umamaheswari
-
ఎంతో ఆనందంగా ఉంది..
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ‘కుమార సంభవం’ కథే ఇప్పుడు దేశ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది. ఈమె సావిత్రి, భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో దిట్ట. నాన్న లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడం, అమ్మ సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళా రంగాన్ని ఎంచుకున్న ఉమామహేశ్వరి రాష్ట్రం గర్వపడేలా ఎదిగారు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాన్ దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు కూడా. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నా.. ఓనమాలు మాత్రం బందరులో నేర్చుకోవడంతో జిల్లా కళాకారులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకోనున్న ఉమామహేశ్వరి తనను అవార్డు వరించడంపై స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. సరదాగా నేర్చుకున్న కథే ఈ స్థాయికి చేర్చింది: 14వ ఏట హరికథకు జీవితం అంకితం చేశాను. అలా సరదాగా మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవంను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎన్నో ప్రదర్శనలిచ్చాను. పదికిపైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథలు నేర్చుకున్నాను. దేశ, విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్నాను. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాను. ఇవికాక.. యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరై సంస్కతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాట్యకారుడు, భర్త కళాకృష్ణతో హైదరాబాదులోని బేగంపేటలో ఉంటున్నాం. అమ్మనాన్నలు మరణించాక మచిలీపట్నంకు రావడంలేదు. మేం ఇక్కడ ఉంటున్నా నన్ను ఈ స్థాయికి చేరేలా ఓనమాలు దిద్దించిన బందరు అంటే ప్రేమే. -
హరికథే ఆమె కథ
14వ ఏట నుంచి డి.ఉమామహేశ్వరి హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 'సంస్కృతం’లో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణి.తెలుగులో ఆమె చెప్పే హరికథలకు విశేష అభిమానులు ఉన్నారు.ప్రతిష్ఠాత్మక సంగీత్ నాటక్ అకాడెమీ పురస్కారాన్ని న్యూఢిల్లీలో నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.అక్కడి రబీంద్ర భవన్లో ఫిబ్రవరి 24న ప్రదర్శన ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ‘‘మాది బందర్ (మచిలీపట్నం). మా నాన్న లాలాజీ రావు నాదస్వర విద్వాంసుడు. వేములవాడ దేవస్థానంలో 30 ఏళ్ల పా టు నాదస్వర వాదన చేశాడాయన. మేము వేములవాడలో ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా బందర్‌కు తీసుకెళ్లేవాడు. అక్కడ నేను హరికథలు వినేదాన్ని. మా చిన్నప్పుడు కోట సచ్చిదానంద శాస్త్రిలాంటి వారు 40 రోజుల పా టు మహాభారతం చెప్పేవారు. జనం విరగబడేవారు. సినిమాహాళ్ల యజమానులొచ్చి హరికథను ముగించమని, జనం సినిమాలకు రావడం లేదని బతిమిలాడేవారు. అలా హరికథ నా మనసులో ముద్ర వేసింది. హరికథా గురుకులంలో... తూ.గో.జిల్లా కపిలేశ్వరపురంలో జమీందారు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి రాజరాజేశ్వరి గారు డాన్స్ స్కూల్ స్థాపించాలనుకున్నారు. కాని నటరాజ రామకృష్ణ గారు ఇది తెలిసి డాన్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి హరికథ కళ అంతరించిపోతోంది... దాని కోసం స్కూల్ తెరువు అనంటే రాజావారు తన తండ్రి పేరున శ్రీ సర్వరాయ హరికథా గురుకులం స్థాపించారు. మా నాన్న ఇది తెలిసి నన్ను అక్కడ చేర్పించారు. 14 ఏళ్ల వయసులో అక్కడ చేరి ఆదిభట్ల నారాయణదాసు ఏ సంప్రదాయం హరికథకు స్థిరపరిచారో ఆ సంప్రదాయంలోనే నేర్చుకున్నాను. నాతో పా టు మరో 40 మంది అమ్మాయిలు హరికథను నేర్చుకున్నారు. హరికథ చెప్పాలంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతం, తెలుగు తెలిసి ఉండాలి. ఆటా పా టా మాట... వీటిని మేటిగా మేళవిస్తూ రక్తి కట్టేలా కథ చెప్పాలి. గురువుల దయవల్ల నేను నేర్చుకోగలిగాను. విజయనగరం సంస్కృత పా ఠశాలలో నా తొలి ప్రదర్శన ఇచ్చాను. సంస్కృతంలో హరికథ తెలుగులో హరికథలు చాలామంది చెబుతారు. కాని అవి తెలుగువారికి మాత్రమే పరిమితం. దేశంలో వేద విద్యను సంస్కృతంలో అభ్యసిస్తున్నవారు, సంస్కృత స్కాలర్లు, టీచర్లు, ఆ భాష ప్రేమికులు చాలామంది ఉన్నారు. వారి కోసం సంస్కృతంలో హరికథలు చెప్తే బాగుండునని అనుకున్నాను. ఎన్.పి.హెచ్.కృష్ణమాచార్యులు గారు కాళిదాసు కావ్యాలను హరికథలుగా రాసి ఇచ్చారు. ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట ‘అభిజ్ఞాన శాకుంతలం’ చెప్పడంతో నేను ఆ భాషలో చెప్పే తొలి మహిళను అయ్యాను. కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ... వీటిని హరికథలుగా సంస్కృతంలో చెబుతున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరయ్యి సంస్కృతంలో హరికథ చెప్పాను. ప్రశంసలుపొందాను. భక్తిమార్గం కొందరు సినిమా పా టలను కలిపి హరికథలు చెబుతుంటారు. అది నా మార్గం కాదు. సరిగా హరికథ చెప్తే నేటికీ ప్రేక్షకులు ఎందరో వస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన ఔత్సాహికులకు ఈ కళను నేర్పిస్తున్నాను. ఆదిభట్ల గారి మునిమనవరాళ్లకు నేర్పించాను. కాని ఈ కళ కోసం మరింత జరగాల్సి ఉంది. భర్తతో కలిసి మా ఆయన కళాకృష్ణ ప్రసిద్ధ నాట్యకారుడు. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. మేమిద్దరం శక్తి ఉన్నంత కాలం మా కళను ప్రదర్శిస్తూ కొత్త తరాలకు నేర్పిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాం.’’ -
ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి బుధవారం మీడియాతో మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబును నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబాన్ని చూస్తే జాలేస్తుందని చెప్పారు. హరికృష్ణ మరణానికి కూడా బాబే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు కారణంగా హరికృష్ణ మానసిక క్షోభ అనుభవించాడని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదు.. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమనే అనుమానం కలుగుతోందన్నారు. ఆత్మహత్యకు ముందు ఉమామహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ చంద్రబాబు అక్కడకు చేరాకే మాయమైందన్నారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలోనే లేదన్నారు. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారని.. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కోడెల మృతికీ బాబే కారణం.. గతంలో కోడెల శివప్రసాదరావు మరణానికి కూడా చంద్రబాబే కారణమని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆయనను బాబు చాలా దారుణంగా మోసం చేశాడన్నారు. అదే వి«షయాన్ని కోడెల స్వయంగా తన ఫోన్లో రికార్డు చేసుకున్నారని చెప్పారు. దాంతో ఆ ఫోన్‌నే మాయం చేశారన్నారు. కోడెలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవతారకం ఆస్పత్రికి తీసుకుపోయారని గుర్తు చేశారు. దీంతో ఆయన మరణించారన్నారు. ఆ తర్వాత కోడెల భౌతికకాయాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏ స్థాయిలో రాజకీయాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడని మండిపడ్డారు. ఆ తర్వాత తన కొడుకు కోసం అదే జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేశాడన్నారు. చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో శని.. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబంలోకి శనిలా చంద్రబాబు ప్రవేశించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బాబు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమై ఆ పేరును వాడుకుం టున్న దుర్మార్గుడు బాబని ధ్వజమె త్తారు. పార్టీ పేరుతో రూ.లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. చంద్ర బాబు వెంటనే ఎన్టీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. బాల కృష్ణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య అంతా ఓ మిస్టరీలా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయన్నారు. బాబు మనస్తత్వం, అతడి నీచ, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరైనా కొన్నిం టిని అనుమానించక తప్పదని చెప్పారు. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్న తో పెట్టిన విద్య అన్నారు. హరికృష్ణ మరణానికీ పరోక్షంగా బాబే కారణమని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇప్ప టికీ ఆయనతో మాట్లాడరని తెలిపారు. -
కిడ్నాప్ గ్యాంగ్ పట్టివేత
కుత్బుల్లాపూర్: శుక్రవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన యువతిని షేక్ బషీరాబాద్ పోలీసులు రక్షించారు. మెదక్ జిల్లా పటాన్చెరువు వద్ద కిడ్నాప్ గ్యాంగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి ఉమామహేశ్వరీ కాలనీకి చెందిన రేణుక(19) అనే యువతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కిడ్నాప్ అయింది. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. గతంలో యువతితో నిశ్చితార్థం జరిగిన వినోద్ అనే వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. వినోద్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాకు చెందిన వ్యక్తి. షేక్‌బషీరాబాద్ సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ పక్కా పథకం ప్రకారం కిడ్నాపైన 2 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. -
లిఖిత హత్య కేసులో పురోగతి
అనంతపురం: చిన్నారి లిఖిత హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత తల్లి ఉమామహేశ్వరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన ఇలియాజ్తో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా తన కుమార్తె లిఖిత అదృశ్యమైనట్లు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ప్రవర్తనను గమనించి,నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా తరచూ ఇలియాజ్తో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిఖిల ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోగా తాను సొంతకారులో దొరిగిల్లుకు తీసుకెళ్లి పూడ్చి పెట్టానని నిందితుడు విచారణలో తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అతడికి సహకరించిన కారు డ్రైవరు హన్ను, మరో వ్యక్తి నౌషాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిందన్న కారణంతోనే లిఖితను స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూడ్చి పెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.