లిఖిత హత్య కేసులో పురోగతి
అనంతపురం: చిన్నారి లిఖిత హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత తల్లి ఉమామహేశ్వరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన ఇలియాజ్తో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా తన కుమార్తె లిఖిత అదృశ్యమైనట్లు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ప్రవర్తనను గమనించి,నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా తరచూ ఇలియాజ్తో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
లిఖిల ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోగా తాను సొంతకారులో దొరిగిల్లుకు తీసుకెళ్లి పూడ్చి పెట్టానని నిందితుడు విచారణలో తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అతడికి సహకరించిన కారు డ్రైవరు హన్ను, మరో వ్యక్తి నౌషాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిందన్న కారణంతోనే లిఖితను స్విమ్మింగ్ పూల్లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూల్లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూడ్చి పెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.