likhita
-
వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
నిర్మల్: చదువుల తల్లులుగా నిలవాల్సిన వాళ్ల చావుల వెనుక కారణాలేంటి.? ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లిఖిత చనిపోవడం వెనుక సరైన కారణమేంటి..? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం ఇలా విద్యార్థుల బతుకులను ఎందుకు బలి తీసుకుంటోంది..? అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? ఇవీ..సాధారణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. ఈనెల 13న బలవన్మరణానికి పాల్పడిన సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక (17) మృతిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదేరోజు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా ఇప్పటికీ కారణాలు బయటపెట్టకపోవడం సందేహాలకు, క్యాంపస్ వాతావరణంపై అనుమానాలకు తావిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి తర్వాత గంగాబ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయిన లిఖిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు, వర్సిటీ వర్గాలు చెబుతున్నా.. ఏదో మిస్టరీ ఉందన్న వాదనలూ బలంగా ఉన్నాయి. రాత్రి 2.30 గంటల సమయంలో లిఖిత బయటకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె మరణంపై గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, అధికారులు చెప్పిన వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు ♦ విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పలు ప్రశ్నలూ సంధిస్తున్నాయి. ♦ పరీక్షలు రాస్తున్న సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ప్రాణం తీసుకునేదాకా ఎందుకు తీసుకువచ్చారు? ♦ తన మానసిక పరిస్థితిని అంచనా వేయకుండా ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు..? ♦ వర్సిటీలో విద్యార్థుల కోసం ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉండగా, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ♦ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరూ, ఎందుకు లోతుగా పరిశీలించడం లేదు? ♦ స్థానికంగా ఉంటానని ఇన్చార్జిగా వచ్ఛిన వీసీ వెంకటరమణ గెస్ట్‌గానే ఎందుకు వ్యవహరిస్తున్నారు? ♦ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వర్సిటీలో వాతావరణాన్ని, అక్కడి అధ్యాపకులు, ఇన్చార్జీల తీరును నిలదీస్తున్నాయి. దీనిపై సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆఫర్.. సూపర్!
న్యూఢిల్లీ: కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు మొదలైంది. సోమవారం మొదలై బుధవారం ముగిసిన రెండు ఐపీఓలకు మంచి స్పందనే లభించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి మరో మూడు కంపెనీలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, లిఖితా ఇన్ఫ్రా ఐపీఓలు రానున్నాయి. మరిన్ని వివరాలు.... క్యామ్స్ ఐపీఓ.. 47 రెట్లు స్పందన మ్యూచువల్ ఫండ్స్‌కు రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా వ్యవహరించే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓ 47 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.1,229–1,230 ప్రైస్‌బాండ్‌తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,242 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ ఈ వారంలోనే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లు సమీకరించింది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.340–360 రేంజ్లో ఉంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. 29 నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ బ్యాండ్ రూ.117–120 ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల సేవలందించే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. రూ.117–120 ప్రైస్‌బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో భాగంగా 25.86 శాతం వాటాకు సమానమైన 51 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. వచ్చే నెల 12న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. శ్రీనివాసరావు గడ్డిపాటి, లిఖిత గడ్డిపాటిలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ భారత్–నేపాల్‌ల మధ్య పైప్‌లైన్ నిర్మాణాన్ని ఇటీవలనే పూర్తి చేసింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా యూనిస్టోన్ క్యాపిటల్ వ్యవహరిస్తోంది. వచ్చే వారమే మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఇష్యూ! ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ కూడా ఈ నెల 29 నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–550 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ప్రైస్‌బ్యాండ్‌ను ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. రూ.140–150 రేంజ్లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ లాట్ 90–100 షేర్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ షేర్లు వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల రిపేర్లు నిర్వహిస్తోంది. ఇతర క్లయింట్ల వాణిజ్య నౌకల రిపేర్లను కూడా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,566 కోట్ల ఆదాయంపై రూ. 415 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఐపీఓకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. కెమ్‌కాన్ ఐపీఓ...149 రెట్లు కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ 149 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.338–340 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.318 కోట్లు సమీకరించనున్నది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.310–320 రేంజ్లో ఉంది. ఈ కంపెనీ గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.95 కోట్లు సమీకరించింది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ నేడు (గురువారం) ముగుస్తోంది. యూటీఐ ఏఎమ్‌సీ 29 నుంచి.. యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలవుతుందని సమాచారం. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్ రూ.750–760 రేంజ్లో ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.170–180 రేంజ్లో ఉంది. వచ్చే నెల 12న యూటీఐ ఏఎమ్‌సీ షేర్లు స్టాక్మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వ్యవహరిస్తున్నాయి. -
రాలిన పసి మొగ్గ
చిన్నారిని చిదిమేసిన స్కూలు బస్సు పద్మనాభం: స్కూలు బస్సు దిగి మరికాసేపట్లో ఇంటికి చేరాల్సిన చిన్నారి ‘చితి’కిపోయింది.. అమ్మ ఒడి చేరాలని, ఆడి పాడాలని హుషారుగా అడుగేసిన పసి మొగ్గ అంతలోనే రాలిపోయింది.. బస్సు దిగిందో లేదో గమనించకుండా డ్రైవర్ బస్సు కదిలించడంతో ఒక్కసారిగా తూలిపడిన పాపాయి చక్రాల కింద నలిగిపోయింది.. పోలీసులు అందించిన వివరాలు.. సామయ్యవలస గ్రామానికి చెందిన రొంగలి లిఖిత (5) కృష్ణాపురం స్ప్రింగ్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. రోజూ స్కూల్ బస్సులోనే పాఠశాలకు వచ్చి వెళుతుంటుంది. బుధవారం సాయంత్రం బడి ముగిశాక స్కూల్ బస్సులో సామయ్యవలస వెళ్లింది. బస్సు దిగుతుండగానే డ్రైవర్ బస్సును లాగించడంతో టైర్ల కింద పడి కడుపు భాగంలో బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను తగరపువలసలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరుకు బస్సు డ్రైవర్ కనకల శ్రీనుపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రొంగలి అప్పన్న, సీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లిఖిత మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. -
లిఖిత హత్య కేసులో పురోగతి
అనంతపురం: చిన్నారి లిఖిత హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత తల్లి ఉమామహేశ్వరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన ఇలియాజ్తో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా తన కుమార్తె లిఖిత అదృశ్యమైనట్లు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ప్రవర్తనను గమనించి,నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా తరచూ ఇలియాజ్తో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిఖిల ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోగా తాను సొంతకారులో దొరిగిల్లుకు తీసుకెళ్లి పూడ్చి పెట్టానని నిందితుడు విచారణలో తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అతడికి సహకరించిన కారు డ్రైవరు హన్ను, మరో వ్యక్తి నౌషాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిందన్న కారణంతోనే లిఖితను స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూడ్చి పెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.