాలపై తీవ్ర ఒత్తిడిలు తెస్తున్నట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు దంద్వవైఖరి కారణంగా ప్రభుత్వమే నష్టపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ప్రారంభం కానివద్ద స్థానిక అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అభివృద్ధి పనులకని చెప్పి ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక తరలించుకుపోతున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల మధ్య పొసగని సయోధ్యల కారణంగా రీచ్‌లు నిర్వహిస్తున్న మహిళా సంఘాలు, పర్యవేక్షిస్తున్న అధికారులు సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించలేని పరిస్థితి దాపురించింది. అవగాహన లేకపోవడం వల్లే గ్రామీణ ప్రాంత స్వయంశక్తి సంఘాలకు మైనింగ్ విభాగంపై ఏమాత్రం అవగాహన తెలుస్తోంది. ఇసుక రీచ్‌లు, క్యూబిక్ మీటర్లు, వేబ్రిడ్జిలు, నిబంధనలకు సంబంధించిన పలు ధ్రువపత్రాలు అంటే ఏమిటో కూడా వీరికే మాత్రం తెలియదని అధికారులే చెబుతున్నారు. వేబిల్లులు అసలు, నకిలీ తేడా కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. కొందరు లారీకి వెనుక భాగంలో రెండు అడుగుల మేర పొడుగు పెరిగేలా ప్రత్యేక రేకులను ఏర్పాటు చేసి ఇసుక తరలించుకుపోతున్నారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో జరుగుతోంది. తాజాగా వీరఘట్టం మండలంలోని ఇసుకరీచ్‌లను నియోజకవర్గ ఎమ్మెల్యే కళావతి సందర్శించినప్పుడు అక్కడ స్వయం శక్తి సంఘాల మహిళలు మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారని, అడిగితే ఖబడ్దార్ అంటూ భయపెడుతున్నార ని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తలవరం తొలి నుంచి వివాదమే వీరఘట్టం మండలం తలవరం ఇసుక ర్యాంపు నవంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి వివాదస్పదంగానే నడుస్తోంది. ప్రారంభించి 20 రోజులు గడవక ముందే లక్షల్లో ఇసుక తరలిపోయిందని వివాదాలు మొదలయ్యాయి. తాజాగా మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన ఒకే బిల్లుపై అధిక లోడ్లును తీసుకువెళ్లారంటూ అధికారులే గుర్తించారు. అక్రమార్కులను వదలం వీరఘట్టం: తలవరం ర్యాంపులో ఇసుక అక్రమాలకు పాల్పడింది ఎవరైనా ఉపేక్షించేది లేదని..వారిని వదిలి పెట్టం అని పాలకొండ ఆర్డీఓ సాల్మన్‌రాజ్ అన్నారు. మంగళవారం ర్యాంపు వద్ద నకిలీ ధ్రువపత్రాలను పరిశీలించారు. నకలీ ధ్రువపత్రాలను ఎలా గుర్తించారని కమ్యూనిటీ సర్వేయర్ దుర్గారావు, ర్యాంపు నిర్వాహకురాలు గేదెల లక్ష్మి, మండల సమైఖ్య అధ్యక్షురాలు కె.లలితకుమారిని అడిగి తెలుసుకున్నారు. నకలి బిల్లులకు కారణమైన మీ సేవ కేంద్రంను రద్దు చేస్తామన్నారు.దోషులను పట్టుకుంటాం: నకిలీ బిల్లులతో ఇసుకను తరలించుకు పోయిన దోషులను పట్టుకుంటామని పాలకొండ సర్కిల్ ఇన్ప్క్టెర్ ఎన్.వేణుగోపాలరావు అన్నారు. మంగళవారం ర్యాంపు వద్ద నకిలీ ధ్రువపత్రాలను పరిశీలించి ర్యాంపు నిర్వాహకుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైనింగ్ అధికారుల కొలతలు వీరఘట్టం: తలవరం ఇసుక ర్యాంపులో మైనింగ్ అధికారులు మిగిలి ఉన్న ఇసుక నిల్వలకు మంగళవారం కొలతలు వేశారు. ఇంతవరకు ఎంత ఇసుకను విక్రయించారు, మిగిలిన ఇసుక ఎంత ఉంది అనే లెక్కలు టేపు ద్వారా కొలిచారు. ఈ వివరాలను జాయింట్ కలెక్టరు దృష్టి తీసుకువెళ్లనున్నట్లు మైనింగ్ జేఈ వి.హనుమంతురావు తెలిపారు. ర్యాంపులో సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గతంలో గుర్తించామని, అయితే ప్రస్తుతం ఉన్న ఇసుక మరో పది రోజుల్లో విక్రయిస్తే ర్యాంపు పూర్తవుతుందన్నారు. -
జిల్లాలో ఫ్యాన్ హవా
సాక్షిప్రతినిధి, గుంటూరు :రాజకీయ కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలకు, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరులో విశ్వసనీయతకే పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు. జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ హవా కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికనుంచి, ప్రచారం ముగిసేవరకూ పార్టీ ముందంజలోనే ఉంది. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగాపనిచేశారు. నరసరావుపే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గుంటూరు పార్లమెంటు పరిధిలో వల్లభనేని బాలశౌరి, బాపట్ల పార్లమెంటు పరిధిలోని డాక్టర్ అమృతపాణిలు ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు సమన్వయంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపారు. దీనికి తోడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, జగన్ సోదరి షర్మిల జిల్లాలో రెండు, మూడు దఫాలుగా విస్తృతంగా పర్యటించారు. మండుటెండల్లో సైతం వీరి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ సభలకు వేలాదిసంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో జిల్లాలో పార్టీకి తిరుగులేదని తేలిపోయింది. రోజురోజుకూ పార్టీలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యర్థి వర్గాల్లో గుబులు మొదలైంది. ఫ్యాన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు యత్నాలు... వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకుని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో టీడీపీ అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, నరసరావుపేట, పెదకూరపాడు, గురజాల, తెనాలి, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తారు. చాలా ప్రాంతాల్లో ఓటుకు నోట్లు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయినా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల నిర్మాణం కోసమంటూ గ్రామాల వారీగా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. తాము ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫ్యాన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోతున్నామని తెలుగుదేశం శ్రేణుల్లో చర్చించుకోవడం గమనార్హం. -
ప్రైవేట్ అంబులెన్స్‌లదే
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌ల హ వా కొనసాగుతోంది. దీంతో పేదల జేబులు గుళ్ల అవుతున్నాయి. రోగులకు ప్రైవేట్ అంబులెన్స్‌లకు మధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇం దుకు 30 శాతం వరకు కమీషన్‌ను పొందుతున్నారని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌ను ఎవరైనా అడిగితే పనిచేయడం లేదని ఆస్పత్రి సిబ్బం ది సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌ను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్యోగులు తక్కువ ధరకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని రోగి బంధువులను నమ్మించి నిర్వాహకుల సెల్ నంబర్లను రోగుల బంధువుల కు ఇచ్చి దగ్గర ఉండి ఫోన్ చేయిస్తున్నారు. అలాగే రోగిని ఎక్కించే వరకూ సిబ్బంది అక్కడే ఉంటున్నారు. అత్యవసర విభాగంలో రోగులను ప్రతిరోజూ కేజీహెచ్‌కు తరలిస్తుంటారు. అయితే ఏ రోగిని రిఫర్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని కొందరు ఉద్యోగులు అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. విశాఖపట్నం వెళ్లడానికి రోగి వద్ద రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అంబులెన్సులో రోగులకు తరలిస్తే ఎటువంటి చార్జీలుండవు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ సీతారామరాజు వద్ద ప్రస్తావించగా ప్రైవేటు అంబులెన్స్‌కు సహకరిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానన్నారు.